త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Samsung Galaxy A08 | రూ.18,499కే శాంసంగ్ గెలాక్సీ కొత్త స్మార్ట్‌ఫోన్‌.. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ..

Samsung Galaxy A08 | శాంసంగ్ భారత మార్కెట్లో గెలాక్సీ ఎ08 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రూ.18,499 ధరతో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్‌లో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగాపిక్స‌ల్ ప్రధాన కెమెరా, 90 హెడ్జ్‌ డిస్‌ప్లే, 25 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రోజువారీ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ ఫోన్‌లో పనితీరు మెరుగుదలలు, ఏఐ సదుపాయాలు, దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ మద్దతును సంస్థ అందిస్తోంది.

S

Technology | Published On Oct 28, 2026, 4.42 pm IST

Samsung Galaxy A08 | రూ.18,499కే శాంసంగ్ గెలాక్సీ కొత్త స్మార్ట్‌ఫోన్‌.. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ..
Advertisement

Samsung Galaxy A08 | శాంసంగ్ భారత మార్కెట్లో గెలాక్సీ ఎ08 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రూ.18,499 ధరతో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్‌లో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగాపిక్స‌ల్ ప్రధాన కెమెరా, 90 హెడ్జ్‌ డిస్‌ప్లే, 25 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రోజువారీ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ ఫోన్‌లో పనితీరు మెరుగుదలలు, ఏఐ సదుపాయాలు, దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ మద్దతును సంస్థ అందిస్తోంది.

ర్యామ్ ప్ల‌స్ ఫీచ‌ర్‌తో అధిక మెమొరీ..

శాంసంగ్ గెలాక్సీ ఎ08 స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జి99 ప్లస్ ప్రాసెసర్‌ను అందించారు. గెలాక్సీ ఎ06తో పోలిస్తే సింగిల్‌ కోర్ సీపీయూ పనితీరు 84 శాతం, మల్టీ కోర్ సీపీయూ పనితీరు 43 శాతం, గ్రాఫిక్స్ పనితీరు 60 శాతం వరకు మెరుగుపడినట్లు సంస్థ పేర్కొంది. యాప్‌లు వేగంగా ప్రారంభం కావడం, ఒకేసారి పలు పనులు చేసేటప్పుడు మెరుగైన పనితీరు అందించడం ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం. ఇందులో 4 జీబీ ర్యామ్‌తోపాటు 64 జీబీ అంతర్గత స్టోరేజ్‌ వేరియంట్‌ను అందిస్తున్నారు. మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 2 టెరాబైట్ల వరకు పెంచుకోవచ్చు. ర్యామ్ ప్లస్ ఫీచర్‌తో అంతర్గత స్టోరేజ్‌లో కొంత భాగాన్ని వర్చువల్ మెమరీగా ఉపయోగించుకోవచ్చు.

ఏఐ ఫీచ‌ర్లు..

ఈ ఫోన్‌లో 6.7 ఇంచుల హెచ్‌డీ ప్లస్ పీఎల్‌ఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతోపాటు 8 మిల్లీమీటర్ల మందం కలిగిన బాడీని అందించారు. దుమ్ము, నీటి తుంపర్ల నుంచి రక్షణ కోసం ఐపీ64 రేటింగ్ ఇచ్చారు. వెనుకవైపు 50 మెగాపిక్స‌ల్ ప్రధాన కెమెరా, 2 మెగాపిక్స‌ల్ డెప్త్ సెన్సార్ ఉండగా, ముందు భాగంలో 8 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 8 సాఫ్ట్‌వేర్‌తో ఈ ఫోన్ అందుబాటులో ఉన్నట్లు స్పెసిఫికేషన్లలో పేర్కొన్నారు. సర్కిల్ టు సెర్చ్ 3.0, గూగుల్ జెమిని, పెర్ప్లెక్సిటీ వంటి ఏఐ సేవలకు మద్దతుత పాటు క్విక్ షేర్, మోడ్స్ అండ్ రొటీన్స్ సదుపాయాలు ఉన్నాయి. అయితే, ఫోన్ పరిచయ వివరాల్లో వన్ యూఐ 9గా పేర్కొనగా, స్పెసిఫికేషన్ల విభాగంలో వన్ యూఐ 8గా ఉంది.

భారీ బ్యాట‌రీ..

ఇందులో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. గెలాక్సీ ఎ06తో పోలిస్తే వీడియో ప్లేబ్యాక్ సమయం సుమారు 22 శాతం ఎక్కువగా ఉంటుందని శాంసంగ్ వెల్లడించింది. 25 వాట్ల వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఉంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3.5 మిల్లీమీటర్ల ఆడియో జాక్, డ్యుయల్ సిమ్, 4జీ వోల్టీ, వైఫై, బ్లూటూత్ 5.3, యూఎస్‌బీ టైప్ సి కనెక్టివిటీ సదుపాయాలు ఉన్నాయి. శాంసంగ్ నాక్స్ ద్వారా వ్యక్తిగత సమాచారం, బయోమెట్రిక్ వివరాలకు భద్రత కల్పిస్తున్నారు. ఈ ఫోన్‌కు ఆరు ప్రధాన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌గ్రేడ్‌లు, ఆరు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లు అందించనున్నట్లు సంస్థ తెలిపింది.

ధ‌ర వివ‌రాలు..

డార్క్ బ్లూ, సిల్వర్, గ్రీన్ రంగుల్లో లభించే గెలాక్సీ ఎ08 ధరను రూ.18,499గా నిర్ణయించారు. ఈ ధర 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు వర్తిస్తుంది. శాంసంగ్ ప్రత్యేక స్టోర్లు, అధీకృత విక్రయ కేంద్రాలు, శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ప్రముఖ ఆన్‌లైన్ వేదికల్లోనూ ఈ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై ఆరు నెలల వరకు, భాగస్వామ్య ఎన్‌బీఎఫ్‌సీ సంస్థల ద్వారా తొమ్మిది నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.

Advertisement
Advertisement