త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivas Reddy | త్వరలో మరో 15 వేల ఉద్యోగాల భర్తీ.. మంత్రి పొంగులేటి ప్ర‌క‌ట‌న‌

Ponguleti Srinivas Reddy | సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి ప్ర‌జా ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivas Reddy ) తెలిపారు. ఇప్పటికే రెండేళ్లలో 72 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు పేర్కొన్నారు. త్వరలో సుమారు మరో 15 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు.

S

Telangana | Published On Oct 28, 2026, 4.32 pm IST

Ponguleti Srinivas Reddy | త్వరలో మరో 15 వేల ఉద్యోగాల భర్తీ.. మంత్రి పొంగులేటి ప్ర‌క‌ట‌న‌
Advertisement

Ponguleti Srinivas Reddy | త్రినేత్ర న్యూస్ : సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి ప్ర‌జా ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivas Reddy ) తెలిపారు. ఇప్పటికే రెండేళ్లలో 72 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు పేర్కొన్నారు. త్వరలో సుమారు మరో 15 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. రానున్న కాలంలో మరిన్ని ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు వెలువడనున్నాయని చెప్పారు.

రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు పీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పీఎస్ఆర్ యువ నేస్తం పేరిట ఆన్‌లైన్‌లో ఎన్ని ల‌క్ష‌ల మందికైనా ఉచిత శిక్షణ అందించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్ర‌క‌టించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి త‌న పుట్టినరోజు సందర్భంగా బుధవారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు సరైన మార్గదర్శకత్వం, నాణ్యమైన శిక్షణ ఎంతో అవసరమని పేర్కొన్న మంత్రి.. ఆ దిశగా ‘పీఎస్ఆర్ యువ నేస్తం’ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితులు, శిక్షణ ఖర్చులు, దూరప్రాంతాల సమస్యలు యువత లక్ష్యసాధనకు అడ్డంకులు కాకూడదనే ఉద్దేశంతోనే ఉచిత ఆన్‌లైన్ శిక్షణకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో కృషి చేస్తున్న ప్రతి నిరుద్యోగ యువతీ యువకుడికి ఈ కార్యక్రమం ఒక అవకాశంగా నిలవాలని, యువత తమ ప్రతిభను నిరూపించుకొని ఉద్యోగాలు సాధించేలా ఈ వేదిక తోడ్పడాలని మంత్రి ఆకాంక్షించారు.

దీపావ‌ళి లోగా జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల స్ధ‌లాలు

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని ఈరోజు క‌లిసిన సంద‌ర్బంలో పాత్రికేయుల ఇళ్ల స్ధ‌లాల అంశం చ‌ర్చ‌కు వ‌చ్చింద‌ని మంత్రి పొంగులేటి తెలిపారు. రానున్న దీపావ‌ళి లోగా జ‌ర్న‌లిస్టుల ఇళ్ల స్ధ‌లాల స‌మ‌స్య ప‌రిష్కారించేందుకు ముఖ్య‌మంత్రి స‌మ్మ‌తించార‌ని తెలిపారు. దీనివ‌ల‌న దీర్ఘ‌కాలిక స‌మ‌స్య తీరుతుంద‌న్నారు. దీనిపై పాత్రికేయుల స్పందిస్తూ మంత్రిగారి పుట్టిన‌రోజున త‌మ‌కు శుభవార్త వ‌చ్చింద‌ని హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

Advertisement
Advertisement