త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

New Year | న్యూఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ ఎఫెక్ట్.. తాగుబోతుల‌కు సీపీ మ‌రోసారి హెచ్చ‌రిక‌

New Year | నూత‌న సంవ‌త్స‌రం (New Year) వ‌స్తుందంటే న‌గ‌ర యువ‌త జోష్‌తో ఉర‌క‌లెత్తుతుంది. కానీ ఆ ఉర‌క‌ల‌కు బ్రేకులేస్తూ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ (Police Commissioner) వీసీ స‌జ్జ‌నార్ (Sajjanar)తాగుబోతుల‌కు హెచ్చ‌రిక చేశారు.

A

Hyderabad | Published On Dec 28, 2025, 6.16 pm IST

New Year | న్యూఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ ఎఫెక్ట్.. తాగుబోతుల‌కు సీపీ మ‌రోసారి హెచ్చ‌రిక‌
Advertisement

New Year | నూత‌న సంవ‌త్స‌రం (New Year) వ‌స్తుందంటే న‌గ‌ర యువ‌త జోష్‌తో ఉర‌క‌లెత్తుతుంది. కానీ ఆ ఉర‌క‌ల‌కు బ్రేకులేస్తూ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ (Police Commissioner) వీసీ స‌జ్జ‌నార్ (Sajjanar)తాగుబోతుల‌కు హెచ్చ‌రిక చేశారు. ఇప్ప‌టికే నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల్లో మ‌ద్యం తాగి వాహ‌నం న‌డిపిస్తే (Drunk and Drive) జైలుకు పంపుతామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. నూత‌న సంవ‌త్స‌రం రోజు కుటుంబ‌స‌భ్యుల‌తో ఇంట్లో ఉంటారా.. నాలుగు గోడ‌ల మ‌ధ్య జైళ్లో ఉంటారో తేల్చుకోవాల‌ని సూచించారు. దీనికోసం మూడు రోజుల క్రిత‌మే స్పెష‌ల్ డ్రైవ్ ప్రారంభించారు.

సోష‌ల్ మీడియాలో వినూత్న ప్ర‌చారం...

స‌జ్జ‌నార్ త‌న ట్విట్ట‌ర్‌లో "మియా, డ్రింక్ కియా? తో స్టీరింగ్ కో స‌లామ్ బోల్‌కే క్యాబ్ ప‌క్‌డో" అంటూనే గూగుల్‌లో క్యాబ్ కోసం వెత‌కండి లాయ‌ర్ కోసం కాదు అంటూ చుర‌క అంటించారు.
మరొక ట్వీట్‌లో త‌నిఖీల్లో ప‌ట్టుబ‌డిన వారు సాధార‌ణంగా మాట్లాడే మాట‌ల‌ను పేర్కొంటూ అవి అన్నీ త‌మ అధికారుల‌ను అడ‌గ‌వ‌ద్ద‌ని సూచించారు. "మా డాడీ ఎవ‌రో తెలుసా, మా అంకుల్ ఎవ‌రో తెలుసా, అన్న ఎవ‌రో తెలుసా అని మా అధికారుల‌ను అడ‌గ‌కండి. మీ ప్రైవ‌సీని మేము గౌర‌విస్తాం. వాహ‌నం ప‌క్క‌కు పెట్టి, డేట్ వ‌చ్చిన త‌రువాత న్యాయ‌స్థానంలో ప‌రిచయం చేసుకుందాం" అంటూ త‌న‌దైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement