Prajogo Pangestu | ఒక్క రోజులోనే రూ.82వేల కోట్లు పోగొట్టుకున్నాడు.. అసలేం జరిగింది..?
Prajogo Pangestu | ఇండోనేషియా స్టాక్ మార్కెట్లలో ఒక్కసారిగా కలకలం రేగింది. గ్లోబల్ ఇండెక్స్ ప్రొవైడర్ ఎంఎస్‌సీఐ (MSCI) ఇండోనేషియా కంపెనీల విలువల నిర్ణయంలో పారదర్శకతపై సందేహాలు వ్యక్తం చేయడంతో, భారీగా అమ్మకాలు చోటుచేసుకున్నాయి.
International | Published On Jan 30, 2026, 8.26 am IST
Prajogo Pangestu | ఇండోనేషియా స్టాక్ మార్కెట్లలో ఒక్కసారిగా కలకలం రేగింది. గ్లోబల్ ఇండెక్స్ ప్రొవైడర్ ఎంఎస్‌సీఐ (MSCI) ఇండోనేషియా కంపెనీల విలువల నిర్ణయంలో పారదర్శకతపై సందేహాలు వ్యక్తం చేయడంతో, భారీగా అమ్మకాలు చోటుచేసుకున్నాయి. దీని ప్రభావంతో దేశంలోని అగ్రశ్రేణి వ్యాపార దిగ్గజాల సంపద కలిపి సుమారు 22 బిలియన్ డాలర్లు ఆవిరైందని బ్లూమ్‌బర్గ్ తెలిపింది. ఈ పతనంలో అత్యధిక నష్టం ఎదుర్కొన్న వ్యక్తిగా, ఇండోనేషియాలోనే అత్యంత ధనవంతుడు ప్రజోగో పాంగెస్టు నిలిచారు. ఆయన సంపద ఒక్కసారిగా దాదాపు 9 బిలియన్ డాలర్లు (సుమారుగా రూ.82,782 కోట్లు) తగ్గింది. ప్రస్తుతం ఆయన నికర ఆస్తి విలువ సుమారు 31 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపింది. ఈ ఏడాది మొత్తంగా చూస్తే ప్రజోగో సంపద ఇప్పటికే దాదాపు 15 బిలియన్ డాలర్లు తగ్గినట్లుగా అంచనా వేస్తున్నారు.
అన్ని వర్గాలతో చర్చలు: ప్రజోగో కుటుంబం
ప్రజోగోకు చెందిన ఎనర్జీ సంస్థ బారిటో పసిఫిక్‌లో ఆయనకు 71 శాతం వాటా ఉండగా, బొగ్గు-బంగారం గనుల సంస్థ పెట్రిండో జయ క్రియాసీలో 84 శాతం వాటా ఉంది. ఈ రెండు కంపెనీల షేర్లు ఒక్క రోజులోనే 12 శాతానికి పైగా పడిపోవడం గమనార్హం. ఈ పరిణామాలపై స్పందించిన ప్రజోగో కుటుంబ కార్యాలయం, ఎంఎస్‌సీఐ నివేదికను సమీక్షిస్తున్నామని, సంబంధిత అన్ని వర్గాలతో చర్చలు కొనసాగిస్తామని తెలిపింది. ఇండోనేషియాలో షేర్ హోల్డింగ్ వివరాల వెల్లడిపై ఉన్న నిబంధనలపై ఎంఎస్‌సీఐ ప్రశ్నలు లేవనెత్తడమే ఈ అమ్మకాలకి కారణమైంది. ఈ నిబంధనల వల్ల యాజమాన్య నిర్మాణం స్పష్టంగా ఉండకపోవచ్చని, తద్వారా అనుచిత ట్రేడింగ్ ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందని పెట్టుబడిదారులు భావిస్తున్నట్లు ఎంఎస్‌సీఐ తన నివేదికలో పేర్కొంది.
భారీగా నష్టపోయిన జకార్తా కాంపోజిట్..
అలాగే, కొద్దిమంది లేదా ఒక్క వ్యక్తి చేతుల్లోనే ఎక్కువ షేర్లు ఉండే కంపెనీలపై దీర్ఘకాలిక ఆందోళనలు ఉన్నాయని ఎంఎస్‌సీఐ స్పష్టం చేసింది. ఇలాంటి కేంద్రీకృత యాజమాన్య నిర్మాణాలే ఇండోనేషియాతో పాటు ఆసియా ప్రాంతాల్లోని అనేక పెద్ద సంపదలకు ఆధారంగా ఉన్నాయని పేర్కొంది. ఎంఎస్‌సీఐ తన నివేదికలో కొన్ని ప్రతిపాదిత ఇండెక్స్ మార్పులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మే నెలలోపు ఈ సమస్యలను పరిష్కరించకపోతే మరిన్ని చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ హెచ్చరిక పెట్టుబడిదారులను కలవరపెట్టింది. దీంతో ఇండోనేషియాలో ప్రధాన స్టాక్ సూచీ జకార్తా కాంపోజిట్ బుధవారం 7 శాతం కంటే ఎక్కువగా పడిపోగా, గురువారం 10 శాతం వరకు క్షీణించింది.
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



