త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Volcano Eruption | బ‌ద్ద‌లైన అగ్నిప‌ర్వ‌తం.. ఇద్ద‌రు మృతి.. అనేక మంది గ‌ల్లంతు

Volcano Eruption | ఇండోనేషియాలోని మౌంట్ డుకోనో ప‌ర్వ‌తం శుక్ర‌వారం ఉద‌యం బ‌ద్ద‌లైంది. 10 కిలోమీట‌ర్ల ఎత్తువ‌ర‌కూ బూడిద ఎగ‌సిప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు ప‌ర్వతారోహ‌కులు మృతి చెందారు.

D

International | Published On May 8, 2026, 3.59 pm IST

Volcano Eruption | బ‌ద్ద‌లైన అగ్నిప‌ర్వ‌తం.. ఇద్ద‌రు మృతి.. అనేక మంది గ‌ల్లంతు
Advertisement

Volcano Eruption | ఇండోనేషియా (Indonesia)లో అగ్నిపర్వ‌తం విస్ఫోట‌నం (Volcano Eruption) చెందింది. మ‌లుకు ప్రావిన్స్ (Maluku province)లో ఉన్న మౌంట్ డుకోనో (Mount Dukono) అగ్నిప‌ర్వ‌తం శుక్ర‌వారం ఉద‌యం 7:40 గంట‌ల స‌మ‌యంలో ఒక్క‌సారిగా బ‌ద్ద‌లైంది. దీంతో అగ్నిప‌ర్వ‌తం నుంచి 10 కిలోమీట‌ర్ల ఎత్తువ‌ర‌కూ బూడిద (VolcanicAsh) ఎగ‌సిప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు ప‌ర్వతారోహ‌కులు మృతి చెందారు.

అగ్నిప‌ర్వ‌తం బ‌ద్ద‌లైన స‌మ‌యంలో అక్క‌డ సుమారు 20 మంది ప‌ర్వ‌తారోహ‌కులు ఉన్న‌ట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఇందులో తొమ్మిది మంది సింగ‌పూర్‌కు చెందిన వార‌ని పేర్కొన్నారు. ఏడుగురిని సుర‌క్షితంగా కింద‌కు తీసుకొచ్చిన‌ట్లు చెప్పారు. ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయార‌ని.. వారు సింగ‌పూర్‌కు చెందిన వార‌ని తెలిపారు. మిగ‌తా వారికోసం గాలింపు చేప‌డుతున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.

కాగా, ఈ అగ్నిప‌ర్వ‌తం మార్చి 29నుంచి క్రియాశీల‌కంగా ఉన్న‌ట్లు అక్క‌డి అధికారులు తెలిపారు. ఎప్పుడైనా విస్ఫోట‌నం చెందే అవ‌కాశం ఉంద‌ని ముందే హెచ్చ‌రిక‌లు జారీ చేసిన‌ట్లు చెప్పారు. అయినా, త‌మ హెచ్చ‌రిక‌ల‌ను ప‌ట్టించుకోకుండా కొంద‌రు పర్వ‌తారోహ‌కులు అక్క‌డికి వెళ్లిన‌ట్లు తెలిపారు. మ‌రోవైపు ఈ అగ్నిప‌ర్వ‌తం బ‌ద్ద‌ల‌వ‌డంతో ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా స‌మీప గ్రామాల ప్ర‌జ‌ల‌ను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.

Also Read..

కాంగ్రెస్ ఎంపీల ప‌క్క‌న కూర్చోం.. ఓం బిర్లాకు డీఎంకే లేఖ‌

రాహుల్‌ను ఏమ‌న్నా నీ సంగ‌తి చూస్తా: కేటీఆర్‌కు ఎంపీ బ‌ల‌రాం నాయ‌క్ వార్నింగ్‌

రాష్ట్రంలో ప్ర‌మాద‌క‌ర స్థాయికి శాంతిభద్రతలు.. ఆందోళ‌న వ్య‌క్తం చేసిన కేటీఆర్‌

Advertisement
Advertisement