త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cyber Cheeting | ఎక్కువ లాభాలోస్తాయ‌ని ఆశ చూపారు.. అప్ప‌నంగా రూ.33 ల‌క్ష‌లు కాజేశారు

Cyber Cheeting | ఎంత టెక్నాల‌జీ వ‌స్తున్నా.. ప్ర‌భుత్వాలు ఎంత అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నా సైబ‌ర్ నేరాలకు చెక్ ప‌డ‌టం లేదు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఓ విశ్రాంత ఉద్యోగి నుంచి సైబ‌ర్ కేటుగాళ్లు ల‌క్ష‌లు కాజేసిన ఘ‌ట‌న తీవ్ర క‌ల‌క‌లం సృష్టించింది. అధిక లాభాలొస్తాయ‌ని ఆశ చూపించి, ట్రేడింగ్ యాప్ ద్వారా ఘ‌రానా మోసానికి పాల్ప‌డ్డారు.

S

Telangana | Published On Jul 31, 2026, 1.52 pm IST

Cyber Cheeting | ఎక్కువ లాభాలోస్తాయ‌ని ఆశ చూపారు.. అప్ప‌నంగా రూ.33 ల‌క్ష‌లు కాజేశారు
Advertisement
  • సంగారెడ్డి జిల్లాలో విశ్రాంత ఉద్యోగిని మోసం చేసిన సైబ‌ర్ కేటుగాళ్లు

Cyber Cheeting | త్రినేత్ర‌.న్యూస్: ఎంత టెక్నాల‌జీ వ‌స్తున్నా.. ప్ర‌భుత్వాలు ఎంత అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నా సైబ‌ర్ నేరాలకు చెక్ ప‌డ‌టం లేదు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఓ విశ్రాంత ఉద్యోగి నుంచి సైబ‌ర్ కేటుగాళ్లు ల‌క్ష‌లు కాజేసిన ఘ‌ట‌న తీవ్ర క‌ల‌క‌లం సృష్టించింది. అధిక లాభాలొస్తాయ‌ని ఆశ చూపించి, ట్రేడింగ్ యాప్ ద్వారా ఘ‌రానా మోసానికి పాల్ప‌డ్డారు. తెల్లాపూర్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగి మాణిక్ రెడ్డి నుంచి అప్ప‌నంగా రూ.33 లక్షలు కాజేశారు.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాలు ఇలా ఉన్నాయి. బాధితుడిని జూలై నెలలో 'నిషా వర్మ' అనే పేరుతో వాట్సాప్ ద్వారా సైబర్ నేరగాళ్లు సంప్రదించారు. అతడిని 'ఎల్‌ 179 అపెక్స్‌ డిజిటల్‌ క్యాపిటల్‌' అనే వాట్సాప్ గ్రూపులో చేర్చారు. షేర్ మార్కెట్ ట్రేడింగ్‌లో భారీ లాభాలు వస్తాయని నమ్మించారు. 'సెబీ' (SEBI) గుర్తింపు పొందిన అకౌంట్ అని నమ్మించి ఒక నకిలీ డీఎంఏ (DMA) యాప్‌ను డౌన్‌లోడ్ చేయించారు. వివిధ బ్యాంకు ఖాతాలకు (ఎస్ బ్యాంక్, ఓం సాయి ట్రేడర్స్ మొదలైనవి) విడతల వారీగా రూ.33 లక్షలు బదిలీ చేయించుకున్నారు. ఇండో ఎంఐఎం లిమిటెడ్ ఐపీవో షేర్ల పేరుతో మరికొంత డబ్బు కట్టాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో మోస‌పోయాన‌ని గుర్తించిన బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement