త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Godavari Fierce Flood | గోదావ‌రి ఉగ్ర‌రూపం.. ఇసుక పాయ‌ల్లో చిక్కుకున్న 38 మంది

Godavari Fierce Flood | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం వీరాపురం సమీపంలో గోదావరి నది ఉద్ధృతి పెరగడంతో ఇసుక క్వారీలో 38 మంది చిక్కుకున్నారు. నది మధ్యలో ఉన్న ఇసుక పాయల్లో చిక్కుకున్న వారిలో 30 మందికి పైగా లారీ డ్రైవర్లు, క్లీనర్లు, ఐదుగురు మిషన్ ఆపరేటర్లతో పాటు స్థానికులు ఉన్నారు.

S

Telangana | Published On Jul 31, 2026, 2.23 pm IST

Godavari Fierce Flood | గోదావ‌రి ఉగ్ర‌రూపం.. ఇసుక పాయ‌ల్లో చిక్కుకున్న 38 మంది
Advertisement

Godavari Fierce Flood | త్రినేత్ర‌.న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం వీరాపురం సమీపంలో గోదావరి నది ఉద్ధృతి పెరగడంతో ఇసుక క్వారీలో 38 మంది చిక్కుకున్నారు. నది మధ్యలో ఉన్న ఇసుక పాయల్లో చిక్కుకున్న వారిలో 30 మందికి పైగా లారీ డ్రైవర్లు, క్లీనర్లు, ఐదుగురు మిషన్ ఆపరేటర్లతో పాటు స్థానికులు ఉన్నారు. వీరాపురం ఇసుకపాయల్లోకి వరద నీరు అనూహ్యంగా వ‌చ్చి చేర‌డంతో అప్పటికే కొందరు లారీలతో బయటకు వచ్చారు.

ఉన్న‌ట్టుండి క్వారీలోకి ఒక్కసారిగా వరద నీరు వేగంగా వచ్చి చేరింది. ఈ స‌మాచారం తెలుసుకున్న స్థానిక సీఐ రాజవర్మ, ఎస్ఐ నర్సిరెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి బ‌య‌లుదేరి వెళ్లారు. ఇసుక‌పాయ‌ల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు పడవలను పంపించి రెస్క్యూ ఆపరేషన్ నిర్వ‌హిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

మ‌రోవైపు గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో చర్ల - ములుగు జిల్లా వెంకటపురం మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు వర‌ద‌లు త‌గ్గుముఖం ప‌ట్టేవ‌ర‌కు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద నీటి కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement