MANNU | కొత్త బీటెక్ కోర్సులు.. ఎంట్రెన్స్ టెస్టు ద్వారానే సీట్ల భర్తీ.. వివరాలివే..!
MANNU | హైదరాబాద్ నగరంలోని మౌలానా అజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ(MANUU) లో కొత్తగా బీటెక్ కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు వర్సిటీ యాజమాన్యం ప్రకటించింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి 'స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ' పరిధిలో కొత్త బీటెక్ కోర్సులను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
MANNU | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగరంలోని మౌలానా అజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ(MANUU) లో కొత్తగా బీటెక్ కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు వర్సిటీ యాజమాన్యం ప్రకటించింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి 'స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ' పరిధిలో కొత్త బీటెక్ కోర్సులను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. కొత్త బీటెక్ కోర్సులకు ఏఐసీటీఈ కూడా ఆమోదం తెలిపింది.
కొత్త కోర్సులు ఇవే..
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్
ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్
సివిల్ ఇంజినీరింగ్
ప్రవేశాలు ఇలా..
అర్హత కలిగిన విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించి ప్రవేశాలు కల్పించనున్నారు.
ప్రవేశ పరీక్ష తేదీ..
ప్రవేశాలకు సంబంధించి మే 19న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
ఫీజులు ఇలా..
అబ్బాయిలకు రూ. 5500(ఒక్కో సెమిస్టర్‌కు)
అమ్మాయిలకు రూ. 1650(ఒక్కో సెమిస్టర్‌కు)
హాస్టల్ వసతి కూడా..
విద్యార్థిని, విద్యార్థులకు కళాశాల ప్రాంగణంలోనే అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన ప్రత్యేక హాస్టల్ వసతి కలదు.
ప్రవేశ పరీక్ష విధానం ఇలా..
ఇంటర్ స్థాయిలో ప్రశ్నలు అడగనున్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ నుంచి 100 ప్రశ్నలకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందులో 50 ప్రశ్నలు గణితం నుంచి, కెమిస్ట్రీ, ఫిజిక్స్ నుంచి 25 ప్రశ్నల చొప్పున అడగనున్నారు.
దరఖాస్తులకు చివరి తేదీ - ఏప్రిల్ 27
తదితర వివరాల కోసం ఈ వెబ్‌సైట్‌ను సంప్రదించొచ్చు.. https://manuu.edu.in/home
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




