Pakistan | ఆఫ్గాన్ సరిహద్దులో పాక్ భూతల దాడులు.. 35 మంది మృతి
Pakistan | ఆఫ్గానిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో పాక్ (Pakistan) భద్రతా దళాలు గ్రౌండ్ ఆపరేషన్ (ground operation) నిర్వహించాయి. ఈ దాడుల్లో (strikes) చిన్నారులు సహా మొత్తం 35 మంది ప్రాణాలు కోల్పోయారు.
International | Published On Jun 29, 2026, 12.57 pm IST
Pakistan | ఆఫ్గానిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో పాక్ (Pakistan) భద్రతా దళాలు గ్రౌండ్ ఆపరేషన్ (ground operation) నిర్వహించాయి. ఆ తర్వాత మిలిటెంట్ స్థావరాలు, సురక్షిత ప్రాంతాలపై వైమానిక దాడులు చేపట్టాయి. ఈ దాడుల్లో (strikes) చిన్నారులు సహా మొత్తం 35 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఆదివారం అర్ధరాత్రి 12:30 గంటలకు పాకిస్థాన్ వైమానిక దళ యుద్ధ విమానాలు రంగంలోకి దిగాయి. ఆఫ్ఘానిస్థాన్‌లోని గ్యాన్, చమ్కాని, కునార్‌లోని మరవారా ప్రాంతాల్లో ఇళ్లు, మసీదులపై బాంబుల వర్షం కురిపించాయి. ఖైబర్ ఫక్తుంక్వా ప్రావిన్సులో ఉన్న ఖైబర్ జిల్లాలో ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా పాక్ దళాలు ఈ గ్రౌండ్ ఆపరేషన్ నిర్వహించాయి. కేవలం 25 నిమిషాల వ్యవధిలోనే రెండు దాడులు చేపట్టాయి. తొలి దాడితో ధ్వంసమైన శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు స్థానికులు అక్కడికి చేరుకున్న సమయంలో పాక్ యుద్ధ విమానాలు రెండోసారి వారిపై బాంబులతో దాడి చేశాయి. ఈ దాడిలో చిన్నారులు, మహిళలు సహా 35 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 100కుపైగా గాయపడ్డారు. వారందరూ ప్రస్తుతం పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
మరోవైపు, పాక్ జరిపిన ఈ దాడుల్లో మహిళలు, పిల్లలు సహా డజన్ల కొద్దీ పౌరులు మరణించినట్లు తాలిబన్ ప్రభుత్వం తెలిపింది. అంతేకాదు తమ భూభాగంపై ఎలాంటి ఉగ్రవాదులకూ ఆశ్రయం కల్పించడం లేదని కాబూల్ స్పష్టం చేసింది. అయితే, పాక్ మాత్రం జమాత్ ఉల్ అహ్రర్, ఫితనా అల్ ఖ్వారిజికి చెందిన ఉగ్ర క్యాంపులే లక్ష్యంగా దాడులు జరిపినట్లు వెల్లడించింది. సుమారు 25 మందికిపైగా మిలిటెంట్లను హతమార్చినట్లు ప్రకటించింది. అంతేకాదు, ఆయా ఉగ్ర క్యాంపుల నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన వరుస ఉగ్రదాడులకు ప్రతిస్పందనగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు పేర్కొంది.
సంబంధిత వార్తలు

Earthquake | వరుస భూకంపాలు.. మొన్న అఫ్గానిస్థాన్.. నిన్న జపాన్.. నేడు చైనా
జూన్ 29, 2026

Operation Sindoor | ‘ఆపరేషన్ సిందూర్’.. అమరులైన ఆరుగురు జవాన్లు వీరే
జూన్ 26, 2026

UNHRC | పెంచిన భూతమే కాటేస్తోంది.. సింధు జలాల ఒప్పందానికి కాలం చెల్లింది.. ఐరాసలో పాకిస్థాన్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్
జూన్ 19, 2026
తాజావార్తలు
- ●Heavy Rain | మళ్లీ మునిగిన ముంబై.. అస్సాంలో కూలిపోయిన రైల్వే బ్రిడ్జ్.. అరుణాచల్‌తో తొమ్మిది మంది గల్లంతు
- ●Vijayabhaskar Resign to AIADMK | పళనిస్వామికి బిగ్ షాక్.. మరో ఎమ్మెల్యే రాజీనామా
- ●Airtel | జియోకు షాకిచ్చిన ఎయిర్టెల్.. భారీగా పెరిగిన కొత్త సబ్స్క్రైబర్లు..
- ●Gold Robbery Dubbaka | కాశీకెళ్లింది చూశారు.. కిలో బంగారం ఎత్తుకెళ్లారు
- ●TGSWREIS Recruitment | గురుకులాల్లో 117 పోస్టులు.. దరఖాస్తులకు ముగుస్తున్న గడువు
- ●Credit Score | ఆదాయం ఎక్కువగా ఉన్నా క్రెడిట్ స్కోరు పెరగడం లేదా.. కారణాలు ఇవే..!

Heavy Rain | మళ్లీ మునిగిన ముంబై.. అస్సాంలో కూలిపోయిన రైల్వే బ్రిడ్జ్.. అరుణాచల్‌తో తొమ్మిది మంది గల్లంతు

Vijayabhaskar Resign to AIADMK | పళనిస్వామికి బిగ్ షాక్.. మరో ఎమ్మెల్యే రాజీనామా

Airtel | జియోకు షాకిచ్చిన ఎయిర్టెల్.. భారీగా పెరిగిన కొత్త సబ్స్క్రైబర్లు..

Gold Robbery Dubbaka | కాశీకెళ్లింది చూశారు.. కిలో బంగారం ఎత్తుకెళ్లారు



