త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Spain | స్పెయిన్‌లోకి వేలాది మంది మొరాకో శ‌ర‌ణార్థులు.. స‌రిహ‌ద్దు దాటే క్ర‌మంలో తొమ్మిది మంది మృతి

Spain | ఉత్తర ఆఫ్రికాలోని స్పెయిన్ (Spain) భూభాగమైన సెయుటా (Ceuta) సరిహద్దుల్లో తీవ్ర సంక్షోభం నెల‌కొంది. మొరాకో (Morocco) నుంచి వేలాది మంది శ‌రణార్థులు (Moroccan migrants) స్పెయిన్‌లోకి చొచ్చుకొచ్చారు.

D

International | Published On Jul 31, 2026, 2.39 pm IST

Spain | స్పెయిన్‌లోకి వేలాది మంది మొరాకో శ‌ర‌ణార్థులు.. స‌రిహ‌ద్దు దాటే క్ర‌మంలో తొమ్మిది మంది మృతి
Advertisement

Spain | ఉత్తర ఆఫ్రికాలోని స్పెయిన్ (Spain) భూభాగమైన సెయుటా (Ceuta) సరిహద్దుల్లో తీవ్ర సంక్షోభం నెల‌కొంది. మొరాకో (Morocco) నుంచి వేలాది మంది శ‌రణార్థులు (Moroccan migrants) స్పెయిన్‌లోకి చొచ్చుకొచ్చారు. దాదాపు రెండు వేల నుంచి మూడు వేల మంది వ‌ల‌స‌దారులు స‌ముద్రంలో ఈదుకుంటూ, కంచెలను తెంచుకుని సెయుటాలోకి ప్రవేశించారు. దీంతో స‌రిహ‌ద్దు వ‌ద్ద ఉద్రిక్త వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. వ‌ల‌స‌దారుల‌ను అడ్డుకునేందుకు స్థానిక అధికారులు చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు.

అప్ర‌మ‌త్త‌మైన స్పెయిన్ ప్ర‌భుత్వం.. సరిహద్దుల్లో శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు సాయుధ బలగాలను (Armed Forces) రంగంలోకి దించింది. మ‌రోవైపు వ‌స‌ల‌దారులు భ‌ద్ర‌తా సిబ్బందిని దాటి దూసుకొస్తుండ‌టంతో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని ప్ర‌క‌టించాల‌ని సెయుటా ప్ర‌భుత్వం మాడ్రిడ్‌ను కోరింది. ఆత్యయిక స్థితి విధింపునకు స్పెయిన్ స‌ర్కార్ విముఖ‌త వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. కాగా, టారాహల్‌ సరిహద్దు మోహ‌రించిన భ‌ద్ర‌తా సిబ్బందిని దాటి వ‌ల‌స‌దారులు స‌ముద్రం ద్వారా భారీగా సెయుటాలోకి ప్ర‌వేశిస్తున్న‌ట్లు స్పెయిన్‌కు చెందిన గార్డియా సివిల్ తెలిపింది. కొంద‌రు స‌రిహ‌ద్దును వేరు చేసే కంచెను తొల‌గించి ప్ర‌మాద‌క‌రంగా సెయుటాలోకి ప్ర‌వేశిస్తున్నారు. ఈ క్ర‌మంలో తొమ్మిది మంది నుంచి 18 మంది ప్రాణాలు కోల్పోయి ఉంటార‌ని స్థానిక మీడియా నివేదించింది.

స్పెయిన్ వ‌ర్దిల్లాలి..

స‌రిహ‌ద్దు వ‌ద్ద ప‌రిస్థితి అదుపుత‌ప్పింద‌ని స్థానిక సెయుటా సివిల్ గార్డ్ అధికారులు తెలిపారు. ప‌రిస్థితి అస్త‌వ్య‌స్తంగా మారింద‌న్నారు. తీరం దాటుతున్న వారి క‌చ్చిత‌మైన సంఖ్య చెప్ప‌డం సాధ్యం కావ‌డం లేద‌న్నారు. ఇక వలసదారుల్లో అధిక సంఖ్యలో యువకులు ఉన్నప్పటికీ.. మహిళలు, చిన్నారులతో కూడిన కుటుంబాలు కూడా కనిపించాయి. స్పెయిన్‌ భూభాగంలోకి అడుగుపెట్ట‌గానే కొంద‌రు స్పెయిన్ వ‌ర్దిల్లాలి (Long live Spain) వంటి నినాదాలు చేశారు.

2021 నాటి ప‌రిస్థితులు

వేలాది మంది వ‌ల‌స‌దారులు సెయుటాలోకి చొచ్చుకొస్తున్న దృశ్యాలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఆ దృశ్యాల‌ను చూస్తుంటే ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితులు 2021 మేలో చోటుచేసుకున్న భారీ వ‌ల‌స‌ల సంక్షోభాన్ని గుర్తు చేస్తున్నాయి. అప్ప‌ట్లో కేవ‌లం రెండు రోజుల వ్య‌వ‌ధిలోనే స‌బ్ స‌హారా ఆఫ్రికా నుంచి 10 వేల మంది వ‌ల‌స‌దారులు సెయుటాలోకి ప్ర‌వేశించారు. ఆ సమయంలో మొరాకో ఉద్దేశపూర్వకంగా సరిహద్దు నియంత్రణలను సడలించిందనే ఆరోపణలు వినిపించాయి.

ఇప్పుడు మ‌రోసారి అలాంటి ప‌రిస్థితులే క‌నిపిస్తుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. సెయుటా అనేది ఆఫ్రికా ఉత్తర భాగంలో ఉన్న ఒక చిన్న భూభాగం. ఇది 1580 సంవత్సరం నుండి స్పెయిన్ దేశం ఆధీనంలో ఉంది. ఆఫ్రికా దేశాల నుంచి ఐరోపాకు వెళ్లాల‌నుకునే శ‌ర‌ణార్థుల‌కు సెయుటా కీల‌క ప్ర‌ధాన ద్వారంగా మారింది.

Also Read..

భార‌త ప‌ర్య‌ట‌న‌కు చైనా అధ్య‌క్షుడు.. గ‌ల్వాన్ ఘ‌ర్ష‌ణ త‌ర్వాత తొలిసారి

మా నాన్న యూనిఫామ్ ర‌క్తంతో త‌డిసిపోయింది.. మాకూ న్యాయం చేయండి

ఈ-కార్‌ రేసు కేసు.. నాంప‌ల్లి కోర్టుకు హాజ‌రైన కేటీఆర్‌.. విచార‌ణ వాయిదా

Advertisement

తాజావార్తలు

Advertisement