Karnataka Legislative Council elections | శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ.. నాలుగు స్థానాలను క్లీన్‌స్వీప్ చేసిన ఎన్డీయే
Karnataka Legislative Council elections | కర్ణాటక శాసన మండలి ఎన్నికల్లో (Karnataka Legislative Council elections) అధికార కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. మొత్తం 4 స్థానాలకు ఎన్నికలు జరగ్గా బీజేపీ 3 స్థానాలను, దాని మిత్రపక్షం జేడీ(ఎస్) 1 స్థానాన్ని గెలుచుకున్నాయి. కాంగ్రెస్ ఒక్కచోట కూడా గెలవకపోవడం గమనార్హం.
Karnataka Legislative Council elections | త్రినేత్ర న్యూస్ : కర్ణాటక శాసన మండలి ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. బీజేపీ-జేడీ(ఎస్) కూటమి ఘనవిజయం సాధించింది. నాలుగు స్థానాలను కైవసం చేసుకొని క్లీన్‌స్వీప్ చేసింది. మొత్తం 4 స్థానాలకు ఎన్నికలు జరగ్గా బీజేపీ 3 స్థానాలను, దాని మిత్రపక్షం జేడీ(ఎస్) 1 స్థానాన్ని గెలుచుకున్నాయి. కాంగ్రెస్ ఒక్కచోట కూడా గెలవకపోవడం గమనార్హం.
ముఖ్యగా బెంగళూరు టీచర్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు రాజకీయంగా అత్యంత కీలకమైన ఈ నియోజకవర్గంలో ఐదుసార్లు ఎమ్మెల్సీగా, మాజీ డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న పుట్టణ్ణను జేడీ(ఎస్) అభ్యర్థి ఎ.పి. రంగనాథ్ మట్టికరిపించారు. 908 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. మరోవైపు నార్త్-ఈస్ట్ టీచర్స్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి శశిళ్ జి. నమోషి.. కాంగ్రెస్ అభ్యర్థి శరణప్ప మత్తూరుపై 3,297 ఓట్ల తేడాతో విజయం సాధించి వరుసగా ఐదోసారి ఆ నియోజకవర్గాన్ని తన సొంతం చేసుకున్నారు.
అటు పశ్చిమ గ్రాడ్యుయేట్ల నియోజకవర్గంలో ఎస్‌వి సంకనూర్.. కాంగ్రెస్ అభ్యర్థి మోహన్ లింబికాయ్‌పై 9,323 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించి వరుసగా మూడోసారి ఈ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. సౌత్ ఈస్ట్ గ్రాడ్యుయేట్ల నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కె.ఎం. సురేశ్.. కాంగ్రెస్ అభ్యర్థి శశి హులికుంటెమఠ్‌పై 23,098 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.
ఓటమిని అంగీకరించిన డీకే శివకుమార్
శాసనమండలి ఎన్నికల్లో ఓటమిని ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అంగీకరించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలు రాలేదని చెప్పారు. శాసన మండలి ఎన్నికల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఓటర్లు ఇచ్చిన తీర్పును గౌరవంగా స్వీకరిస్తున్నామని తెలిపారు. ఓటర్లు ఇచ్చిన సందేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, లోపాలను సరిదిద్దుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు భావిస్తున్నట్లుగా ఇది భవిష్యత్తు ఎన్నికలకు ఎలాంటి ముందస్తు సంకేతం కాదని డీకే స్పష్టం చేశారు.
డీకే.. ఇట్స్ డన్ బ్రో
ఈ ఫలితాలపై బీజేపీ కర్ణాటక విభాగం సోషల్ మీడియా వేదిక స్పందించింది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను ఉద్దేశించి ‘డీకే, ఇట్స్ డన్ బ్రో!’ అంటూ వ్యంగ్యంగా పోస్టు చేసింది.
ఎన్డీయే కూటమికి భారీ ఊరట
కాగా, ఈ ఏడాది జూన్‌లో ఏడు శాసనమండలి స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలను కైవసం చేసుకోగా, ఎన్డీయే కూటమి కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. కూటమిలో అంతర్గత విభేదాల కారణంగా NDA కి చెందిన సుమారు 11 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు క్రాస్ ఓటింగ్ చేశారు. దీంతో జేడీ(ఎస్) అభ్యర్థి ఓటమి పాలయ్యారు. ఈ ఫలితాలు ఎన్డీయే భాగస్వామ్య పక్షాలను తీవ్రంగా దెబ్బతీశాయి. అంతకుముందు మే నెలలో జరిగిన దావణగె దక్షిణ (Davanagere South), బాగల్‌కోట్ (Bagalkot) అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, తాజా ఫలితాలు ఎన్డీయే కూటమి శ్రేణులకు కొత్త ఉత్సాహానిచ్చాయి.
ఎన్నికలు ఎలా జరిగినా ఫలితం అదే..
గత కొంతకాలంగా కాంగ్రెస్ అధిష్టానం బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎన్నికలు జరగాలని పట్టుబడుతున్న విషయం తెలిసిందే. అయితే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో శాసనమండలి ఎన్నికలు ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్ల ద్వారానే జరిగాయి. బ్యాలెట్ పద్ధతిలో జరిగినప్పటికీ అధికార కాంగ్రెస్ ఒక్క స్థానాన్ని కూడా గెలవలేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా హస్తం పార్టీపై బీజేపీ నేతలు విమర్శలకు ఎక్కుపెట్టారు. బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సుల ద్వారా ఎన్నికలు జరిగినప్పటికీ కాంగ్రెస్‌కు ఆశించిన ఫలితం దక్కలేదని బీజేపీ నేత సుధాంశు త్రివేది అన్నారు. ఎన్నికలు ఏ విధానంలో జరిగినా ఓటర్ల మద్దతు పొందడం కాంగ్రెస్‌కు కష్టంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ నాయకత్వంపై ప్రశ్నలు
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఓడిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకత్వం, 2028 అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, నియామకాలపై అసంతృప్తి, కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ (కేపీఎస్‌సీ) నియామక కుంభకోణం వంటి పరిణామాలు పార్టీపై ప్రభావం చూపి ఉంటాయని భావిస్తున్నారు.
Also Read..
తాగునీటి దుర్వినియోగంపై జలమండలి కఠిన చర్యలు
నీటి సంరక్షణలో బీమా ప్రైడ్ అపార్ట్‌మెంట్ చొరవ.. స్విమ్మింగ్ పూల్ మూసివేత..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Baby bottle gourds | సొరకాయల వ్యాపారం.. రోజుకు రూ. 50,000 సంపాదన..
అక్టోబర్ 27, 2026

