Operation Sindoor | ‘ఆపరేషన్ సిందూర్’.. అమరులైన ఆరుగురు జవాన్లు వీరే
Operation Sindoor | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా గతేడాది మే 7వ తేదీన దాయాది దేశం పాకిస్తాన్( Pakistan )పై భారత్ ఆపరేషన్ సిందూర్( Operation Sindoor ) చేపట్టిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్‌లో ఐదుగురు ఆర్మీ జవాన్లు( Army Jawans ), ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ప్రతినిధి ఒకరు అమరులు అయ్యారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన ఆ అమరవీరుల పేర్లను శుక్రవారం కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.
Operation Sindoor | త్రినేత్ర.న్యూస్ : పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా గతేడాది మే 7వ తేదీన దాయాది దేశం పాకిస్తాన్( Pakistan )పై భారత్ ఆపరేషన్ సిందూర్( Operation Sindoor ) చేపట్టిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్‌లో ఐదుగురు ఆర్మీ జవాన్లు( Army Jawans ), ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ప్రతినిధి ఒకరు అమరులు అయ్యారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన ఆ అమరవీరుల పేర్లను శుక్రవారం కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.

అమరవీరుల పేర్లను నేషనల్ వార్ మెమోరియల్ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. వీరి పేర్లను ఢిల్లీలోని ఇండియా గేట్ సర్కిల్‌లో ఉన్న జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రత్యేక శిలాఫలకంపై శాశ్వతంగా లిఖించనున్నారు. అయితే ఆరుగురు అమరవీరుల పేర్లను ప్రకటించడం ఇదే తొలిసారి. 2025 ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దాడికి ప్రతీకారంగా మే 7వ తేదీన పాకిస్థాన్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్ విరుచుకుపడింది.
అమరవీరుల పేర్లు ఇవే..
సుబేదర్ మేజర్ పవన్ కుమార్ - 10 ఇన్‌ఫాంట్రీ బ్రిగేడ్ హెడ్‌క్వార్టర్స్
రైఫిల్‌మ్యాన్ సునీల్ కుమార్ - జమ్మూకశ్మీర్ లైట్ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్‌కు చెందిన 4వ బెటాలియన్
లాన్స్ నాయక్ దినేశ్ కుమార్ - 5 ఫీల్డ్ రెజిమెంట్
హవల్దార్ సునీల్ కుమార్ సింగ్ - 237 ఫీల్డ్ వర్క్‌షాప్
అగ్నివీర్ మురళీ నాయక్ - 851 లైట్ రెజిమెంట్
సార్జెంట్ సురేంద్ర కుమార్ - ఎయిర్‌ఫోర్స్ 39వ వింగ్
వీరిలో రైఫిల్‌మ్యాన్ సునీల్ కుమార్‌ను కేంద్రం మరణానంతరం మూడో అత్యున్నత యుద్ధ పురస్కారమైన ‘వీర చక్ర’తో సత్కరించింది. ఇక, సార్జెంట్ సురేంద్ర కుమార్‌ను ‘వాయు మెడల్’తో గౌరవించింది.
మురళీ నాయక్ తెలుగు వ్యక్తే..
అగ్నివీర్ మురళీ నాయక్ స్వస్థలం శ్రీసత్యసాయి జిల్లా కళ్లితండా. కాగా 2022లో అగ్నివీర్‌గా ఎంపికయ్యాడు. విధుల్లో చేరిన కొత్తలో పంజాబ్, అసోంలో సేవలందించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ పాకిస్తాన్‌తో జరిగిన ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు మురళీ నాయక్.
తాజావార్తలు
- ●Meheshwar Reddy | ఇక్కడ పాఠశాలల్లో వసతులు లేవంటే.. ఎక్కడో ఉన్న ‘ఆక్స్ఫర్డ్’ను తీసుకొస్తడట
- ●Avinya27 | యువ ఆవిష్కర్తలకు కేంద్రం పిలుపు.. అవిన్యా 27 ఎనర్జీ స్టార్టప్ ఛాలెంజ్..
- ●Ponnam Prabhakar | బీజేపీ దీక్షలన్నీ డ్రామాలే.. దమ్ముంటే ఢిల్లీ నుంచి ఫండ్స్ తీసుకురండి: మంత్రి పొన్నం ఫైర్
- ●Jairam Ramesh | ఇస్రోను కేంద్రం బలహీనపరుస్తోంది.. జైరామ్ రమేష్
- ●Jantar Mantar Protest | మహిళా ఆందోళనకారులను వేధించారని ఆరోపణలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..!
- ●Aishwarya Lekshmi | అల్లు అర్జున్ రాకాలో లేడీ విలన్‌గా మలయాళం హీరోయిన్

Meheshwar Reddy | ఇక్కడ పాఠశాలల్లో వసతులు లేవంటే.. ఎక్కడో ఉన్న ‘ఆక్స్ఫర్డ్’ను తీసుకొస్తడట

Avinya27 | యువ ఆవిష్కర్తలకు కేంద్రం పిలుపు.. అవిన్యా 27 ఎనర్జీ స్టార్టప్ ఛాలెంజ్..

Ponnam Prabhakar | బీజేపీ దీక్షలన్నీ డ్రామాలే.. దమ్ముంటే ఢిల్లీ నుంచి ఫండ్స్ తీసుకురండి: మంత్రి పొన్నం ఫైర్

Jairam Ramesh | ఇస్రోను కేంద్రం బలహీనపరుస్తోంది.. జైరామ్ రమేష్






