Income Tax | రూ.50వేలకు పైగా విలువైన వస్తువును లేదా డబ్బును గిఫ్ట్‌గా అందుకున్నారా.. ఇలా చేస్తే పన్ను ఉండదు..
Income Tax | స్నేహితుడు లేదా కుటుంబానికి వెలుపల ఉన్న వ్యక్తి నుంచి ఖరీదైన గిఫ్ట్ రావడం ఆనందంగా అనిపిస్తుంది. అయితే అలాంటి గిఫ్ట్‌లకు ఆదాయపు పన్ను నిబంధనలు వర్తించే అవకాశం ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. బంధువులు కాని వ్యక్తుల నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో నిర్దిష్ట పరిమితికి మించిన విలువ కలిగిన గిఫ్ట్‌లను అందుకుంటే అవి పన్ను పరిధిలోకి వస్తాయి.
Income Tax | స్నేహితుడు లేదా కుటుంబానికి వెలుపల ఉన్న వ్యక్తి నుంచి ఖరీదైన గిఫ్ట్ రావడం ఆనందంగా అనిపిస్తుంది. అయితే అలాంటి గిఫ్ట్‌లకు ఆదాయపు పన్ను నిబంధనలు వర్తించే అవకాశం ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. బంధువులు కాని వ్యక్తుల నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో నిర్దిష్ట పరిమితికి మించిన విలువ కలిగిన గిఫ్ట్‌లను అందుకుంటే అవి పన్ను పరిధిలోకి వస్తాయి. అయితే మీ మొత్తం ఆదాయం, మీరు ఎంచుకున్న పన్ను విధానం ఆధారంగా సెక్షన్ 87ఎ కింద లభించే రిబేట్ వల్ల ఆ గిఫ్ట్‌పై చెల్లించాల్సిన పన్ను పూర్తిగా తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 56(2)(ఎక్స్) ప్రకారం.. బంధువులు కాని వ్యక్తుల నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.50వేల కంటే ఎక్కువ విలువ కలిగిన గిఫ్ట్‌లను అందుకుంటే వాటిని పన్ను విధించే ఆదాయంగా పరిగణిస్తారు. ఒకసారి ఈ పరిమితిని దాటితే, రూ.50వేలకు మించిన మొత్తం మాత్రమే కాకుండా, గిఫ్ట్ మొత్తం విలువనే ఇన్‌కమ్ ఫ్రం అదర్ సోర్సెస్ కింద పన్నుకు గురవుతుంది. దీనిపై వర్తించే ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్ల ప్రకారం పన్ను లెక్కిస్తారు.
ఏయే గిఫ్ట్‌లకు వర్తిస్తుంది..
ఈ నిబంధన నగదు, స్థిరాస్తి, షేర్లు, సెక్యూరిటీలు, చట్టంలో పేర్కొన్న ఇతర ఆస్తుల రూపంలో లభించే గిఫ్ట్‌లకు వర్తిస్తుంది. అయితే చట్టంలో పేర్కొన్న మినహాయింపులు ఉన్న గిఫ్ట్‌లకు ఇది వర్తించదు. పన్ను విధించే గిఫ్ట్‌లు మీ మొత్తం ఆదాయంలో కలిసిపోయినా, అర్హత ఉన్న నివాస భారతీయ వ్యక్తులు సెక్షన్ 87ఎ కింద రిబేట్ పొందడం ద్వారా పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. కొత్త పన్ను విధానంలో సాధారణ పన్ను విధించబడే ఆదాయం రూ.12 లక్షలు మించకపోతే గరిష్ఠంగా రూ.60వేల వరకు రిబేట్ పొందవచ్చు. పాత పన్ను విధానంలో మొత్తం పన్ను విధించబడే ఆదాయం రూ.5 లక్షలు మించకపోతే గరిష్ఠంగా రూ.12,500 వరకు రిబేట్ లభిస్తుంది. ఈ రిబేట్ కేవలం నివాస భారతీయ వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. చెల్లించాల్సిన ఆదాయపు పన్ను మొత్తం లేదా చట్టంలో నిర్ణయించిన గరిష్ఠ రిబేట్ పరిమితి వీటిలో ఏది తక్కువైతే అంత మొత్తమే రిబేట్‌గా లభిస్తుంది.
ప్రతి గిఫ్ట్‌కు పన్ను ఉండదు..
