త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Uttam Kumar Reddy | మంత్రి ఉత్త‌మ్ కుమార్‌ను క‌లిసిన‌ వ్య‌వ‌సాయ‌, రైతు సంక్షేమ క‌మిష‌న్.. స‌మ‌గ్ర‌ నివేదిక అంద‌జేత‌

Uttam Kumar Reddy | ఇరిగేష‌న్ శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)ని తెలంగాణ వ్య‌వ‌సాయ‌, రైతు సంక్షేమ క‌మిష‌న్ క‌లిసింది.

D

Hyderabad | Published On Apr 24, 2026, 4.33 pm IST

Uttam Kumar Reddy | మంత్రి ఉత్త‌మ్ కుమార్‌ను క‌లిసిన‌ వ్య‌వ‌సాయ‌, రైతు సంక్షేమ క‌మిష‌న్.. స‌మ‌గ్ర‌ నివేదిక అంద‌జేత‌
Advertisement

Uttam Kumar Reddy | ఇరిగేష‌న్ శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)ని తెలంగాణ వ్య‌వ‌సాయ‌, రైతు సంక్షేమ క‌మిష‌న్ క‌లిసింది. ఈ సంద‌ర్భంగా క‌మిష‌న్ ఆధ్వర్యంలో చిన్నపాటి సాగునీటి వనరుల పునర్వ్యవస్థీకరణ (Minor Irrigation Systems Reorganisation), చెరువుల పరిరక్షణ కమిటీల ఏర్పాటు, చెరువుల మట్టి తొలగింపు (Desilting) అంశాలపై రూపొందించిన సమగ్ర నోట్‌ను మంత్రికి అంద‌జేసింది.

ఈ సంద‌ర్భంగా క‌మిష‌న్ చైర్మ‌న్ కోదండ‌రెడ్డి నాయ‌క‌త్వంలో సాగునీటి శాఖ‌, వ్య‌వ‌సాయ శాఖ అధికారులు, WALAMTARI ప్రతినిధులు, నిపుణుల‌తో ప‌లు స‌మావేశాలు నిర్వహించారు. ఈ స‌మావేశాల్లో చెరువుల ప‌రిర‌క్ష‌ణ‌కు స్థిర‌మైన వ్య‌వ‌స్థ, నీటి నిల్వ సామ‌ర్థ్యాన్ని పెంచేందుకు డిసిల్డింగ్ ప్రాముఖ్య‌త వంటి అంశాల‌పై స‌వివ‌రంగా చ‌ర్చించారు. స‌మావేశాల్లో జ‌రిగిన చ‌ర్చ‌ల ఆధారంగా చెరువుల ప‌రిర‌క్ష‌ణ క‌మిటీల ఏర్పాటు, డిసిల్టింగ్ కార్య‌క్ర‌మాల అమ‌లుకు సంబంధించిన స‌మ‌గ్ర నివేదిక‌ను క‌మిష‌న్ రూపొందించి మంత్రికి స‌మ‌ర్పించింది. దీనిపై త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది. చెరువుల పరిరక్షణ, సమర్థవంతమైన నీటి వినియోగం ద్వారా రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించడమే లక్ష్యంగా ప్రభుత్వం కట్టుబడి ఉందని కమిషన్ పేర్కొంది. ఈ కార్య‌క్ర‌మంలో క‌మిష‌న్ స‌భ్యులు కేవీ న‌ర్సింహ‌రెడ్డి, భ‌వాని మ‌రికంటి, గ‌డురు గంగాధ‌ర్‌, సునీల్‌, రాంరెడ్డి గోపాల్ రెడ్డి, మెంబ‌ర్ సెక్ర‌ట‌రీ గోపాల్‌, సంబంధిత శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

Also Read..

శంక‌ర్‌గౌడ్ కుటుంబానికి ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌.. ఒక‌రికి ఉద్యోగం, రూ.10 ల‌క్ష‌ల సాయం

అల్లు అర్జున్ పుష్ప 2 లాభాల‌పై బాలీవుడ్ క్రిటిక్ షాకింగ్ పోస్ట్

కొత్త బీటెక్ కోర్సులు.. ఎంట్రెన్స్ టెస్టు ద్వారానే సీట్ల భ‌ర్తీ.. వివ‌రాలివే..!

Advertisement
Advertisement