Mine Collapse | కుప్పకూలిన బంగారు గని.. 30 మంది కార్మికులు సజీవసమాధి
Mine Collapse | సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ (Central African Republic) లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బంగారు గని కుప్పకూలడంతో (Mine Collapse) 30 మంది కార్మికులు మృతిచెందారు.
International | Published On Aug 19, 2026, 7.29 am IST
Mine Collapse | త్రినేత్ర.న్యూస్: సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ (Central African Republic) లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బంగారు గని కుప్పకూలడంతో (Mine Collapse) 30 మంది కార్మికులు మృతిచెందారు. మట్టిదిబ్బల కింద మరికొందరు చిక్కుకుపోయారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
నానా-మాంబెరే ప్రిఫెక్చర్ (Nana-Mambere prefecture) పరిధిలోని అబ్బా ప్రాంతంలో (Abba region) ఒక చిన్నస్థాయి బంగారు గనిలో (Gold Mine) సంప్రదాయ పద్దతితో కార్మికులు తొవ్వకాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో మట్టిదిబ్బలు ఒక్కసారిగా కుప్పకూలాయి. దీంతో 30 కార్మికులు సజీవ సమాధి అయ్యారు. స్థానికులు, పోలీసులు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వారు బయటపడే అవకాశం తక్కువగా ఉందని ప్రమాదం నుంచి బయటపడిన ఫ్లోరియన్ గాగుండే అనే కార్మికుడె వెల్లడించారు.

గాయపడిన కార్మికులకు చికిత్స అందిస్తున్నామని సబ్-ప్రిఫెక్చర్ డిప్యూటీ మేయర్ సులేమాన్ బి (Souleymane Bi) తెలిపారు. లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. గని వద్ద బురదతో నిండిన గోతుల నుంచి మృతదేహాలను వెలికితీస్తున్న దృశ్యాలు ప్రచారంలోకి వచ్చాయి. కాగా, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లో ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా చిన్న తరహాలో సాగించే సంప్రదాయ గని తవ్వకాల వల్ల ఇలాంటి ప్రాణాంతక ప్రమాదాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి.
తాజావార్తలు
- ●BOB LBO Recruitment | బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు
- ●Revanth Reddy | ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
- ●Horoscope | ఆగస్టు 19 రాశిఫలాలు.. ఈ రాశివారు మోసపోయే అవకాశం!
- ●Bariatric Surgery Delhi | 16 ఏళ్లకే 275 కిలోల బరువు.. కారులో పట్టక వ్యాన్లో ఆసుపత్రికి: ఢిల్లీ బాలుడికి అరుదైన సర్జరీ
- ●PM CARES Fund audit 2025 | పీఎం కేర్స్ ఫండ్ సంచలన లెక్కలు: అకౌంట్లో రూ.8,452 కోట్లు.. కానీ ఖర్చు చేసింది మాత్రం 87 లక్షలే!
- ●National Conclave | ప్రెస్ క్లబ్స్ ఫెడరేషన్ జాతీయ సదస్సుకు రండి.. గవర్నర్ను ఆహ్వానించిన ప్రతినిధులు

BOB LBO Recruitment | బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు

Revanth Reddy | ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది: సీఎం రేవంత్ రెడ్డి

Horoscope | ఆగస్టు 19 రాశిఫలాలు.. ఈ రాశివారు మోసపోయే అవకాశం!

Bariatric Surgery Delhi | 16 ఏళ్లకే 275 కిలోల బరువు.. కారులో పట్టక వ్యాన్లో ఆసుపత్రికి: ఢిల్లీ బాలుడికి అరుదైన సర్జరీ