రూ.50వేల కంటే ఎక్కువ విలువ ఉన్న ప్రతి గిఫ్ట్‌కూ పన్ను వర్తించదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో లభించే గిఫ్ట్‌లకు ఆదాయపు పన్ను చట్టం పూర్తిగా మినహాయింపు కల్పిస్తుంది. వివాహ సందర్భంలో అందుకునే గిఫ్ట్‌లు పన్ను నుంచి మినహాయింపు పొందుతాయి. అలాగే వీలునామా ద్వారా లేదా వారసత్వంగా వచ్చే ఆస్తులు కూడా పన్ను పరిధిలోకి రావు. దాత మరణం సమీపిస్తున్న పరిస్థితుల్లో ఇచ్చే గిఫ్ట్‌లకు కూడా పన్ను మినహాయింపు ఉంటుంది. కొందరు వ్యక్తులు లేదా సంస్థల నుంచి అందుకునే గిఫ్ట్‌లు వాటి విలువ ఎంత ఉన్నా పన్ను నుంచి పూర్తిగా మినహాయింపు పొందుతాయి. ఇందులో చట్టంలో పేర్కొన్న బంధువుల నుంచి వచ్చే గిఫ్ట్‌లు, స్థానిక సంస్థల నుంచి వచ్చే గిఫ్ట్‌లు, ఆదాయపు పన్ను చట్టం కింద గుర్తింపు పొందిన ట్రస్టులు, విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రుల నుంచి వచ్చే గిఫ్ట్‌లు, అలాగే బంధువుల ప్రయోజనం కోసం మాత్రమే ఏర్పాటు చేసిన ట్రస్టుల నుంచి వచ్చే గిఫ్ట్‌లు ఉంటాయి.
బంధువు అంటే ఎవరు..
హిందూ అవిభక్త కుటుంబం (హెచ్‌యూఎఫ్) విషయంలో ప్రతి సభ్యుడినీ బంధువుగా పరిగణిస్తారు. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల విషయంలో మాత్రం జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, పిల్లలు తదితర చట్టంలో పేర్కొన్న కుటుంబ సభ్యులను మాత్రమే బంధువులుగా గుర్తిస్తారు. స్టెప్ సోదరులు, మేనల్లుళ్లు, మేనకోడళ్లు, కజిన్స్ ను మాత్రం ఈ నిబంధనల ప్రకారం బంధువులుగా పరిగణించరు. బంధువు కాని వ్యక్తి నుంచి రూ.50వేల కంటే ఎక్కువ విలువ కలిగిన గిఫ్ట్ అందుకున్నంత మాత్రాన తప్పనిసరిగా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అలాంటి గిఫ్ట్‌లు సాధారణంగా పన్ను పరిధిలోకి వచ్చినప్పటికీ, మొత్తం ఆదాయం నిర్దేశించిన పరిమితిలో ఉంటే సెక్షన్ 8ఎ రిబేట్ ద్వారా పన్ను బాధ్యత పూర్తిగా శూన్యంగా మారే అవకాశం ఉంటుంది.
తాజావార్తలు
- ●Dasoju Sravan Kumar | బంకర్ బెడ్ల కుంభకోణంపై రేవంత్ ప్రభుత్వానికి నోటీసులు.. ‘పెద్ది’ పోరాట ఫలితమే
- ●Yellampalli Project | ఎల్లంపల్లికి పోటెత్తిన వరద.. 15 గేట్లు ఎత్తి నీటి విడుదల
- ●KTR | ఈ-కార్ రేసు కేసు.. నాంపల్లి కోర్టుకు హాజరైన కేటీఆర్.. విచారణ వాయిదా
- ●Rega Kanta Rao | పెండ్లి పేరుతో లైంగికంగా వేధించాడు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై కేసు నమోదు
- ●Coal Mine Blast | బొగ్గు గనిలో భారీ పేలుడు.. 34 మంది మృతి
- ●Rahul Gandhi | బెదిరింపులతో జెన్ జీ నోరు నొక్కేయలేరు.. మోదీ, షాపై రాహుల్ విమర్శలు

Dasoju Sravan Kumar | బంకర్ బెడ్ల కుంభకోణంపై రేవంత్ ప్రభుత్వానికి నోటీసులు.. ‘పెద్ది’ పోరాట ఫలితమే

Yellampalli Project | ఎల్లంపల్లికి పోటెత్తిన వరద.. 15 గేట్లు ఎత్తి నీటి విడుదల

KTR | ఈ-కార్ రేసు కేసు.. నాంపల్లి కోర్టుకు హాజరైన కేటీఆర్.. విచారణ వాయిదా

Rega Kanta Rao | పెండ్లి పేరుతో లైంగికంగా వేధించాడు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై కేసు నమోదు






