త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sudheer Babu | ఫ్యూచర్ సిటీ సీపీగా బాధ్యతలు స్వీకరించిన సుధీర్ బాబు

Sudheer Babu | ఫ్యూచ‌ర్ సిటీ (Future City) పోలీస్ క‌మిష‌న‌ర్‌ (Police Commissioner) గా జి. సుధీర్‌బాబు (Sudheer Babu) బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న రాచ‌కొండ (Rachakonda) పోలీస్ క‌మిష‌న‌ర్‌గా ప‌నిస్తున్నారు. ప్ర‌భుత్వం రాజ‌ధానిలోని పోలీస్ క‌మిష‌న‌రేట్ల పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో భాగంగా రాచ‌కొండ క‌మిష‌న‌రేట్‌ను ఫ్యూచ‌ర్ సిటీగా మార్చారు.

A

Hyderabad | Published On Dec 31, 2025, 1.53 pm IST

Sudheer Babu | ఫ్యూచర్ సిటీ సీపీగా బాధ్యతలు స్వీకరించిన సుధీర్ బాబు
Advertisement

Sudheer Babu | ఫ్యూచ‌ర్ సిటీ (Future City) పోలీస్ క‌మిష‌న‌ర్‌ (Police Commissioner) గా జి. సుధీర్‌బాబు (Sudheer Babu) బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న రాచ‌కొండ (Rachakonda) పోలీస్ క‌మిష‌న‌ర్‌గా ప‌నిస్తున్నారు. ప్ర‌భుత్వం రాజ‌ధానిలోని పోలీస్ క‌మిష‌న‌రేట్ల పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో భాగంగా రాచ‌కొండ క‌మిష‌న‌రేట్‌ను ఫ్యూచ‌ర్ సిటీగా మార్చారు. ఇప్ప‌టికే రాచకొండ క‌మిష‌న‌రేట్‌లో ఉన్న ప‌లు ప్రాంతాల‌ను మ‌ల్కాజ్‌గిరి (Malkajgiri) క‌మిష‌న‌రేట్‌లోకి మార్చి, మిగిలిన ప్రాంతానికి ఇత‌ర ప్రాంతాల‌ను క‌లిపి నూత‌నంగా ఫ్యూచ‌ర్ సిటీ క‌మిష‌న‌రేట్‌ను నెల‌కొల్పారు. తాత్కాలికంగా ఈ క‌మిష‌న‌రేట్ కార్యాల‌యాన్ని ఆదిభ‌ట్ల‌లోని రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌రేట్ పైభాగంలో ఏర్పాటు చేశారు. నూత‌న క‌మిష‌న‌రేట్ కోసం స్కిల్ యూనివ‌ర్సిటీ స‌మీపంలో 150 ఎక‌రాలు కేటాయించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

డీఎస్పీగా ఎంపికై అద‌న‌పు డీజీపీగా ప‌దోన్న‌తి

డీఎస్పీగా ఎంపికై అద‌న‌పు డీజీపీగా ప‌దోన్న‌తి పొందిన‌ తొలి అధికారిగా సుధీర్‌బాబు ఘ‌న‌త సాధించారు. డీఎస్పీగా పోలీసుల్లో చేరిన ఆయ‌నకు 2001లో ఐపీఎస్ ఖ‌రారైంది. 25 ఏళ్ల స‌ర్వీసు పూర్తి కావ‌డంతో ఇటీవ‌లే ఇటీవ‌లే అద‌న‌పు డీజీగా ప‌దోన్న‌తి పొందారు. వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌రేట్ ఏర్పాటైన అనంత‌రం తొలి క‌మిష‌న‌ర్‌గా ప‌నిచేసిన ఆయ‌న ప్ర‌స్తుతం నూత‌న క‌మిష‌న‌రేట్‌గా ఏర్పాటైన ఫ్యూచ‌ర్ సిటీ క‌మిష‌న‌ర్‌గా కూడా బాధ్య‌త‌లు స్వీక‌రించి, రెండు క‌మిష‌న‌రేట్‌ల‌కు ప్ర‌థ‌మ క‌మిష‌న‌ర్‌గా అరుదైన ఘ‌న‌త సాధించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement