Chicken | చికెన్, మటన్‌ను ఫ్రిజ్‌లో ఎన్నిరోజుల వరకు స్టోర్ చేయొచ్చో తెలుసా..?
Chicken | పార్టీలు, ఫంక్షన్లు జరిగినప్పుడు ఎక్కువైన చికెన్ లేదా మటన్‌ను మనం ఫ్రిజ్‌లో స్టోర్ చేస్తుంటాం. ఆ తర్వాత రెండు మూడు రోజులకు వండుకుని తింటుంటారు.. కొన్నిసార్లు అయితే వారం రోజుల దాకా ఫ్రిజ్‌లో అలాగే పెడుతుంటారు.
Chicken | పార్టీలు, ఫంక్షన్లు జరిగినప్పుడు ఎక్కువైన చికెన్ లేదా మటన్‌ను మనం ఫ్రిజ్‌లో స్టోర్ చేస్తుంటాం. ఆ తర్వాత రెండు మూడు రోజులకు వండుకుని తింటుంటారు.. కొన్నిసార్లు అయితే వారం రోజుల దాకా ఫ్రిజ్‌లో అలాగే పెడుతుంటారు. మరి అలా నిల్వ చేసిన చికెన్ లేదా మటన్‌ను తినడం ఆరోగ్యానికి మంచిదేనా? పచ్చి చికెన్ లేదా మటన్‌ను ఎన్నిరోజుల వరకు ఫ్రిజ్‌లో స్టోర్ చేయవచ్చు. రిఫ్రిజిరేటర్‌లో స్టోర్ చేసిన నాన్ వెజ్ ఎంతకాలం ఫ్రెష్‌గా ఉంటుంది.. వాటిలో పోషకాలు తగ్గకుండా ఉంటాయనే దానిపై హెల్త్ లైన్ సంస్థ సర్వే చేసి ఇటీవల ఒక నివేదిక ఇచ్చింది.
సాధారణంగా చికెన్‌లో తేమ ఎక్కువగా ఉంటుంది. దాన్ని ఫ్రిజ్‌లో ఉంచినప్పుడు దాని కణజాలాలు విచ్ఛిన్నమవుతాయి. దీనివల్ల చికెన్ వేగంగా చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పచ్చి చికెన్‌ను ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే రిఫ్రిజిరేటర్‌లో స్టోర్ చేయాలి. అలా కాకుండా చికెన్ ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే దాన్ని ఒక ప్యాకేజిలో పెట్టి గట్టిగా సీల్ చేయాలి. గాలి కూడా చొరబడకుండా ఉండేలా సీల్ చేయడం వల్ల ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటుంది. చికెన్‌ను ఫ్రిజ్‌లో నుంచి బయటకు తీసినప్పుడు వాసన వచ్చినా.. లేత బూడిద రంగులో కనిపించినా అది పాడైపోతుందని అర్థం. అలాగే చెడిపోయిన చికెన్ జిగటగా కూడా ఉంటుంది. అలా కనిపిస్తే ఆ చికెన్‌ను వండుకోకపోవడం మంచిది.
పచ్చి మటన్‌ను రిఫ్రిజిరేటర్‌లో మూడు నుంచి ఐదు రోజుల వరకు నిల్వ చేయవచ్చు. మటన్‌కు ఉండే కొవ్వు చుట్టుపక్కల వాసనల్ని తొందరగా గ్రహిస్తుంది. కాబట్టి మటన్ తొందరగా పాడైపోతుంది. కాబట్టి మటన్‌ను లీక్ ప్రూఫ్ ప్యాకేజీలో సీల్ చేయాలి. అప్పుడే మటన్‌ను ఎక్కువ రోజులు నిల్వ చేయవచ్చు. మటన్ రంగు మారిన, వాసన వచ్చినా, జిగటగా అనిపించినా అది పాడైపోయిందనే అర్థం. అలాంటి మటన్‌ను తినకూడదు.
పచ్చి చికెన్, మటన్‌తో పోలిస్తే చేపలు చాలా తొందరగా పాడైపోతాయి. వాటిని ఫ్రిజ్‌లో ఉంచినప్పటికీ వేగంగా తాజాదనాన్ని కోల్పోతాయి. అందుకే చేపల్ని కొన్న వెంటనే వండుకోవాలి. అలా వెంటనే వండుకోవడం కుదరని పరిస్థితుల్లో చేపలను ఒక గిన్నెలో వేసి.. అందులో ఐస్ క్యూబ్స్ వేయాలి. అనంతరం దాన్ని రిఫ్రిజిరేటర్‌లో స్టోర్ చేయాలి.
అదే వండిన చికెన్ లేదా మటన్ కర్రీని మూడు నుంచి నాలుగు రోజుల వరకు రిఫ్రిజిరేటర్‌లో నిల్వ ఉంచవచ్చు. అంతకంటే ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో ఉంచినప్పుడు మసాలాల కారణంగా మంచి వాసనే వచ్చినప్పటికీ.. మాంసం మాత్రం పాడైపోతుంది. కాబట్టి అలాంటి నాన్ వెజ్ తినడం వల్ల అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉంటాయి. ఇక పచ్చి చికెన్ లేదా మటన్‌ను ఫ్రిజ్‌లో నిల్వ చేయాలని అనుకున్నప్పుడు బాగా కడిగి, ఆరబెట్టాలి. అనంతరం గాలి చొరబడని కంటైనర్‌లో లేదా సీల్డ్ ప్యాకేజీలో ఉంచాలి. వీలైనంత వరకు డీప్ ఫ్రిజ్‌లో మాత్రమే నిల్వ చేయాలి.
సంబంధిత వార్తలు

Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
అక్టోబర్ 5, 2026

TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ
అక్టోబర్ 5, 2026

DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్
అక్టోబర్ 5, 2026
తాజావార్తలు
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ
- ●DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్
- ●Balapur | బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు
- ●Separate Food | జాతరలో కుల వివక్ష.. దళితులకు విడిగా భోజనాలు
- ●Horoscope | అక్టోబర్ 5 రాశిఫలాలు.. సహోద్యోగులతో ఇబ్బందులు ఎదురవుతాయి!

Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్

TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్

Balapur | బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు



