Minister Uttam Kumar Reddy | పాలమూరు ప్రాజెక్టులకు ప్రాధాన్యం : మంత్రి ఉత్తమ్
Minister Uttam Kumar Reddy | ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. దేవాదుల, ఎస్ఎల్‌బీసీ, సీతారమా ప్రాజెక్టులతో సరి సమానంగా పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి సమృద్ధిగా సాగు నీరు, తాగునీరు అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని చెప్పారు.
Minister Uttam Kumar Reddy | ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. దేవాదుల, ఎస్ఎల్‌బీసీ, సీతారమా ప్రాజెక్టులతో సరి సమానంగా పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి సమృద్ధిగా సాగు నీరు, తాగునీరు అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సహచర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరిలతో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టుల నిర్మాణాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. సమీక్ష సమావేశంలో ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, మధుసూదన్ రెడ్డి, మేఘారెడ్డి, రాకేశ్ రెడ్డి, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకరయ్య, బండ్లకృష్ణమోహన్ రెడ్డి నీటిపారుదలశాఖ ప్రధాన కార్యదర్శి శ్రీధర్, జాయింట్ సెక్రటరీ కే శ్రీనివాస్, ఈఎన్సీ రమేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పాలమూరు జిల్లాకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. మరో పదిహేను రోజుల్లో ప్రత్యేక సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి పనుల వేగవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై పునఃసమీక్షా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. అందుకు ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రాజెక్టుల పనుల పురోగతిపై సమగ్రమైన నివేదికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పెద్ద ఎత్తున మట్టి పేరుకపోయి నీటి సామర్ధ్యం నిలువ 8 టీఎంసీల దిగువకు పడిపోయిన జూరాల ప్రాజెక్టును ప్రస్తావిస్తూ పూడిక తీసి నీటి సామర్ధ్యాన్ని పెంపొందించేందుకు వీలుగా డీఆర్ఐ (Dam Rehabilition and improvement project)కు ప్రతిపాదనలు పంపించినట్లు ఆయన తెలిపారు. డీఆర్ఐపీ కింద చేపట్టనున్న పూడిక తీత పనులతో నీటి సామర్ధ్యం నిలువలు గణనీయంగా పెరగడమే కాకుండా రిజర్వాయర్ భద్రత, నిర్వహణ మరింత మెరుగుపరుస్తామన్నారు.
చిన్న తరహా సాగునీటి చెరువులలో వర్షా కాలానికి ముందే పూడిక తీత పనులు చేపట్టాలన్నారు. ప్రధానంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు 90శాతం పూర్తి అయ్యాయంటూ బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం పూర్తిగా సత్యదూరమని ఆయన విమర్శించారు. ఆ ప్రచారం ముమ్మాటికీ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకేనని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రాజెక్ట్ ఆఫ్ టెక్‌ను జూరాల నుంచి శ్రీశైలం రిజర్వాయర్‌కు మార్చడంతో తీవ్రంగా నష్టం జరిగిందని ఆయన ఆరోపించారు. భూసేకరణ జరపకుండానే అప్పటి ప్రభుత్వం డిస్ట్రిబ్యూటర్ నెట్‌వర్క్‌కు టెండర్లు పిలిచి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసి తొలి దశలో నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, వికారాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలోని 1,226 గ్రామాలకు గునీరు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో సహా అనుబంధంగా ప్రాజెక్టులు పూర్తి చేసి 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



