త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Strait Of Hormuz | యుద్దం ముగిసి హోర్ముజ్ తెరుచుకున్నా.. ఇంధ‌న మార్కెట్ల‌కు తిప్ప‌లే..

Strait Of Hormuz | అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి మూసివేత ప్రపంచ ఇంధ‌న‌ మార్కెట్లను కుదిపేసింది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరుగుతున్న అమెరికా-ఇరాన్ చర్చల ద్వారా కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరినా, ఈ మూసివేత ప్రభావం దీర్ఘకాలం కొనసాగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

S

Business | Published On Apr 11, 2026, 10.35 am IST

Strait Of Hormuz | యుద్దం ముగిసి హోర్ముజ్ తెరుచుకున్నా.. ఇంధ‌న మార్కెట్ల‌కు తిప్ప‌లే..
Advertisement

Strait Of Hormuz | అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి మూసివేత ప్రపంచ ఇంధ‌న‌ మార్కెట్లను కుదిపేసింది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరుగుతున్న అమెరికా-ఇరాన్ చర్చల ద్వారా కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరినా, ఈ మూసివేత ప్రభావం దీర్ఘకాలం కొనసాగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎకాన‌మిస్ట్‌ డిప్యూటీ ఎడిటర్ ఎడ్వర్డ్ కార్ మాట్లాడుతూ చర్చలు సానుకూలంగా సాగినా చమురు ధరలు తగ్గడానికి చాలా కాలం పడుతుంద‌ని తెలిపారు. హోర్ముజ్ జలసంధి మళ్లీ తెరుచుకున్న తర్వాత కూడా ఇంధ‌న‌ మార్కెట్ల పునరుద్ధరణపై మూడు ప్రధాన అంశాలు ప్రభావం చూపనున్నాయని ఆయన వివరించారు.

ఖ‌ర్చులు పెరిగే అవ‌కాశాలు..

జలసంధిని మళ్లీ తెరవడం సాంకేతికంగా క్లిష్టమైన ప్రక్రియగా ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ఈ ప్రక్రియలో వ్యూహాత్మకంగా వ్యవహరించే అవకాశముందని, అక్కడి నుంచి వెళ్లే నౌకలపై పన్నులు లేదా ఛార్జీలు విధించే అవకాశముందని చెప్పారు. దీంతో రవాణా ఖర్చులు పెరిగే ప్రమాదం ఉందన్నారు. అలాగే ప్రస్తుతం అనేక నౌకలు అక్కడే నిలిచిపోయిన పరిస్థితి ఉంద‌ని, చ‌మురు బావులు కూడా మూసివేసినందున వాటిని తిరిగి ప్రారంభించేందుకు సమయం ప‌డుతుంద‌ని కార్ వివరించారు. సరఫరా పునరుద్ధరణ కూడా వెంటనే జరగదని చెప్పారు. ఇరాన్ ఇప్పటికే జలసంధి, అలాగే గల్ఫ్ ప్రాంతంలోని విద్యుత్ కేంద్రాలు, పైప్‌లైన్లపై దాడి చేసే సామర్థ్యాన్ని ప్రదర్శించిందని పేర్కొన్నారు. దీంతో భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతం మరింత ప్రమాదకరంగా మారే అవకాశముందని ఆయన హెచ్చరించారు.

హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ పూర్తి నియంత్ర‌ణ‌..

ఇరాన్ ఒక కొత్త ఆయుధాన్ని ప్రదర్శించింద‌ని, జలసంధి, ఆయిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, గల్ఫ్ దేశాల పైప్‌లైన్లపై దాడి చేయడానికి సిద్ధంగా ఉందని నిరూపించింద‌ని కార్ అన్నారు. దీని వ‌ల్ల భ‌విష్య‌త్తులో త‌మ‌పై దాడి చేస్తే ఆయా ప్ర‌దేశాల‌పై ప్ర‌తిదాడుల‌కు కూడా వెనుకాడ‌బోమ‌ని ఇరాన్ ఆ ప్ర‌ద‌ర్శ‌న ద్వారా చాటి చెప్పింద‌ని అన్నారు. దీని వ‌ల్ల భ‌విష్య‌త్తులో హోర్ముజ్ జలసంధి విష‌యంలో యుద్ధాలు జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, ఇది మ‌రింత ప్ర‌మాదాన్ని క‌ల‌గ‌జేస్తుంద‌ని అన్నారు. హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ ప్రభావాన్ని, దాని మీదుగా వెళ్లే నౌకలకు ఉన్న నిరంతర వైమానిక ముప్పుకు సంబంధించి ప‌లువురు నిపుణులు కూడా త‌మ అభిప్రాయాల‌ను వెల్ల‌డించారు.

ఇరాన్ డ్రోన్ల‌తో నౌక‌ల‌కు ముప్పు..

జ్యూయిష్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ ఆఫ్ అమెరికా పాలసీ వైస్ ప్రెసిడెంట్ బ్లైస్ మిజ్టాల్ మాట్లాడుతూ యుద్ధ ప్రారంభంలో ఇరాన్‌కు నౌకాదళ సామర్థ్యం ఉన్నప్పటికీ, ప్రస్తుతం అదే విధంగా జలసంధిని నియంత్రించడం జరగడం లేదన్నారు. మైన్స్, డ్రోన్ బోట్లు, ఫాస్ట్ బోట్లు, యాంటీ-షిప్ క్షిపణులు వంటి సాధనాలు ఉన్నప్పటికీ, ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. ప్రస్తుతం ముఖ్యంగా డ్రోన్ల రూపంలో ఉన్న నిరంతర వైమానిక ముప్పు కారణంగా వాణిజ్య నౌకలు లక్ష్యంగా మారుతున్నాయని ఆయన తెలిపారు. ఈ దాడుల కారణంగా నౌకలు జలసంధి మార్గాన్ని ఉపయోగించడం నిలిపివేస్తున్నాయని చెప్పారు. అయితే ఇప్ప‌టిక‌ప్పుడు యుద్ధం ముగిసిన‌ప్ప‌టికీ దీని ప్ర‌భావం ఇంధ‌న మార్కెట్ల‌పై చాలా కాలం ప‌డే అవ‌కాశాలు ఉన్నాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

Advertisement
Advertisement