Bandi Bhagirath Bail | పోక్సో కేసు.. బండి భగీరథ్‌కు బెయిల్
Bandi Bhagirath Bail | పోక్సో కేసులో బండి భగీరథ్‌కు తాత్కాలికంగా బెయిల్ మంజూరైంది. రెండు వారాలకుపైగా రిమాండ్‌లో ఉన్న భగీరథ్‌కు మేడ్చల్ మల్కాజ్‌గిరి కోర్టు బెయల్‌కు అనుమతిచ్చింది.
Bandi Bhagirath Bail | త్రినేత్ర.న్యూస్: పోక్సో కేసులో బండి భగీరథ్‌కు తాత్కాలికంగా బెయిల్ మంజూరైంది. రెండు వారాలకుపైగా రిమాండ్‌లో ఉన్న భగీరథ్‌కు మేడ్చల్ మల్కాజ్‌గిరి కోర్టు బెయల్‌కు అనుమతిచ్చింది. అయితే బెయిల్‌కు సంబంధించిన షరతులను తప్పనిసరిగా పాటించాలని కోర్టు స్పష్టం చేసింది. పేట్ బషీరాబాద్ పోలీసులు గత మే 16న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. దాదాపు నెలరోజుల పాటు చర్లపల్లి జైల్లో ఉన్న భగీరథ్ శనివారం మధ్యాహ్నం విడుదలయ్యారు. ఇంజినీరింగ్ ఫైనల్ పరీక్షల నేపథ్యంలో ఈనెల 28 వరకు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇటీవల మైనర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో బాధిత బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బండి భగీరథ్‌పై కేసు నమోదైంది. పోలీసులు POCSO చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడిగా ఉన్న భగీరథ్‌ను కోర్టులో హాజరుపరిచారు. దీంతో న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఈ క్రమంలో భగీరథ్ తరఫు న్యాయవాదులు మల్కాజ్‌గిరి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శనివారం కోర్టులో ఇరుపక్షాల వాదనలను విన్న కోర్టు.. షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. దీంతో భగీరథ్ జైలు నుంచి విడుదలయ్యారు.
సంబంధిత వార్తలు

Mynampally Hanumanth Rao | కేటీఆర్.. నీ బట్టలిప్పి పరుగెత్తిస్తా: మైనంపల్లి తీవ్ర వ్యాఖ్యలు
జూన్ 20, 2026

RS Praveen Kumar | బాధితురాలికి అన్యాయం చేస్తే డిస్మిస్సే.. అనుమానముంటే ఆంధ్రా పోలీసులను అడగండి: ఆర్ఎస్ ప్రవీణ్
జూన్ 20, 2026

WhatsApp | ఇకపై వాట్సాప్ ద్వారా విద్యార్థుల సమాచారం.. డిజిటల్ బాటలో సర్కారు బడులు..
జూన్ 20, 2026
తాజావార్తలు
- ●Freelancers | ఫ్రీలాన్సర్లకు కీలక సమాచారం.. ఏ ఐటీఆర్ ఫామ్‌ను దాఖలు చేయాలి..?
- ●Modi-Trump | మోదీ గ్రేట్ లీడర్.. యుద్ధాలకు దూరంగా ఉంటారు.. ప్రధానిపై ట్రంప్ ప్రశంసల వర్షం
- ●Mynampally Hanumanth Rao | కేటీఆర్.. నీ బట్టలిప్పి పరుగెత్తిస్తా: మైనంపల్లి తీవ్ర వ్యాఖ్యలు
- ●Post Office Time Deposit | ఈ పోస్టాఫీస్ పథకంలో చేరితే వడ్డీనే రూ.5 లక్షలు లభిస్తాయి..!
- ●Rahul Gandhi | పిల్లల భవిష్యతుత్తో జూదం ఆడటం ఆపండి.. కేంద్రంపై రాహుల్ ఫైర్
- ●Indian Railway | ప్రయాణికులకు రైల్వే షాక్.. జరిమానాలు భారీగా పెంపు

Freelancers | ఫ్రీలాన్సర్లకు కీలక సమాచారం.. ఏ ఐటీఆర్ ఫామ్‌ను దాఖలు చేయాలి..?

Modi-Trump | మోదీ గ్రేట్ లీడర్.. యుద్ధాలకు దూరంగా ఉంటారు.. ప్రధానిపై ట్రంప్ ప్రశంసల వర్షం

Mynampally Hanumanth Rao | కేటీఆర్.. నీ బట్టలిప్పి పరుగెత్తిస్తా: మైనంపల్లి తీవ్ర వ్యాఖ్యలు

Post Office Time Deposit | ఈ పోస్టాఫీస్ పథకంలో చేరితే వడ్డీనే రూ.5 లక్షలు లభిస్తాయి..!



