KTR | బీఆర్ఎస్ గొంతు నొక్కే కుట్రలను సహించే ప్రసక్తే లేదు : కేటీఆర్
KTR | మూసీ( Musi ) పరివాహక ప్రాంతంలోని ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ గొంతు నొక్కే ఇలాంటి కుట్రలను ఎట్టిపరిస్థితులో సహించే ప్రసక్తే లేదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) హెచ్చరించారు.
KTR | త్రినేత్ర న్యూస్ : మూసీ( Musi ) పరివాహక ప్రాంతంలోని ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ గొంతు నొక్కే ఇలాంటి కుట్రలను ఎట్టిపరిస్థితులో సహించే ప్రసక్తే లేదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) హెచ్చరించారు. మూసీ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని, రాజేంద్రనగర్ ఇంచార్జి కార్తీక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు.
ఇందిరమ్మ పాలన అంటే ఆనాటి ఎమర్జెన్సీ రోజులే అని మరోసారి గుర్తుచేసిన ముఖ్యమంత్రికి ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు. ఓవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ తెచ్చిన కరువు విలయతాండవం చేస్తుంటే.. లక్షన్నర కోట్ల లూటిఫికేషన్‌కు సీఎం రేవంత్ రెడ్డి స్కెచ్ వేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.
మూసీలో మూటలవేట సాగిస్తున్నారు
లక్షలాది మంది రైతులు కరువులో నిండా మునిగి కన్నీళ్లు పెడుతుంటే ముఖ్యమంత్రి మాత్రం మూసీలో మూటలవేట సాగిస్తున్నారు. ఎండిపోయిన పంటలకు ఎకరాకు కనీసం 50 వేల పరిహారం ఇవ్వాల్సిన రేవంత్ రెడ్డి పూర్తిగా చేతులెత్తేసి అన్నదాతలకు వెన్నుపోటు పొడిచారు. మూసీలో దోపిడీయే తన తొలి ప్రాధాన్యమని చాటిచెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ తీరు చూసి ఇవాళ 70 లక్షల మంది రైతులు అసహ్యించుకుంటున్నారు అని కేటీఆర్ తెలిపారు.
రియల్ ఎస్టేట్ దందా చేయాలనే
మూసీ లూటిఫికేషన్ ముసుగులో లక్షల కుటుంబాల ఇళ్లు కూల్చి, రియల్ ఎస్టేట్ దందా చేయాలనే రేవంత్ పన్నాగాన్ని అడ్డుకునే వరకూ బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుంది. అప్రజాస్వామికంగా హౌస్ అరెస్ట్ చేసిన సబితా ఇంద్రారెడ్డిని, కార్తీక్ రెడ్డిని ప్రభుత్వం వెంటనే బేషరతుగా విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అలాగే మూసిలో లక్షన్నర కోట్ల లూటీని ఆపి, రోడ్డున పడ్డ రైతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Samsung Galaxy A08 | రూ.18,499కే శాంసంగ్ గెలాక్సీ కొత్త స్మార్ట్‌ఫోన్.. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ..
- ●Mrunal Thakur | మృణాల్ ఠాకూర్ పెళ్లిపై మళ్లీ రూమర్స్.. డిసెంబర్లోనే అంటూ ప్రచారం..!
- ●Ponguleti Srinivas Reddy | త్వరలో మరో 15 వేల ఉద్యోగాల భర్తీ.. మంత్రి పొంగులేటి ప్రకటన
- ●Liquor Booking App | ఇక ఇంట్లో కూర్చొని మద్యం ఆర్డర్ చేయొచ్చు : 'ఆన్లైన్ లిక్కర్ బుకింగ్' యాప్‌పై భగ్గుమన్న ప్రతిపక్షం
- ●Karnataka Legislative Council elections | శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ.. నాలుగు స్థానాలను క్లీన్‌స్వీప్ చేసిన ఎన్డీయే
- ●Jalamandali | తాగునీటి దుర్వినియోగంపై జలమండలి కఠిన చర్యలు

Samsung Galaxy A08 | రూ.18,499కే శాంసంగ్ గెలాక్సీ కొత్త స్మార్ట్‌ఫోన్.. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ..

Mrunal Thakur | మృణాల్ ఠాకూర్ పెళ్లిపై మళ్లీ రూమర్స్.. డిసెంబర్లోనే అంటూ ప్రచారం..!

Ponguleti Srinivas Reddy | త్వరలో మరో 15 వేల ఉద్యోగాల భర్తీ.. మంత్రి పొంగులేటి ప్రకటన

Liquor Booking App | ఇక ఇంట్లో కూర్చొని మద్యం ఆర్డర్ చేయొచ్చు : 'ఆన్లైన్ లిక్కర్ బుకింగ్' యాప్‌పై భగ్గుమన్న ప్రతిపక్షం





