FIFA World Cup 2026 Prize Money | ఫిఫా ప్రపంచకప్ విజేతకు కళ్లుచెదిరే ప్రైజ్‌మనీ.. టోర్నీ ఖర్చు అక్షరాలా రూ.8300 కోట్లుపైగానే..!
FIFA World Cup 2026 Prize Money | ఫిఫా ప్రపంచకప్ విజేత స్పెయిన్‌కు భారీ ప్రైజ్‌మనీ దక్కింది. ఫిఫా ప్రపంచకప్-2026 ఫైనల్లో అర్జెంటీనాను 1-0తో ఓడించి రెండోసారి విశ్వవిజేతగా నిలిచిన స్పెయిన్‌కు రికార్డు స్థాయిలో ప్రైజ్‌మనీని సొంతం చేసుకున్నది. న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠ పోరులో నిర్ణీత సమయంలో ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి.
- విజేత స్పెయిన్ జట్టుకు రూ.481 కోట్లు
- రన్నరప్ అర్జెంటీనాకు రూ.318కోట్లు
FIFA World Cup 2026 Prize Money | ఫిఫా ప్రపంచకప్ విజేత స్పెయిన్‌కు భారీ ప్రైజ్‌మనీ దక్కింది. ఫిఫా ప్రపంచకప్-2026 ఫైనల్లో అర్జెంటీనాను 1-0తో ఓడించి రెండోసారి విశ్వవిజేతగా నిలిచిన స్పెయిన్‌కు రికార్డు స్థాయిలో ప్రైజ్‌మనీని సొంతం చేసుకున్నది. న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠ పోరులో నిర్ణీత సమయంలో ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి. అదనపు సమయంలో ఫెర్రాన్ టొరెస్ చేసిన ఏకైక గోల్‌తో స్పెయిన్ విజయం సాధించింది. ఈ విజయంతో పాటు ఫిఫా చరిత్రలోనే అత్యధిక ప్రైజ్‌మనీ అందుకున్న జట్టుగా స్పెయిన్ నిలిచింది. విశ్వవిజేతగా నిలిచిన స్పెయిన్‌కు ఫిఫా 5 కోట్ల డాలర్లు ( భారతీయ కరెన్సీలో సుమారు రూ.481 కోట్లు) అందించింది. ప్రపంచకప్ విజేతకు ఇప్పటివరకు ఇచ్చిన నజరానాల్లో ఇదే అత్యధికం. 2022లో టైటిల్ గెలిచిన అర్జెంటీనాకు 4.2 కోట్ల డాలర్లు అందగా.. ఈసారి విజేతకు అదనంగా 80 లక్షల డాలర్లు పెరిగింది.
రన్నరప్ అర్జెంటీనాకూ 3.3కోట్ల డాలర్లు..
ఫైనల్లో ఓడినప్పటికీ అర్జెంటీనా ఖాళీ చేతులతో వెనుదిరగలేదు. రన్నరప్‌గా నిలిచిన మెస్సీ సేనకు 3.3 కోట్ల డాలర్లు (సుమారు రూ.318 కోట్లు) దక్కాయి. మూడో స్థానంలో నిలిచిన ఇంగ్లండ్‌కు 2.9 కోట్ల డాలర్లు (సుమారు రూ.279 కోట్లు), నాలుగో స్థానంలో నిలిచిన ఫ్రాన్స్‌కు 2.7 కోట్ల డాలర్లు ప్రైజ్‌మనీ అందింది. 48 జట్లతో నిర్వహించిన ఈ ప్రపంచకప్‌లో ఫిఫా ప్రైజ్‌మనీని భారీగా పెంచింది. క్వార్టర్ ఫైనల్‌కు చేరిన ప్రతి జట్టుకు 1.9 కోట్ల డాలర్లు (సుమారు రూ.183 కోట్లు) దక్కాయి. రౌండ్ ఆఫ్ 16లో ఓడిన జట్లకు 1.5 కోట్ల డాలర్లు (సుమారు రూ.144 కోట్లు), రౌండ్ ఆఫ్ 32లో నిష్క్రమించిన జట్లకు 1.1 కోట్ల డాలర్లు (సుమారు రూ.106 కోట్లు) అందాయి.
మ్యాచ్ ఆడకముందే 1.25 కోట్ల డాలర్లు..
గ్రూప్ దశలోనే వెనుదిరిగిన జట్లకూ 90 లక్షల డాలర్లు (సుమారు రూ.87 కోట్లు) అందాయి. అయితే, ఈసారి 48 జట్లకు ఫిఫా ముందుగానే ఆర్థిక సహాయం అందించింది. అర్హత సాధించిన ప్రతి జట్టుకు టోర్నీలో పాల్గొనేందుకు కోటి డాలర్లు (సుమారు రూ.96 కోట్లు), సన్నాహక ఖర్చుల కోసం 25 లక్షల డాలర్లు (సుమారు రూ.24 కోట్లు) చెల్లించింది. అంటే ప్రతి జట్టు తొలి మ్యాచ్ ఆడకముందే 1.25 కోట్ల డాలర్లు పొందాయి. మొత్తంగా ప్రపంచకప్-2026 కోసం ఫిఫా 87.1 కోట్ల డాలర్లు (సుమారు రూ.8,386 కోట్లు) కేటాయించింది. గత ప్రపంచకప్‌తో పోలిస్తే ఇది 43.1 కోట్ల డాలర్లు ఎక్కువ. ఇందులో 65.5 కోట్ల డాలర్లు జట్ల ప్రదర్శన ఆధారంగా.. మిగతా మొత్తం అర్హత, సన్నాహకాల కోసం కేటాయించింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Kiara Advani | నాదియా...బోల్డ్ అండ్ బ్యూటీపుల్ - కియారా బర్త్‌డే ట్రీట్ అదుర్స్
- ●Motorola | జేబీఎల్ స్పీకర్లు, పెద్ద డిస్ప్లేతో లాంచ్ అయిన మోటోరోలా కొత్త ట్యాబ్.. ఫీచర్లు అదుర్స్..
- ●Sanathnagar TIMS | సనత్‌నగర్ టిమ్స్‌కు మర్రి చెన్నారెడ్డి పేరు.. డైరెక్టర్‌గా నరేంద్ర కుమార్
- ●V Hanumantha Rao | అభిజీత్ దీప్కేను బేదిరించడం మంచిది కాదు.. బీజేపీలో చేరకుంటే అంతుచూస్తారట
- ●Fake Number Plates | నకిలీ నంబర్ ప్లేట్లపై ఉక్కుపాదం.. ఆరు క్రిమినల్ కేసులు.. వాహనాలు సీజ్
- ●Lal Darwaza Bonalu | లాల్‌దర్వాజా ఆలయంలో శిఖర పూజ.. 24 గంటలు ప్రత్యేక నిఘా

Kiara Advani | నాదియా...బోల్డ్ అండ్ బ్యూటీపుల్ - కియారా బర్త్‌డే ట్రీట్ అదుర్స్

Motorola | జేబీఎల్ స్పీకర్లు, పెద్ద డిస్ప్లేతో లాంచ్ అయిన మోటోరోలా కొత్త ట్యాబ్.. ఫీచర్లు అదుర్స్..

Sanathnagar TIMS | సనత్‌నగర్ టిమ్స్‌కు మర్రి చెన్నారెడ్డి పేరు.. డైరెక్టర్‌గా నరేంద్ర కుమార్

V Hanumantha Rao | అభిజీత్ దీప్కేను బేదిరించడం మంచిది కాదు.. బీజేపీలో చేరకుంటే అంతుచూస్తారట





