త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Allu Arjun Pushpa 2 | అల్లు అర్జున్ పుష్ప 2 లాభాల‌పై బాలీవుడ్ క్రిటిక్ షాకింగ్ పోస్ట్

అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ లాభాల‌పై బాలీవుడ్ క్రిటిక్ క‌మ‌ల్ ఆర్ ఖాన్ శుక్ర‌వారం చేసిన ట్వీట్ వైర‌ల్ అవుతోంది. పుష్ప 2 1800 కోట్లు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టినా నిర్మాత‌ల‌కు వ‌చ్చిన లాభాలు మాత్రం ఇర‌వై కోట్లు మాత్ర‌మేన‌ని కేఆర్‌కే అన్నారు.

N

Entertainment | Published On Apr 24, 2026, 4.20 pm IST

Allu Arjun Pushpa 2 | అల్లు అర్జున్ పుష్ప 2 లాభాల‌పై బాలీవుడ్ క్రిటిక్ షాకింగ్ పోస్ట్
Advertisement

Allu Arjun Pushpa 2 |  అల్లు అర్జున్ హీరోగా న‌టించిన పుష్ప 2 టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. 1800 కోట్ల క‌లెక్ష‌న్స్‌తో అద‌ర‌గొట్టింది. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న సెకండ్ మూవీగా నిలిచింది. హిందీలో స్ట్రెయిట్ సినిమాల‌కు ధీటుగా పుష్ప 2 సినిమాకు ఆడియెన్స్ బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఏకంగా 850 కోట్ల క‌లెక్ష‌న్స్‌తో కుమ్మేసింది. పుష్ప 2 బ్లాక్‌బ‌స్ట‌ర్‌తో పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో అల్లు అర్జున్ పేరు మారుమోగింది. ఈ సినిమాతో నార్త్‌లో బ‌న్నీ క్రేజ్‌, స్టార్‌డ‌మ్ పెరిగాయి. పుష్ప రాజ్ పాత్ర‌లో బ‌న్నీ మ్యాన‌రిజ‌మ్స్‌, డైలాగ్స్‌తో పాటు అత‌డిపై చిత్రీక‌రించిన యాక్ష‌న్ ఎపిసోడ్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి.

ఐదు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌...

పుష్ప 2 సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించింది. ఐదు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించిన‌ ఈ సినిమా నిర్మాత‌ల‌కు మూడింత‌ల లాభాల‌ను తెచ్చిపెట్టిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. ఈ సినిమాతో వెయ్యి కోట్లకుపైనే నిర్మాత‌ల‌కు మిగిలిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు పేర్కొన్నాయి.

లాభాల్లో వాటా...

పుష్ప 2 సినిమాను అల్లు అర్జున్ కూడా ప్రాఫిట్ షేరింగ్ బేసిస్‌లో చేశార‌ట‌. సినిమా బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిల‌వ‌డంతో అల్లు అర్జున్‌కు కూడా ఈ సినిమాతో ఐదు వంద‌ల కోట్ల‌కుపైనే రెమ్యూన‌రేష‌న్ ద‌క్కిన‌ట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపించింది.

షాకింగ్ ట్వీట్‌...

కాగా పుష్ప 2 లాభాల‌పై బాలీవుడ్ క్రిటిక్ క‌మ‌ల్ ఆర్ ఖాన్ శుక్ర‌వారం ఓ షాకింగ్ ట్వీట్ చేశారు. పుష్ప 2 సినిమాతో నిర్మాత‌ల‌కు ద‌క్కిన లాభాలు కేవ‌లం ఇర‌వై కోట్లేన‌ని త‌న ట్వీట్‌లో కేఆర్‌కే పేర్కొన్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ కంటే పుష్ప 2 సినిమాను హిందీలో రిలీజ్ చేసిన భూష‌ణ్ కుమార్‌కు ఎక్కువ ప్రాఫిట్స్‌ వ‌చ్చాయ‌ని, ఆయ‌నకు ఈ సినిమాతో అర‌వై కోట్ల‌కుపైనే మిగిలాయ‌ని కేఆర్‌కే ట్వీట్ చేశారు. పుష్ప 2తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌కు భారీగా డ‌బ్బులు వ‌చ్చాయంటూ జ‌రుగుతోన్న ప్ర‌చారంలో నిజం లేద‌ని అన్నారు.
ప్ర‌భాస్ ఫౌజీ కూడా మైత్రీ నిర్మాత‌ల‌కు 200 కోట్ల‌కుపైనే న‌ష్టాలు మిగిల్చే అవ‌కాశం ఉంద‌ని, ఈ సినిమా షూటింగ్ ఎండింగ్‌కు చేరుకున్న ఓటీటీ డీల్ మాత్రం ఇప్ప‌టికీ క్లోజ్ కాలేద‌ని క‌మ‌ల్ ఆర్ ఖాన్ ఈ ట్వీట్‌లో పేర్కొన్నారు. కేఆర్‌కే ట్వీట్ బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌భాస్ రాజాసాబ్ న‌ష్టాల‌తో పాటు య‌శ్ టాక్సిక్ ఓటీటీ డీల్‌పై కూడా శుక్ర‌వారం సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టాడు క‌మ‌ల్ ఆర్ ఖాన్‌.

Advertisement
Advertisement