Faridabad Horror | మరో నిర్భయ ఘటన.. కదులుతున్న వ్యాన్‌లో యువతిపై గ్యాంగ్‌రేప్
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ రూట్‌లోని సీసీటీవీ కెమెరాలను చెక్ చేసి నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసి వ్యాన్‌ని సీజ్ చేశారు. బాధితురాలి స్టేట్‌మెంట్ కూడా తీసుకోవాల్సి ఉంది
Faridabad Horror | దేశ రాజధానికి కూతవేటు దూరంలో మరో నిర్భయ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న వ్యాన్‌లో ఓ యువతిపై గ్యాంగ్‌రేప్ జరిగింది. రెండు గంటల పాటు వ్యాన్‌ను రోడ్డు మీద అటు ఇటూ తిప్పుతూ యువతిపై కామాందులు దారుణానికి ఒడిగట్టారు. ఫరీదాబాద్‌లో జరిగిన ఈ ఘటన దేశమంతా ఉలిక్కిపడేలా చేసింది.
సోమవారం రాత్రి సమయంలో తన ఇంటికి వెళ్లేందుకు 28 ఏళ్ల యువతి బస్టాప్ వద్ద వేచి ఉండగా, ఓ వ్యాన్ అక్కడికి వచ్చింది. అందులో నుంచి ఇద్దరు యువకులు కిందికి దిగి తను ఎటు వెళ్లాలో కనుక్కున్నారు. తాము కూడా అటువైపే వెళ్తున్నామని నమ్మబలికి యువతి వ్యాన్ ఎక్కేలా చేశారు. తన ఇంటి వద్ద డ్రాప్ చేస్తామని చెప్పి గురుగ్రామ్ రోడ్ వైపు వ్యాన్‌ని మళ్లించారు. రెండున్నర గంటల పాటు ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టారు.
మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో రాజా చౌక్ దగ్గర్లో ఉన్న ఎస్‌జీఎం నగర్‌లో ఆ యువతిని వ్యాన్ నుంచి కిందికి తోసేశారు. దీంతో ఆ యువతికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తేరుకొని తన సోదరికి ఫోన్ చూసి అసలు విషయం చెప్పడంతో వెంటనే తన కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని యువతిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువతి కోలుకుంటోంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ రూట్‌లోని సీసీటీవీ కెమెరాలను చెక్ చేసి నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసి వ్యాన్‌ని సీజ్ చేశారు. బాధితురాలి స్టేట్‌మెంట్ కూడా తీసుకోవాల్సి ఉంది. ఆ యువతికి పెళ్లి అయిందని.. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారని తెలుస్తోంది. తన భర్తతో కాకుండా వేరుగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





