త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | ఈ-కార్‌ రేసు కేసు.. నాంప‌ల్లి కోర్టుకు హాజ‌రైన కేటీఆర్‌.. విచార‌ణ వాయిదా

KTR | ఫార్ములా ఈ-కార్‌ రేసు కేసులో హైదరాబాద్‌ నాంపల్లి కోర్టుకు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ శుక్ర‌వారం హాజరయ్యారు. ఆయ‌న‌తో పాటు ఐఏఎస్ అర్వింద్ కుమార్ (A2), హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బి.ఎల్.ఎన్.రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. కేటీఆర్‌ను ఏ1గా పేర్కొంటూ 77 పేజీల ఛార్జ్‌షీట్‌ను గ‌త‌ మార్చి 23న దాఖలు చేసింది.

S

Telangana | Published On Jul 31, 2026, 12.52 pm IST

KTR | ఈ-కార్‌ రేసు కేసు.. నాంప‌ల్లి కోర్టుకు హాజ‌రైన కేటీఆర్‌.. విచార‌ణ వాయిదా
Advertisement

త్రినేత్ర‌.న్యూస్: ఫార్ములా ఈ-కార్‌ రేసు కేసులో హైదరాబాద్‌ నాంపల్లి కోర్టుకు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ శుక్ర‌వారం హాజరయ్యారు. ఆయ‌న‌తో పాటు ఐఏఎస్ అర్వింద్ కుమార్ (A2), హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బి.ఎల్.ఎన్.రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. వీరు ల‌క్ష పూచీక‌త్తును స‌మ‌ర్పించిన‌ట్లు తెలిసింది. ఈ నేప‌థ్యంలో తదుపరి విచారణను ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆగస్టు 25కి వాయిదా వేసింది. ఇప్ప‌టికే కేటీఆర్‌ను ఏ1గా పేర్కొంటూ 77 పేజీల ఛార్జ్‌షీట్‌ను గ‌త‌ మార్చి 23న దాఖలు చేసింది. ఈ ఛార్జ్‌షీట్‌లో మొత్తం 14 మంది సాక్షులను ఏసీబీ ప్రస్తావించింది. ఇదిలా ఉండ‌గా ప్రతిష్టాత్మక కార్యక్రమం నిర్వహిస్తే రాజకీయ కక్షతో నేరంగా చిత్రీకరిస్తున్నారని కేటీఆర్‌ ఖండిస్తున్న సంగతి తెలిసిందే.

ఫార్ములా ఈ-రేసు నిర్వహణలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని ఆరోపిస్తూ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో కేటీఆర్‌ సహా ఐదుగురిపై అభియోగాలు నమోదు చేసినట్లు పేర్కొంది. ఫార్ములా ఈ రేసు నిర్వహణకు సంబంధించి అనుమతులు పొందకుండానే నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించింది. కేబినెట్‌, ఆర్థిక శాఖ, న్యాయశాఖ అనుమతులు లేకుండా ముందుకు వెళ్లారని తెలిపింది. లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ (ఎల్‌వోఐ)పై సంతకం జరిగేలా కేటీఆర్‌ వ్యవహరించారని ఏసీబీ ఆరోపణ‌లు చేసింది. హెచ్‌ఎండీఏ నుంచి రూ.55 కోట్ల నిధులు వినియోగించార‌ని, ప్రభుత్వంపై సుమారు రూ.600 కోట్ల భారం పడిందని ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నట్లు తెలిపింది. మూడు సీజన్ల ఖర్చును ఒకే రేసుకు చూపి కేబినెట్ ఆమోదం పొందకుండా తప్పించుకున్నారని ఆరోపించింది. విదేశీ సంస్థలకు నిధులు బదిలీ చేశారని ఏసీబీ అభియోగం మోపింది.

Advertisement
Advertisement