Social Media | 16 ఏండ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై ఇండోనేషియా ఆంక్షలు
Social Media | మరో దేశం సోషల్ మీడియా వినియోగంపై (Social Media) ఆంక్షలు విధించింది. 16 ఏండ్లలోపు పిల్లలు సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా ఇండోనేషియా (Indonesia) కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది.
International | Published On Mar 29, 2026, 7.19 am IST
Social Media | త్రినేత్ర.న్యూస్: మరో దేశం సోషల్ మీడియా వినియోగంపై (Social Media) ఆంక్షలు విధించింది. 16 ఏండ్లలోపు పిల్లలు సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా ఇండోనేషియా (Indonesia) కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. యూట్యూబ్, టిక్‌టాక్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్రెండ్స్, ఎక్స్, బిగో లైవ్, రోబ్లోక్స్ వంటి సామాజిక మాధ్యమాల్లో చిన్నారులు అకౌంట్లను తెరిచేందుకు వీలులేదంటూ కఠిన ఆంక్షలు విధించింది. దీంతో ఆగ్నేయాసియాలో చిన్నారుల సామాజిక మాధ్యమాల వినియోగంపై ఆంక్షలు తీసుకువచ్చిన మొదటి దేశంగా ఇండోనేసియా నిలిచింది. గతేడాది ఆస్ట్రేలియా ఇదే తరహా నిబంధలను తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

పిల్లలను సైబర్ ముప్పు నుంచి రక్షించేందుకు, ఆన్‌లైన్‌లో అనుచిత కంటెంట్, సైబర్ వేధింపులు, ఆన్‌లైన్ స్కామ్‌లు, వంటి సమస్యలను తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమ్మూనికేషన్, డిజిటల్ వ్యవహారాల మంత్రి ముత్య హఫీద్ (Meutya Hafid) తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ఈ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని, ఉల్లంఘించే కంపెనీలపై భారీ జరిమానాలు లేదా సేవలను నిలిపి వేయాల్సి వస్తుందని హెచ్చరించారు. దేశంలోని 2.8 కోట్ల జనాభాలోని 70 లక్షల మంది చిన్నారులను సోషల్ మీడియా వ్యసనం వల్ల కలిగే ఒత్తిడి, ఆందోళనల నుంచి రక్షించడమే ప్రధాన లక్ష్యని చెప్పారు.
భారత్‌లో కూడా సోషల్ మీడియాపై నిషేధాన్ని విధించేందుకు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కర్ణాటకలో 16 ఏండ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించబోతున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించిన విషయం తెలిసిందే.
సంబంధిత వార్తలు

MK Stalin | పేరు ప్రస్తావించకుండానే.. విజయ్‌పై విమర్శల దాడిని ప్రారంభించిన స్టాలిన్..!
మే 18, 2026

X | ఫ్రీ యూజర్లకు షాకిచ్చిన ఎక్స్.. పోస్టులపై లిమిట్స్ విధింపు..
మే 18, 2026

Bandi Bhageerath | అందరిలాగే నా కూతురికీ రక్షణ, గౌరవం పొందే అర్హత ఉంది.. బండి భగీరథ్ బాధితురాలి తల్లి
మే 15, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



