త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డ మీర్‌చౌక్ ఇన్‌స్పెక్ట‌ర్‌

ACB | హైదరాబాద్ పాతబస్తీలోని మీర్‌చౌక్ (Mirchowk) పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్ట‌ర్ ఏసీబీ (ACB) అధికారుల‌కు ప‌ట్టుబ‌డ్డారు. ఓ కేసును మూసివేయ‌డానికి రూ.3 లంచం తీసుకుంటుండ‌గా ఏసీబీ అధికారుల‌కు రెడ్‌హ్యాండెగా ప‌ట్టుకున్నారు.

G

Hyderabad | Published On Oct 28, 2026, 6.26 am IST

ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డ మీర్‌చౌక్ ఇన్‌స్పెక్ట‌ర్‌
Advertisement

ACB | హైద‌రాబాద్‌: హైదరాబాద్ పాతబస్తీలోని మీర్‌చౌక్ (Mirchowk) పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్ట‌ర్ ఏసీబీ (ACB) అధికారుల‌కు ప‌ట్టుబ‌డ్డారు. ఓ కేసును మూసివేయ‌డానికి రూ.3 లంచం తీసుకుంటుండ‌గా ఏసీబీ అధికారుల‌కు రెడ్‌హ్యాండెగా ప‌ట్టుకున్నారు. ఆయ‌న‌తోపాటు ఓ కానిస్టేబుల్‌ను కూడా అరెస్టు చేశారు.

పాత‌బ‌స్తీలో ఓ స్థ‌లానికి సంబంధించిన సివిల్ వివాదంలో నమోదైన కేసును క్లోజ్ చేయడానికి, భవిష్యత్తులో వేధింపులు లేకుండా చూసేందుకు ఇన్‌స్పెక్టర్ కొండల్‌రావు (CI Kondal Rao) రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. అయితే బాదితుడు రూ.6 ల‌క్ష‌లు ఇచ్చేందుకు బేరం కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా తొలి విడతగా రూ.3 లక్షలు చెల్లించాల‌ని ఆదేశించారు. సీఐ వేధింపులు భ‌రించ‌లేక బాధితులు ఏసీబీని ఆశ్ర‌యించారు. దీంతో ముంద‌స్తు వ్యూహం ప్ర‌కారం హోంగార్డు ఆబిద్ అలీ రూ.3 ల‌క్ష‌లు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. లంచం సొమ్మును హోంగార్డు నుంచి స్వాధీనం చేసుకున్నారు. సీఐ (Mirchowk Inspector) ఆదేశాల‌తోనే ఆ డ‌బ్బును తీసుకున్న‌ట్లు కానిస్టేబుల్ తెలిపారు. దీంతో ఇన్‌స్పెక్టర్ ఎం. కొండల్‌రావు, హోంగార్డు ఆబిద్ అలీలిద్దరినీ అరెస్ట్ చేశారు. నిందితులను నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించనున్నారు.

Advertisement
Advertisement