Earthquake | ఇండోనేషియాను కుదిపేసిన అత్యంత శక్తిమంతమైన భూకంపం.. ఒకరు మృతి
Earthquake | ఇండోనేషియాని (Indonesia) అత్యంత శక్తిమంతమైన భూకంపం (Earthquake) కుదిపేసింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 7.6గా నమోదైంది.
International | Published On Apr 2, 2026, 10.56 am IST
Earthquake | ఇండోనేషియాని (Indonesia) అత్యంత శక్తిమంతమైన భూకంపం (Earthquake) కుదిపేసింది. ఇండోనేషియా తూర్పు ప్రాంతంలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 7.6గా నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం 7:48 గంటలకు భూకంపం సంభవించింది. టెర్నెట్ ద్వీపానికి 127 కిలోమీటర్ల దూరంలో మొలుక్కా సముద్రంలో (Molucca Sea) భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.
ఈ భూకంపం ధాటికి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. బిటుంగ్, టెర్నేట్ నగరాల్లో కొన్ని సెకన్లపాటూ భూమి కంపించింది. ఈ భూకంపం ధాటికి 75 సెం.మీ. ఎత్తు వరకు అలలు ఎగిసిపడ్డాయి. ఈ మేరకు అధికారులు సునామీ (tsunami) హెచ్చరికలు జారీ చేశారు. భూకంప కేంద్రానికి 1,000 కిలోమీటర్ల పరిధిలో ప్రమాదకర సునామీ అలలు ఎగసిపడే అవకాశం ఉందని యూఎస్ పర్యవేక్షణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. ఈ ప్రకంపనలతో ప్రజలు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇండ్ల నుంచి బయటకి పరుగులు తీశారు.
Also Read..
అది నా పూర్వజన్మ సుకృతం.. ప్రత్యేక వీడియో షేర్ చేసిన చిరంజీవి
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