Karnataka SIR | కర్ణాటక తుది ఓటర్ల జాబితా విడుదల.. 99.32 లక్షల మంది పేర్లు ఔట్
అక్టోబర్ 27, 2026

HD Kumaraswamy | మా కుటుంబాన్ని అంతం చేసేందుకు కుట్ర.. రూ.600 కోట్లతో డీల్.. సీఎం డీకేపై కేంద్ర మంత్రి సంచలన ఆరోపణలు
అక్టోబర్ 26, 2026
తాజావార్తలు
- ●HMWSSB | నీటి సంరక్షణలో బీమా ప్రైడ్ అపార్ట్‌మెంట్ చొరవ.. స్విమ్మింగ్ పూల్ మూసివేత..
- ●TG Weather | ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు.. హెచ్చరించిన ఐఎండీ
- ●CM Revanth Reddy | హైదరాబాద్‌లో తాగు నీటి సమస్య రాకూడదు...
- ●Jagga Reddy Gangakatwa Canal | ఆనాడు నిజాం.. నేడు జగ్గారెడ్డి
- ●Shraddha Kapoor | ప్రసవ వేదనలోనూ నాట్యమే ప్రాణం!.. 30న శ్రద్ధా కపూర్ ‘ఈతా’ ట్రైలర్
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు నష్టాలు.. సెన్సెక్స్ 353 పాయింట్లు డౌన్..

HMWSSB | నీటి సంరక్షణలో బీమా ప్రైడ్ అపార్ట్‌మెంట్ చొరవ.. స్విమ్మింగ్ పూల్ మూసివేత..

TG Weather | ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు.. హెచ్చరించిన ఐఎండీ

CM Revanth Reddy | హైదరాబాద్‌లో తాగు నీటి సమస్య రాకూడదు...

Jagga Reddy Gangakatwa Canal | ఆనాడు నిజాం.. నేడు జగ్గారెడ్డి



