త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Donald Trump | మాక్రాన్ వ‌ల్లే ఈ ప‌రిస్థితి.. పారిస్ ఒక ముస్లిం న‌గ‌రంగా మార‌బోతోంది : ట్రంప్

Donald Trump | అల్ల‌ర్ల‌తో ఫ్రాన్స్ (France) అట్టుడుకుతోంది. ఈ నేప‌థ్యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఫ్రాన్స్ అల్ల‌ర్ల‌కు విద్యా వ్యవస్థ లేదా ఇతర దేశీయ విధానాలు కార‌ణం కాద‌ని.. ఆ దేశ అధ్య‌క్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (Emmanuel Macron) అనుస‌రిస్తున్న వ‌ల‌స విధానాలే (immigration policies) కార‌ణ‌మ‌ని ఆరోపించారు. త్వ‌ర‌లోనే పారిస్ ఒక ముస్లిం న‌గ‌రంగా మార‌బోతోందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

D

International | Published On Oct 20, 2026, 2.07 pm IST

Donald Trump | మాక్రాన్ వ‌ల్లే ఈ ప‌రిస్థితి.. పారిస్ ఒక ముస్లిం న‌గ‌రంగా మార‌బోతోంది : ట్రంప్
Advertisement

Donald Trump | త్రినేత్ర న్యూస్ : ఫ్రాన్స్ (France)లో చెలరేగిన అల్లర్లు, నిరసనలకు ఆ దేశ అధ్య‌క్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (Emmanuel Macron) అనుస‌రిస్తున్న వ‌ల‌స విధానాలే (immigration policies) కార‌ణ‌మ‌ని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆరోపించారు. విద్యా వ్యవస్థ లేదా ఇతర దేశీయ విధానాల వల్ల ఈ పరిస్థితి తలెత్తలేదని వ్యాఖ్యానించారు. వలసల విషయంలో తాను గ‌తంలోనే హెచ్చ‌రించాన‌ని గుర్తు చేశారు. త‌న మాట‌ల‌ను పట్టించుకోక‌పోవ‌డం వ‌ల్లే ఇప్పుడు అశాంతి త‌లెత్తింద‌ని విమ‌ర్శించారు. అదేవిధంగా త్వ‌ర‌లోనే పారిస్ ఒక ముస్లిం న‌గ‌రంగా మార‌బోతోందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

"ఆయ‌న నా మిత్రుడే (మాక్రాన్‌ను ఉద్దేశించి). వ‌ల‌స‌ల విష‌య‌మై చాలా కాలంగా నేను ఆయ‌న్ని హెచ్చ‌రిస్తూనే ఉన్నాను. పెద్ద సంఖ్యలో వలసదారులను దేశంలోకి అనుమతించడం ప్రమాదకరమని చెబుతూనే ఉన్నాను. సరిహద్దులను కట్టుదిట్టం చేయాలని సూచించా. కానీ నా మాట‌లను ప‌ట్టించుకోలేదు. ఇప్పుడు ప్రపంచమంతా అక్కడికి వస్తోంది. పారిస్‌ త్వరలోనే ముస్లిం నగరంగా మారబోతోంది. మేం ఒప్పందం కుదుర్చుకున్నది దీనికోసం కాదు. వలసదారుల భారీ ప్రవాహం కారణంగా ఫ్రెంచ్ రాజధాని జనసాంద్రత, ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఫ్రాన్స్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి విచారకరం" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. వలసల సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్లే అశాంతి పెరుగుతోంద‌న్నారు. ఇతర యూరప్‌ దేశాల్లోనూ ఇదే తరహా పరిణామాలు కనిపిస్తున్నాయ‌ని చెప్పారు.

ఇది కూడా చ‌ద‌వండి.. భగ్గుమన్న ఫ్రాన్స్.. చారిత్రక భవనం దగ్ధం.. రోడ్డెక్కిన 8 లక్షల మంది

కాగా, ఫ్రాన్స్‌లో వారాంతంలో జ‌రిగిన అల్ల‌ర్లు, దోపిడీలు, నిర‌స‌న‌కారుల విధ్వంసం, ఘ‌ర్ష‌ణ‌ల నేప‌థ్యంలో అక్క‌డి ప్ర‌భుత్వం పారిస్‌, లిల్లె, నైస్ తదిత‌ర న‌గ‌రాల్లో కర్ఫ్యూ విధించిన విష‌యం తెలిసిందే. జ‌న‌స‌మూహాల‌పై ఆంక్ష‌లు అమ‌లు చేస్తోంది. ఈ త‌రుణంలో ట్రంప్ వ్యాఖ్య‌ల‌కు ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఈ అల్లర్ల సందర్భంగా సుమారు 2,400 మందిని అరెస్టు చేసినట్లు, దాదాపు 1,000 మంది పోలీసు అధికారులు గాయపడినట్లు ఫ్రెంచ్ అధికారులు వెల్లడించారు.

Also Read..

ర‌జ‌నీకాంత్ జైల‌ర్ 2 కోసం.. థియేట‌ర్ మొత్తాన్ని బుక్ చేసిన స్టార్ క్రికెటర్..!

పార్టీ మార‌గానే.. యూస‌ఫ్ ప‌ఠాన్‌కు బీజేపీ ప్ర‌భుత్వం భారీ గిఫ్ట్‌

ఉగ్ర‌వాదుల చేతుల్లోకి సున్నితమైన సాంకేతిక ప‌రిజ్ఞానం.. ఐరాస వేదిక‌గా భార‌త్ తీవ్ర ఆందోళ‌న‌

Advertisement
Advertisement