Mrunal Thakur | మృణాల్ ఠాకూర్ పెళ్లిపై మళ్లీ రూమర్స్.. డిసెంబర్‌లోనే అంటూ ప్రచారం..!
Mrunal Thakur | టాలీవుడ్‌లో ‘సీతారామం’తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ పెళ్లిపై మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. డిసెంబర్‌లో ఆమె వివాహం జరగనుందంటూ రెడిట్‌లో ఓ పోస్టు వైరల్‌గా మారింది. అయితే, ఈ ప్రచారంలో వరుడు ఎవరనే వివరాలు చెప్పలేదు.
Entertainment | Published On Oct 28, 2026, 4.42 pm IST
Mrunal Thakur | టాలీవుడ్‌లో ‘సీతారామం’తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ పెళ్లిపై మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. డిసెంబర్‌లో ఆమె వివాహం జరగనుందంటూ రెడిట్‌లో ఓ పోస్టు వైరల్‌గా మారింది. అయితే, ఈ ప్రచారంలో వరుడు ఎవరనే వివరాలు లేవు. దీనిపై మృణాల్ కూడా ఇప్పటివరకు స్పందించలేదు. గతంలోనూ తమిళ నటుడు ధనుష్‌తో ఆమె పెళ్లంటూ వార్తలు వచ్చినా.. అవి నిజం కాలేదు. దీంతో తాజా ప్రచారంలోనూ నిజమెంత అన్నది ఆసక్తికరంగా మారింది.
గతంలోనూ పెళ్లి వార్తలు..
మృణాల్ ఠాకూర్ వ్యక్తిగత జీవితంపై గతంలోనూ పలుమార్లు ఊహాగానాలు వచ్చాయి. ఈ ఏడాది ఆరంభంలో ధనుష్‌తో ఆమె వివాహం జరగనుందంటూ ప్రచారం సాగింది. అయితే, ఈ వార్తలను ధ్రువీకరించే ఆధారాలేవీ బయటకు రాలేదు. తాజాగా డిసెంబర్‌లో పెళ్లి జరగనుందంటూ మరోసారి ప్రచారం మొదలైంది. కానీ, ఈసారి కూడా వరుడి వివరాలు, వివాహ తేదీ వంటి స్పష్టమైన సమాచారం లేదు. కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టు ఆధారంగానే ఈ వార్తలు వెలుగులోకి వచ్చాయి. కాబట్టి, ప్రస్తుతానికి వీటిని ఊహాగానాలేనంటూ వార్తలను అభిమానులు కొట్టిపడేస్తున్నారు.
ఈ ఏడాది వరుస సినిమాలు..
మృణాల్ కెరీర్ విషయానికొస్తే.. ఈ ఏడాది ఆమె నటించిన ‘దో దివానే సెహర్ మే’, ‘డెకాయిట్’, ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’, ‘పూజా మేరీ జాన్’ సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అయితే, వీటిలో ఏ సినిమా కూడా ఆమెకు భారీ స్థాయిలో బాక్సాఫీస్ విజయాన్ని అందించలేకపోయింది. ప్రస్తుతం ‘పూజా మేరీ జాన్’ ప్రమోషన్లతో ఆమె బిజీగా ఉంది. మరోవైపు, కొత్త సినిమాల ఎంపిక విషయంలో తొందరపడటం లేదని మృణాల్ ఇటీవల వెల్లడించింది. దాదాపు తొమ్మిది నెలలుగా కొత్త సినిమాకు సంతకం చేయలేదని, తనకు నచ్చే అర్థవంతమైన పాత్ర కోసం ఎదురుచూస్తున్నానని తెలిపింది. మంచి కథ, పాత్ర తనకు నచ్చినప్పుడే తదుపరి ప్రాజెక్టును ప్రకటిస్తాననే సంకేతాలిచ్చింది.
‘రాకా’లో నటిస్తుందా?
ప్రస్తుతం అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కలయికలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రాకా’లో మృణాల్ నటించనుందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్టులో ఆమె పేరు కొంతకాలంగా వినిపిస్తున్నప్పటికీ.. తాను ఈ సినిమాలో భాగమవుతున్నట్లు మృణాల్ అధికారికంగా ప్రకటించలేదు. పైగా, తన తదుపరి సినిమాపై సరైన సమయంలో తానే ప్రకటన చేస్తానని ఇటీవల స్పష్టం చేసింది. దీంతో ‘రాకా’లో ఆమె నటిస్తుందా? లేదా? అన్నది ఇంకా తేలాల్సి ఉంది. ప్రస్తుతం పెళ్లి వార్తలు, కొత్త సినిమా ఊహాగానాల మధ్య మృణాల్ తదుపరి అడుగు ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Ponguleti Srinivas Reddy | త్వరలో మరో 15 వేల ఉద్యోగాల భర్తీ.. మంత్రి పొంగులేటి ప్రకటన
- ●Liquor Booking App | ఇక ఇంట్లో కూర్చొని మద్యం ఆర్డర్ చేయొచ్చు : 'ఆన్లైన్ లిక్కర్ బుకింగ్' యాప్‌పై భగ్గుమన్న ప్రతిపక్షం
- ●Karnataka Legislative Council elections | శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ.. నాలుగు స్థానాలను క్లీన్‌స్వీప్ చేసిన ఎన్డీయే
- ●Jalamandali | తాగునీటి దుర్వినియోగంపై జలమండలి కఠిన చర్యలు
- ●HMWSSB | నీటి సంరక్షణలో బీమా ప్రైడ్ అపార్ట్మెంట్ చొరవ.. స్విమ్మింగ్ పూల్ మూసివేత..
- ●TG Weather | ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు.. హెచ్చరించిన ఐఎండీ

Ponguleti Srinivas Reddy | త్వరలో మరో 15 వేల ఉద్యోగాల భర్తీ.. మంత్రి పొంగులేటి ప్రకటన

Liquor Booking App | ఇక ఇంట్లో కూర్చొని మద్యం ఆర్డర్ చేయొచ్చు : 'ఆన్లైన్ లిక్కర్ బుకింగ్' యాప్‌పై భగ్గుమన్న ప్రతిపక్షం

Karnataka Legislative Council elections | శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ.. నాలుగు స్థానాలను క్లీన్‌స్వీప్ చేసిన ఎన్డీయే

Jalamandali | తాగునీటి దుర్వినియోగంపై జలమండలి కఠిన చర్యలు






