త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hasina’s Extradition Case | షేక్ హ‌సీనా అప్ప‌గింత‌పై విదేశాంగ శాఖ కీల‌క వ్యాఖ్య‌లు..!

Hasina's Extradition Case | బంగ్లాదేశ్‌లో తిరుగుబాటుతో భార‌త్‌కు వ‌చ్చి త‌ల‌దాచుకుంటున్న మాజీ ప్ర‌ధాని షేక్ హ‌సీనా భ‌విష్య‌త్‌పై ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఆమెను అప్ప‌గించాలంటూ కోరుతూ దాఖ‌లైన పిటిష‌న్‌ను ప‌రిశీలిస్తున్న‌ట్లు భార‌త ప్ర‌భుత్వం తొలిసారిగా అధికారికంగా అంగీక‌రించింది.

P

International | Published On Apr 17, 2026, 4.54 pm IST

Hasina’s Extradition Case | షేక్ హ‌సీనా అప్ప‌గింత‌పై విదేశాంగ శాఖ కీల‌క వ్యాఖ్య‌లు..!
Advertisement

Hasina's Extradition Case | బంగ్లాదేశ్‌లో తిరుగుబాటుతో భార‌త్‌కు వ‌చ్చి త‌ల‌దాచుకుంటున్న మాజీ ప్ర‌ధాని షేక్ హ‌సీనా భ‌విష్య‌త్‌పై ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఆమెను అప్ప‌గించాలంటూ కోరుతూ దాఖ‌లైన పిటిష‌న్‌ను ప‌రిశీలిస్తున్న‌ట్లు భార‌త ప్ర‌భుత్వం తొలిసారిగా అధికారికంగా అంగీక‌రించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ హసీనాను అప్పగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను స‌మీక్షిస్తున్నామ‌ని, ఇది మా న్యాయ, అంతర్గత చట్టపరమైన ప్ర‌క్రియ‌లో భాగ‌మ‌న్నారు.

ఈ విష‌యంలోపై సంబంధిత ప‌క్షాల‌న్నింటితో నిర్మాణాత్మ‌క చ‌ర్చ‌లు కొన‌సాగిస్తామ‌ని, ప్ర‌స్తుత ప‌రిణామాల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్నామ‌న్నారు. బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వంతో నిర్మాణాత్మక సంబంధాలు కొనసాగించాలని విదేశాంగ మంత్రి ఆకాంక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. పొరుగు దేశంతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భార‌త్ లక్ష్యంగా పెట్టుకుంద‌ని, ద్వైపాక్షిక యంత్రాంగంతో ఈ భాగ‌స్వామ్యాన్ని మ‌రింత బ‌లోపేతం చేసే ప్ర‌తిపాద‌న‌ల‌ను కొన‌సాగించేందుకు ఇరుదేశాలు అంగీక‌రించాయ‌ని తెలిపారు.

Advertisement
Advertisement