OnePlus N6x | 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వచ్చిన వన్‌ప్లస్ ఎన్6ఎక్స్ ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు అదిరాయి..
OnePlus N6x | వన్‌ప్లస్ భారత మార్కెట్లో తన ఎంట్రీ లెవల్ ఎన్ సిరీస్‌ను మరింత విస్తరిస్తూ కొత్త వన్‌ప్లస్ ఎన్6ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రోజువారీ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని భారీ బ్యాటరీ, దృఢమైన బిల్డ్ క్వాలిటీ, దీర్ఘకాలిక పనితీరు, సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్‌లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది.
Technology | Published On Jul 31, 2026, 1.51 pm IST
OnePlus N6x | వన్‌ప్లస్ భారత మార్కెట్లో తన ఎంట్రీ లెవల్ ఎన్ సిరీస్‌ను మరింత విస్తరిస్తూ కొత్త వన్‌ప్లస్ ఎన్6ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రోజువారీ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని భారీ బ్యాటరీ, దృఢమైన బిల్డ్ క్వాలిటీ, దీర్ఘకాలిక పనితీరు, సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్‌లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ 7000 ఎంఏహెచ్ బ్యాటరీ కాగా, కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. సాధారణ వినియోగంలో ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 2.5 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది. వీడియో స్ట్రీమింగ్‌ను 20.56 గంటలు, మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను 133.56 గంటలు, సోషల్ మీడియా బ్రౌజింగ్‌ను 25.04 గంటలు, స్టాండ్‌బైను 759.13 గంటల వరకు అందిస్తుందని వన్‌ప్లస్ వెల్లడించింది.
భారీ బ్యాటరీ బ్యాకప్, స్పెషల్ ఫీచర్లు..
బ్యాటరీ కేవలం 1 శాతం మాత్రమే మిగిలి ఉన్నా అల్ట్రా పవర్ సేవింగ్ మోడ్ ద్వారా సుమారు 0.54 గంటల కాల్స్, 7.59 గంటల స్టాండ్‌బై, 0.22 గంటల నావిగేషన్ ఉపయోగించుకోవచ్చని తెలిపింది. బ్యాటరీ దీర్ఘకాలిక పనితీరుపై కూడా కంపెనీ ప్రత్యేక దృష్టి పెట్టింది. 1600 ఛార్జింగ్ సైకిళ్ల వరకు బ్యాటరీ సామర్థ్యాన్ని నిలబెట్టేలా రూపొందించామని, ఆరు సంవత్సరాల తర్వాత కూడా 80 శాతం కంటే ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం కొనసాగుతుందని పేర్కొంది. ఓవర్ ఛార్జింగ్, పడిపోవడం, ఒత్తిడి, అధిక లేదా తక్కువ ఉష్ణోగ్రతల నుంచి రక్షణ కల్పించే నాలుగు స్థాయిల భద్రతా వ్యవస్థను కూడా అందించింది. ఈ ఫోన్‌లో బైపాస్ ఛార్జింగ్, ఇతర పరికరాలకు 5 వాట్ రివర్స్ ఛార్జింగ్, అలాగే అడాప్టివ్ నైట్ ఛార్జింగ్ మోడ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. డిజైన్ పరంగా వన్‌ప్లస్ ఎన్6ఎక్స్ బర్గండీ రెడ్, ఐస్ బ్లూ రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. వెనుక భాగంలో నిలువుగా అమర్చిన కెమెరా మాడ్యూల్‌తో పాటు గుండ్రని అంచులతో ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది.
మిలిటరీ గ్రేడ్ నాణ్యతతో..
ఈ ఫోన్‌లో 6.8 ఇంచుల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. ఇది 120హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను, గరిష్ఠంగా 1200 నిట్స్ బ్రైట్‌నెస్‌ను ఇస్తుంది. కళ్ల రక్షణ కోసం ప్రత్యేక ఐ ప్రొటెక్షన్ మోడ్‌లను కూడా పొందుపరిచారు. ఆడియో కోసం పెద్ద అకౌస్టిక్ ఛాంబర్‌తో కూడిన స్పీకర్‌ను అందించడంతో 300 శాతం వరకు వాల్యూమ్ అవుట్‌పుట్ లభిస్తుందని కంపెనీ తెలిపింది. మన్నిక పరంగా ఈ ఫోన్‌కు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ లభించింది. తుప్పు, ఇసుక, దుమ్ము తుఫాన్లు, వరుసగా 25 సార్లు మార్బుల్‌పై పడినా తట్టుకునేలా పరీక్షలు నిర్వహించినట్లు కంపెనీ వెల్లడించింది. మైనస్ 40 డిగ్రీల నుంచి 85 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతల్లో పనిచేసే సామర్థ్యం ఉందని తెలిపింది. ఆర్మర్‌షెల్ డిజైన్, బలమైన అల్యూమినియం ఫ్రేమ్, రీన్‌ఫోర్స్‌డ్ కార్నర్లు, హార్డెండ్ గ్లాస్‌తోపాటు ఐపీ64 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కూడా ఉంది.

