త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Job Mela For Women | వ‌చ్చే నెల 3న మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేక డ్రైవ‌ర్ ఉద్యోగ మేళా

Job Mela For Women | హైద‌రాబాద్ (Hyderabad) న‌గ‌రంలోని మ‌హిళ‌ల‌కు స్వ‌యం ఉపాధి క‌ల్పించే దిశ‌గా వ‌చ్చే నెల 3న మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేక డ్రైవ‌ర్ ఉద్యోగ మేళా (Job Mela For Women) నిర్వ‌హించ‌నున్న‌ట్లు న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ (Police Commissioner) వీసీ స‌జ్జ‌నార్ (Sajjanar) త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు.

A

Hyderabad | Published On Dec 29, 2025, 6.42 pm IST

Job Mela For Women | వ‌చ్చే నెల 3న మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేక డ్రైవ‌ర్ ఉద్యోగ మేళా
Advertisement

Job Mela For Women | హైద‌రాబాద్ (Hyderabad) న‌గ‌రంలోని మ‌హిళ‌ల‌కు స్వ‌యం ఉపాధి క‌ల్పించే దిశ‌గా హైద‌రాబాద్ పోలీసులు (Hyderabad Police) ముంద‌డుగు వేశారు. తెలంగాణ మ‌హిళా భ‌ద్ర‌తా విభాగం (Women Safety Wing)తో క‌లిసి వ‌చ్చే నెల 3న మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేక డ్రైవ‌ర్ ఉద్యోగ మేళా (Job Mela For Women) నిర్వ‌హించ‌నున్న‌ట్లు న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ (Police Commissioner) వీసీ స‌జ్జ‌నార్ (Sajjanar) త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌, ఆర్థిక స్వావ‌లంబ‌న ల‌క్ష్యంగా బైక్ టాక్సీ, ఈ - ఆటో డ్రైవింగ్‌లో శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఉచిత డ్రైవింగ్ శిక్ష‌ణ‌, లైసెన్స్ జారీలో స‌హాయం అంద‌జేస్తామ‌ని పేర్కొన్నారు. డ్రైవింగ్ అనుభ‌వం లేక‌పోయినా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని చెప్పారు. వాహ‌న లోన్‌, లీజు సౌక‌ర్యం ఉంటుంద‌ని చెప్పారు. 21 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మ‌ధ్య‌లో ఉన్న హైద‌రాబాద్ వాసులెవ‌రైనా అంబ‌ర్ పేట్‌ (Amberpet)లోని పోలీస్ ట్రైనింగ్ సెంట‌ర్‌ (Police Training Centre)లో జ‌రిగే మేళాకు హాజ‌రుకావ‌చ్చ‌ని వివ‌రించారు. ఇత‌ర వివ‌రాల‌కు 8978862299 నెంబ‌ర్‌లో సంప్ర‌దించాల‌ని సూచించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement