Trains Cancelled | ప్రయాణికులకు అలర్ట్.. శాతవాహన, గోల్కొండ ఎక్స్‌ప్రెస్ సహా పలు రైళ్లు రద్దు..
Trains Cancelled | ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలో ఉన్న రాయనపాడు రైల్వే యార్డులో ఆధునిక సాంకేతిక మార్పులు, ట్రాక్ పునరుద్ధరణ, మౌలిక సదుపాయాల మెరుగుదల పనులను దక్షిణ మధ్య రైల్వే (SCR) చేపట్టింది.
Trains Cancelled | త్రినేత్ర.న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలో ఉన్న రాయనపాడు రైల్వే యార్డులో ఆధునిక సాంకేతిక మార్పులు, ట్రాక్ పునరుద్ధరణ, మౌలిక సదుపాయాల మెరుగుదల పనులను దక్షిణ మధ్య రైల్వే (SCR) చేపట్టింది. నిర్వహణ పనులు ఈ నెల 28 నుంచి మే 5 వరకు కొనసాగనున్నాయి. దీంతో ఆ మార్గంలో నడిచే పలు కీలక రైళ్లను (Trains Cancelled) అధికారులు రద్దు చేశారు. వాటిలో శాతవాహన (Satavahana), గోల్కొండ (Golconda), గౌతమి ఎక్స్‌ప్రెస్ కూడా ఉన్నాయి.
శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ను మే 2 నుంచి 5 వరకు రద్దు చేశారు. అత్యంత రద్దీగా ఉండే గోల్కొండ ఎక్స్‌ప్రెస్, గౌతమి ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా నిర్ణీత కాలంలో అందుబాటులో ఉండవు. వీటితోపాటు గుంటూరు-సికింద్రాబాద్, విజయవాడ-డోర్నకల్, విజయవాడ- భద్రాచలం రోడ్-విజవాడ ప్యాసింజర్ రైళ్లను పూర్తిగా నిలిపివేశారు. విశాఖపట్నం-మహబూబ్‌నగర్, కాకినాడ–లింగంపల్లి మార్గాల్లో నడిచే రైళ్లు కూడా తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రయాణికులు ముందస్తుగా తమ ప్రయాణాలను ప్లాచ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. రైలు బయలుదేరే ముందు ఎన్‌టీఈఎస్ (NTES) యాప్, రైల్వే అధికారిక వెబ్‌సైట్ ద్వారా లైవ్ స్టేటస్‌ను సరిచూసుకోవాలన్నారు. రద్దయిన రైళ్లకు బదులుగా అందుబాటులో ఉన్న ఇతర రైళ్లు, రోడ్డు రవాణా మార్గాలను పరిశీలించాలని కోరారు.
ఈ రైళ్లు రద్దు..
- విజయవాడ-సికింద్రాబాద్-విజయవాడ (శాతవాహన-12713 / 12714) రైళ్లు.. మే 2 నుంచి మే 5 వరకు రద్దు
- గుంటూరు-సికింద్రాబాద్-విజయవాడ (గోల్కొండ- 17201 / 17202) మధ్య ప్రతిరోజూ నడిచే రైళ్లు.. మే 2 నుంచి 5 వరకు
- కాకినాడ పోర్ట్-లింగంపల్లి - కాకినాడ పోర్ట్ (గౌతమి-12737 / 12738) మధ్య ప్రతిరోజూ నడిచే రైళ్లు.. మే 1 నుంచి 5 వరకు
- విజయవాడ-భద్రాచలం రోడ్ - విజయవాడ (67215 / 67216) మధ్య ప్రతిరోజూ నడిచే రైళ్లు.. ఏప్రిల్ 28 నుంచి మే 5 వరకు
- విజయవాడ-డోర్నకల్-విజయవాడ (67768 / 67767) మధ్య ప్రతిరోజు నడిచే రైళ్లు.. ఏప్రిల్ 28 నుంచి 5 వరకు
- గుంటూరు-సికింద్రాబాద్-గుంటూరు (12705 / 12706) మధ్య ప్రతిరోజూ నడిచే రైళ్లు.. మే 2 నుంచి 5 వరకు
- విశాఖపట్నం-మహబూబ్‌నగర్-విశాఖపట్నం(12861 / 12862) మధ్య ప్రతిరోజూ నడిచే రైళ్లు.. మే 1 నుంచి మే 5 వరకు
- కాకినాడ టౌన్-లింగంపల్లి-కాకినాడ టౌన్ (12775 / 12776) మధ్య వారానికి 3 రోజులు నడిచే రైళ్లు.. మే 3, 4 తేదీల్లో రద్దు
- సంబల్‌పూర్-హెచ్ఎస్ నాందేడ్-సంబల్‌పూర్ (20809 / 20810) మధ్య వారానికి 3 రోజులు నడిచే రైళ్లు.. మే 1,2 3, 4,5 తేదీల్లో రద్దు
- విశాఖపట్నం-హెచ్ఎస్ నాందేడ్-విశాఖపట్నం (20811 / 20812) మధ్య వారానికి 3 రోజులు నడిచే రైళ్లు.. మే 2, 3 తేదీల్లో రద్దు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






