త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Earthquake | వ‌రుస‌ భూకంపాలు.. మొన్న అఫ్గానిస్థాన్‌.. నిన్న జ‌పాన్‌.. నేడు చైనా

Earthquake | వరుస భూకంపాలతో (Earthquake) ప్ర‌పంచ దేశాలు వ‌ణికిపోతున్నాయి. ఇటీవల వెనెజువెలా, జపాన్, ఫిలిప్పీన్స్ దేశాల్లో భారీ భూకంపాలు వ‌చ్చాయి. దీంతో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభ‌వించిన విష‌యం తెలిసిందే.

G

International | Published On Jun 29, 2026, 10.04 am IST

Earthquake | వ‌రుస‌ భూకంపాలు.. మొన్న అఫ్గానిస్థాన్‌.. నిన్న జ‌పాన్‌.. నేడు చైనా
Advertisement

Earthquake | త్రినేత్ర‌.న్యూస్‌: వరుస భూకంపాలతో (Earthquake) ప్ర‌పంచ దేశాలు వ‌ణికిపోతున్నాయి. ఇటీవల వెనెజువెలా, జపాన్, ఫిలిప్పీన్స్ దేశాల్లో భారీ భూకంపాలు వ‌చ్చాయి. దీంతో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభ‌వించిన విష‌యం తెలిసిందే. శనివారం అఫ్గానిస్థాన్‌ (Afghanistan), పాకిస్థాన్‌లోనూ (Pakistan) భూప్రకంపనలు సంభవించాయి. వీటి తీవ్రత ఢిల్లీని కూడా తాగాయి. తాజాగా చైనాలోని (China Earthquake) సిచువాన్ ప్రావిన్స్‌లో భూమి కంపించింది. సోమవారం తెల్ల‌వారుజామున 12.12 గంట‌ల స‌మ‌యంలో యిబిన్ నగరం (Yibin City), గావోక్సియన్ కౌంటీ (Gaoxian County) కేంద్రంగా భారీ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు చైనా భూకంపం నెట్‌వర్క్స్ సెంటర్ (CENC) వెల్ల‌డించింది.

దీని తీవ్ర‌త రిక్టర్ స్కేలుపై 5.5 గా నమోదు అయ్యిందని తెలిపింది. 6 కిలోమీట‌ర్ల లోతులో భూకంప కేంద్రం ఉంద‌ని పేర్కొంది. కాగా, భూకంప కేంద్రానికి 200 కిలోమీటర్లకు దూరంలో ఉన్న చెంగ్డూ, చోంగ్‌కింగ్‌తో సహా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయని అధికారులు తెలిపారు. భూకంపం వ‌ల్ల 13 మంది గాయ‌ప‌డ్డారు. ప‌లుచోట్ల ఇండ్ల‌కు ప‌గుళ్లు వ‌చ్చాయ‌ని వెల్ల‌డించారు.

వెనిజులాలో భారీ న‌ష్టం..

గత బుధ‌వారం సాయంత్రం వెనిజులాలో (Venezuela Earthquake) క్ష‌ణాల వ్య‌వ‌ధిలో సంభ‌వించిన రెండు భారీ భూకంపాలు భ‌యోత్పాతం సృష్టించాయి. 7.2, 7.5 తీవ్ర‌త‌తో భూకంపాలు రావ‌డంతో వంద‌ల సంఖ్య‌లో ఇండ్లు, భ‌వ‌నాలు నేల‌మ‌ట్ట‌మ‌య్యాయి. ప్ర‌కృతి ప్ర‌కోపానికి ఇప్ప‌టివ‌ర‌కు 1450 మంది మృతిచెందారు. సుమారు 50 వేల మంది గ‌ల్లంత‌య్యారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బ‌య‌ట‌కు తీసేందుకు స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి.

అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌లో..

శనివారం సాయంత్రం అఫ్గానిస్థాన్‌లోని (Afghanistan) హిందూకుష్ ప్రాంతంలో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.2 (Magnitude) గా నమోదైంది. భారత కాలమానం ప్రకారం జూన్ 27న‌ సాయంత్రం 7:04 గంటలకు ఈ భూకంపం వచ్చింది. ఈ భూకంపం ధాటికి పాకిస్తాన్, నార్త్ ఇండియాలోని పలు ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు (Tremors) కనిపించాయి.

ఎనిమిది దేశాల్లో ప్రకంపనలు..

ఈశాన్య ఆఫ్ఘనిస్తాన్‌లోని కలాఫ్‌గాన్‌కు 81 కిలోమీటర్ల దూరంలో, భూమికి 215 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం (Epicentre) ఉన్నట్లు సీస్మాలజిస్టులు గుర్తించారు. భూకంపం చాలా లోతులో రావడం వల్లే దీని ప్రభావం విశాలమైన భౌగోళిక ప్రాంతంపై పడింది. అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌, భార‌త్‌, చైనా, తజికిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, కిర్గిజ్‌స్తాన్‌, తుర్క్మెనిస్తాన్ తదితర దేశాల్లో ఈ ప్రకంపనలు వచ్చాయి.

జ‌పాన్‌లో..

ఆదివారం తెల్లవారుజామున జపాన్ ఈశాన్య ప్రాంతంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం భూమికి సుమారు 40 కిలోమీటర్ల లోతులో ఉందని జేఎంఏ పేర్కొంది. స్థానిక కాలమానం ప్రకారం ఈ భూకంపం ఉదయం 5.21 గంటలకు సంభవించిందని వెల్లడించింది. కాగా, జపాన్‌లో ఈనెల 25న కూడా భూకంపం వ‌చ్చింది. ఇవాటే ప్రిఫెక్చర్ తీర ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ఇది నమోదైంది.

Advertisement
Advertisement