ప్రత్యేక కూలింగ్ సిస్టమ్..
ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6360 అపెక్స్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 16తో పనిచేస్తుంది. అధిక వినియోగ సమయంలో వేడిని తగ్గించేందుకు 5300 చదరపు మిల్లీమీటర్ల వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను అమర్చారు. ముఖ్యంగా 4జీబీ, 128జీబీ వేరియంట్‌కు 48 నెలల ఫ్లూయెన్సీ సర్టిఫికేషన్ లభించినట్లు కంపెనీ తెలిపింది. ఫొటోగ్రఫీ కోసం వెనుక భాగంలో 13 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా, ముందు భాగంలో 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాలను అందించారు. ఇందులో ఏఐ పోర్ట్రెయిట్ గ్లోతోపాటు తక్కువ వెలుతురులో కృత్రిమ లైటింగ్, రంగుల సవరణ వంటి ఏఐ ఆధారిత ఫొటో ఎడిటింగ్ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ 4జీబీ, 6జీబీ ర్యామ్, 64జీబీ, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తోంది. మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా 2టీబీ వరకు స్టోరేజ్ ను పెంచుకోవచ్చు. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, యూఎస్‌బీ టైప్ సి పోర్ట్, వైఫై 6, బ్లూటూత్ 5.4, డ్యుయల్ 5జి, డ్యూయల్ 4జి వీవోఎల్‌టీఈ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
ధర ఎంతంటే..
వన్‌ప్లస్ ఎన్6ఎక్స్ ఆగస్టు 4 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఓపెన్ సేల్‌లో అందుబాటులోకి రానుంది. వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్, వన్‌ప్లస్ స్టోర్ యాప్, అమెజాన్ ఇండియా, అలాగే వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్లు, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. 4జీబీ, 64జీబీ వేరియంట్ ధర రూ.18,999 ఉండగా, లాంచ్ ఆఫర్ల అనంతరం రూ.17,499కు కొనుగోలు చేయవచ్చు. 4జీబీ, 128జీబీ వేరియంట్ ధర రూ.20,999 ఉండగా, ఆఫర్ల తర్వాత రూ.19,499కు లభిస్తుంది. ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులు, ఈఎంఐ లావాదేవీలపై రూ.1500 వరకు తక్షణ తగ్గింపు, అలాగే ఆరు నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులోఉంది.
సంబంధిత వార్తలు

OnePlus | ఆక్సిజన్ ఓఎస్‌కు గుడ్‌బై.. వన్‌ప్లస్ ఫోన్లలో ఇక కలర్ఓఎస్, ఇండియా నుంచి ఎగ్జిట్ పై కూడా క్లారిటీ..
జులై 16, 2026

OnePlus N6 | 8000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన వన్‌ప్లస్ ఎన్6 ఫోన్.. అదిరిపోయే ఏఐ ఫీచర్లు..
జూన్ 30, 2026

OnePlus Nord CE6 Lite | భారీ బ్యాటరీ, అదిరిపోయే ఏఐ ఫీచర్లు.. వన్‌ప్లస్ నుంచి నార్డ్ సీఈ6 లైట్ ఫోన్..
మే 8, 2026
తాజావార్తలు
- ●Delhi Police | మా నాన్న యూనిఫామ్ రక్తంతో తడిసిపోయింది.. మాకూ న్యాయం చేయండి.. మీడియా ముందుకొచ్చిన గాయపడ్డ పోలీసు కుటుంబాలు
- ●Income Tax | రూ.50వేలకు పైగా విలువైన వస్తువును లేదా డబ్బును గిఫ్ట్‌గా అందుకున్నారా.. ఇలా చేస్తే పన్ను ఉండదు..
- ●Dasoju Sravan Kumar | బంకర్ బెడ్ల కుంభకోణంపై రేవంత్ ప్రభుత్వానికి నోటీసులు.. ‘పెద్ది’ పోరాట ఫలితమే
- ●Yellampalli Project | ఎల్లంపల్లికి పోటెత్తిన వరద.. 15 గేట్లు ఎత్తి నీటి విడుదల
- ●KTR | ఈ-కార్ రేసు కేసు.. నాంపల్లి కోర్టుకు హాజరైన కేటీఆర్.. విచారణ వాయిదా
- ●Rega Kanta Rao | పెండ్లి పేరుతో లైంగికంగా వేధించాడు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై కేసు నమోదు

Delhi Police | మా నాన్న యూనిఫామ్ రక్తంతో తడిసిపోయింది.. మాకూ న్యాయం చేయండి.. మీడియా ముందుకొచ్చిన గాయపడ్డ పోలీసు కుటుంబాలు

Income Tax | రూ.50వేలకు పైగా విలువైన వస్తువును లేదా డబ్బును గిఫ్ట్‌గా అందుకున్నారా.. ఇలా చేస్తే పన్ను ఉండదు..

Dasoju Sravan Kumar | బంకర్ బెడ్ల కుంభకోణంపై రేవంత్ ప్రభుత్వానికి నోటీసులు.. ‘పెద్ది’ పోరాట ఫలితమే

Yellampalli Project | ఎల్లంపల్లికి పోటెత్తిన వరద.. 15 గేట్లు ఎత్తి నీటి విడుదల



