Home Guard | మేడారం జాతరలో పరిచయం.. ముగ్గురు పిల్లలున్న హోంగార్డును పెండ్లి చేసుకున్న యువతి
Home Guard | అతడు ట్రాఫిక్ హోంగార్డు (Home Guard) . హైదరాబాద్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల జరిగిన మేడారం జాతరలో (Medaram Jatara) అతనికి విధులు కేటాయించారు.
Home Guard | త్రినేత్ర.న్యూస్: అతడు ట్రాఫిక్ హోంగార్డు (Home Guard) . హైదరాబాద్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల జరిగిన మేడారం జాతరలో (Medaram Jatara) అతనికి విధులు కేటాయించారు. దీంతో అక్కడ ఓ ట్రాఫిక్ బూత్‌లో డ్యూటీ చేస్తున్నాడు. జాతరకు వచ్చిన యువతి.. తన తల్లదండ్రులు కనిపించడం లేదంటూ అతని వద్దకు వచ్చింది. దీంతో గంటలోనే వారిని వెతికిపెట్టాడు. ఈ సందర్భంగా వారికి ఏర్పడిన పరిచయడం.. కొన్ని రోజుల్లోనే ఆ పరిచయం కాస్తా ప్రేమక దారితీసింది. ముగ్గురు పిల్లలున్న ఆ హోంగార్డుని పెండ్లి చేసుకుంది. ఇందుకేనేమో ప్రేమ గుడ్డిది అని అంటారేమో..!
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకులం జిల్లాకు చెందిన పొంగూరు వాసుదేవరావు (38) హైదరాబాద్‌లోని అబిడ్స్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పని చేస్తున్నాడు. ఆయనకు ఇదివరకే వివాహమై ఇద్దరు కూతుళ్లు సహా ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇటీవల అతని భార్య.. ఇద్దరు కూతుళ్లను తీసుకొని తన స్వగ్రామానికి వెళ్లింది. ఏడేండ్ల కొడుకుతో వాసుదేవరావు జగద్గిరిగుట్టలో కిరాయికి ఉంటూ విధులకు హాజరవుతున్నాడు.
ఈక్రమంలో జనవరిలో జరిగిన మేడారం జాతరకు విధులపై వెళ్లాడు. అక్కడ ఇంటర్ పూర్తిచేసుకున్న ఓ యువతి (25) తన తల్లి కనిపించడం లేదంటూ వాసుదేవరావు కూర్చున్న ట్రాఫిక్ బూత్‌ను ఆశ్రయించింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరగగా గంట వ్యవధిలోనే ఆమె తల్లిని కనుగొని అప్పగించాడు. ఆ పరిచయం కాస్తా వారిద్దరిమధ్య ప్రేమకు దారి తీసింది. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత తరచూ ఇద్దరూ కలుసుకునే వారు. గత నెల అమీర్‌పేట్‌లోని కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో ఇద్దరూ పెండ్లి చేసుకున్నారు. అయితే తరచూ తన కూతురు బయటికి వెళ్తుండటాన్ని గమనించిన యువతి తండ్రి.. ఆరా తీయగా వాసుదేవరావును పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో తమకు రక్షణ కావాలంటూ తాను వివాహం చేసుకున్న యువతిని తీసుకొని వాసుదేవరావు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తు అనంతరం యువతి మేజర్ కావడంతో హోంగార్డుతో పంపించారు. రెండో పెండ్లి విషయం వాసుదేవరావు మొదటి భార్యకు తెలియకపోవడం గమనార్హం.
ఇవికూడా చదవండి..
యుద్ధం ఎఫెక్ట్!.. భారీగా పెరిగిన వంట గ్యాస్ ధరలు..
పూరీ జగన్నాథుడి సేవలో నాగచైతన్య, శోభిత జంట
మహబూబ్‌నగర్, భద్రాచలంలో 40 డిగ్రీల ఎండ.. నేడు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
సంబంధిత వార్తలు

Karnataka High court | ప్రేమ వివాహంలో కట్నం కోసం వేధింపులా? నమ్మశక్యంగా లేదు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు బెయిల్
జులై 17, 2026

ASI | పోలీస్ వాహనం ఢీకొని ఏఎస్ఐ మృతి.. కక్షతోనే హోంగార్డు చంపాడంటున్న కుటుంబం!
ఏప్రిల్ 14, 2026

Medaram | మేడారం గద్దెల వద్ద జారిపడిన రాతిశిల.. బాలుడికి తీవ్ర గాయాలు
మార్చి 26, 2026
తాజావార్తలు
- ●Harish Rao | హరీశ్‌రావుపై ఓయూ పీఎస్‌లో ఫిర్యాదు
- ●H-FAST | బట్టలకు వేసే రంగులతో మసాలాల తయారీ
- ●Snake bites | రెండు నిమిషాల్లో ఐదుసార్లు కాటేసిన పాము.. మహిళను కాపాడిన 35 ఇంజక్షన్లు
- ●USPC | ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యలపై దశలవారీ పోరాటం
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు బ్రేక్.. 4 రోజుల ర్యాలీకి తెర, ఆర్బీఐ నిర్ణయంపై ఉత్కంఠ..
- ●RTC Employees | రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పించండి

Harish Rao | హరీశ్‌రావుపై ఓయూ పీఎస్‌లో ఫిర్యాదు

H-FAST | బట్టలకు వేసే రంగులతో మసాలాల తయారీ

Snake bites | రెండు నిమిషాల్లో ఐదుసార్లు కాటేసిన పాము.. మహిళను కాపాడిన 35 ఇంజక్షన్లు

USPC | ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యలపై దశలవారీ పోరాటం



