త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

High Speed Trains Collide | రెండు హైస్పీడ్ రైళ్లు ఢీ.. 46 మంది మృతి

High Speed Trains Collide | స్పెయిన్ (Spain)లో ఘోర రైలు ప్ర‌మాదం చోటు చేసుకుంది. మాడ్రిడ్ (Madrid) స‌మీపంలోని టోలెడో ప్రావిన్స్‌లో రెండు హైస్పీడ్ రైళ్లు ఢీకొన్న (High Speed Trains Collide) ఘ‌ట‌న‌లో 46 మంది ప్రాణాలు కోల్పోయారు.

D

International | Published On Oct 28, 2026, 4.59 pm IST

High Speed Trains Collide | రెండు హైస్పీడ్ రైళ్లు ఢీ.. 46 మంది మృతి
Advertisement

High Speed Trains Collide | త్రినేత్ర న్యూస్ : స్పెయిన్ (Spain)లో ఘోర రైలు ప్ర‌మాదం చోటు చేసుకుంది. మాడ్రిడ్ (Madrid) స‌మీపంలోని టోలెడో ప్రావిన్స్‌లో రెండు హైస్పీడ్ రైళ్లు ఢీ కొన్నాయి (High Speed Trains Collide). ఈ ఘ‌ట‌న‌లో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. వంద మందికిపైగా గాయ‌ప‌డ్డారు. స్థానిక కాల‌మానం ప్ర‌కారం బుధ‌వారం ఉద‌యం 9 గంట‌ల‌కు ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు ఆ దేశ రైల్వే అధికారులు వెల్ల‌డించారు. ఈ ప్ర‌మాదం కార‌ణంగా మ్యాడ్రిడ్-అండలూసియా హై-స్పీడ్ రైలు మార్గంలో రాకపోకలు నిలిచిపోయిన‌ట్లు తెలిపారు.

ప్ర‌మాద స‌మ‌యంలో రెండు రైళ్లూ ఒకే దిశ‌లో ప్ర‌యాణిస్తున్న‌ట్లు స్థానిక మీడియా నివేదించింది. ముందు ఆగి ఉన్న ఇరియో రైలును ప్ర‌భుత్వ యాజ‌మాన్యంలో న‌డుస్తున్న రెంఫే రైలు వెనుక నుంచి బ‌లంగా ఢీ కొట్టింది. ప్ర‌మాద ధాటికి ఇరియో రైలుకు చెందిన బోగీలు ప‌ట్టాలు త‌ప్పి ప‌క్క‌కు ప‌డిపోయాయి. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియ‌రాలేదు. ఈ ఘ‌ట‌న‌పై అధికారులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ప్ర‌మాద స్థ‌లి వ‌ద్ద ప్ర‌స్తుతం స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. ఆ స‌మ‌యంలో ఇరియో రైలులో 147 మంది, రెంఫే రైలులో సుమారు 397 మంది ప్ర‌యాణికులు ఉన్న‌ట్లు కాస్టిల్లా లా మంచా ప్రాంత ప్రతినిధి ఎస్తేర్ పదిల్లా తెలిపారు. మ‌రోవైపు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కాగా, ఈ ఏడాది జ‌న‌వ‌రిలో కూడా స్పెయిన్‌లో ఘోర రైలు ప్ర‌మాదం వెలుగు చూసింది. కార్డోబా ప్రావిన్స్‌లోని అదాముజ్ (Adamuz) ప్రాంతంలో హై-స్పీడ్ రైలు ప‌ట్టాలు త‌ప్పి ఎదురుగా వ‌స్తున్న మ‌రో రైలును ఢీ కొట్టింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో కూడా సుమారు 46 మంది మ‌ర‌ణించారు. తాజా ఘ‌ట‌న‌తో దేశంలోని హై-స్పీడ్ రైల్వే నెట్‌వర్క్ (High Speed Rail Network) భద్రతపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

Also Read..

శాస‌న మండలి ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ‌.. నాలుగు స్థానాల‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఎన్డీయే

BELలో 350 ప్రొబేషనరీ ఇంజినీర్ ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా

మృణాల్‌ ఠాకూర్‌ పెళ్లిపై మళ్లీ రూమర్స్‌.. డిసెంబర్‌లోనే అంటూ ప్రచారం..!

Advertisement
Advertisement