త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG High Court | భార్య వంట చేయ‌లేద‌ని విడాకులు మంజూరు చేయ‌లేం.. హైకోర్టు కీలక వ్యాఖ్య‌

TG High Court | త్రినేత్ర‌.న్యూస్‌: భార్య వంట చేయ‌లేద‌ని, ఇంటిప‌నుల్లో అత్త‌కు స‌హ‌క‌రించ‌డం లేద‌ని విడాకులు మంజూరు చేయ‌లేమ‌ని తెలంగాణ హైకోర్టు (TG High Court) స్ప‌ష్టం చేసింది. భార్య వంట చేయ‌లేద‌ని చెప్పి భ‌ర్త విడాకులు (Divorce) కోరడాన్ని తీవ్రంగా త‌ప్పుబ‌ట్టింది. త‌న త‌ల్లికి ఇంటిప‌నుల్లో స‌హ‌క‌రించ‌నందుకు ఆమె క్రూర‌త్వానికి పాల్ప‌డింద‌ని ప‌రిగ‌ణించ‌లేమ‌ని పేర్కొంది.

A

Hyderabad | Published On Jan 7, 2026, 2.02 pm IST

TG High Court | భార్య వంట చేయ‌లేద‌ని విడాకులు మంజూరు చేయ‌లేం.. హైకోర్టు కీలక వ్యాఖ్య‌
Advertisement

TG High Court | త్రినేత్ర‌.న్యూస్‌: భార్య వంట చేయ‌లేద‌ని, ఇంటిప‌నుల్లో అత్త‌కు స‌హ‌క‌రించ‌డం లేద‌ని విడాకులు మంజూరు చేయ‌లేమ‌ని తెలంగాణ హైకోర్టు (TG High Court) స్ప‌ష్టం చేసింది. భార్య వంట చేయ‌లేద‌ని చెప్పి భ‌ర్త విడాకులు (Divorce) కోరడాన్ని తీవ్రంగా త‌ప్పుబ‌ట్టింది. త‌న త‌ల్లికి ఇంటిప‌నుల్లో స‌హ‌క‌రించ‌నందుకు ఆమె క్రూర‌త్వానికి పాల్ప‌డింద‌ని ప‌రిగ‌ణించ‌లేమ‌ని పేర్కొంది. ఈ కార‌ణాల‌తో విడాకుల కోసం భ‌ర్త మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిని విచారించిన జిల్లా కోర్టు విడాకుల పిటిష‌న్‌ను తోసిపుచ్చింది. దీంతో భ‌ర్త హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ పిటిష‌న్‌ను జ‌స్టిస్ మౌషుమి భ‌ట్టాచార్య‌, జ‌స్టిస్ న‌గేశ్ భీమ‌పాక‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టి, అప్పీల్‌ను కొట్టివేసింది.

ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని, మ‌రో ప్రైవేట్ ఉద్యోగి 2015లో వివాహం చేసుకున్నారు. ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో ఆమెకు 2017లో గ‌ర్భ‌స్రావ‌మైంది. ఆ త‌రువాత కుటుంబ క‌ల‌హాల‌తో అక్టోబ‌ర్ 2018 నుంచి వేర్వేరుగా నివ‌సిస్తున్నారు. దీంతో భ‌ర్త విడాకులు కోరుతూ న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించారు.

భార్య ఉద‌యం తొమ్మిది గంట‌ల నుంచి ఆరు గంట‌ల వ‌ర‌కు త‌న ఉద్యోగ బాధ్య‌త‌ల కార‌ణంగా వంట చేసేందుకు ఆస్కారం ఉండ‌క‌పోవ‌చ్చ‌ని అభిప్రాయ‌ప‌డింది. దానిని క్రూర‌త్వంగా భావించ‌లేమ‌ని పేర్కొంది. త‌న భార్య త‌రుచూ పుట్టింటికి వెళ్తోంద‌ని, త‌న‌తో క‌లిసి ఉండ‌డం లేద‌ని పేర్కొన్న భ‌ర్త‌ను ప్ర‌శ్నించ‌గా తాము క‌లిసి ఉన్న‌ది అయిదు నెల‌ల‌ని ఒక‌సారి, మూడు నెల‌ల‌ని ఒక‌సారి భిన్న వాంగ్మూలాలు ఇచ్చార‌ని ధ‌ర్మాస‌నం గుర్తు చేసింది. గ‌ర్భ‌స్రావం అవ‌డంతో త‌న త‌ల్లిదండ్రుల‌తో ఉండ‌డాన్ని కూడా క్రూర‌త్వంగా ప‌రిగ‌ణించ‌లేమ‌ని స్ప‌ష్టం చేసింది.

Advertisement

తాజావార్తలు

Advertisement