Congress | బీసీ రిజర్వేషన్లకు బీజేపీ అడ్డంపడుతోంది: మహేశ్ కుమార్ గౌడ్
Congress | తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా కుల సర్వే చేశామని టీపీసీసీ (TPCC) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ (MLC) మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) చెప్పారు. అన్ని వర్గాలకు సరైన ఫలాలు అందాలన్న ఉద్దేశ్యంతోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనుకుంటే బీజేపీ (BJP) అడ్డం పడుతోందని ఆరోపించారు.
గాంధీభవన్‌లో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం
Congress | తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చరిత్రలోనే తొలిసారిగా కుల సర్వే చేశామని టీపీసీసీ (TPCC) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ (MLC) మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) చెప్పారు. అన్ని వర్గాలకు సరైన ఫలాలు అందాలన్న ఉద్దేశ్యంతోనే కుల సర్వే చేశామని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు అసెంబ్లీలో సైతం తీర్మానం చేశామని అన్నారు. కానీ రిజర్వేషన్ల అమలుకు బీజేపీ (BJP) అడ్డం పడుతోందని ఆరోపించారు. బీజేపీ విధానాలకు రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) వంతపాడుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌లో నిర్వహించిన వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పీజేఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు.
దేశ అభివృద్ధికి నెహ్రూయే కారణం
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత పురాతన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. అనేక మంది మహనీయుల సంకల్పంతో ఏర్పడిన పార్టీ కాంగ్రెస్ అని గుర్తు చేశారు. స్వాతంత్య్ర పోరాటంలో, దేశ నిర్మాణంలో పార్టీ పాత్ర ఎనలేనిదని కొనియాడారు. మహనీయుల త్యాగం ముందు అధికార దాహంతో రాజ్యమేలుతున్న నాయకులు ఎంత అని ప్రశ్నించారు. నెహ్రూ ప్రధాని కాకుండా ఉండి ఉంటే ఈ దేశం ఏమయ్యేదో ఊహించలేమని అన్నారు. ఆయన పోషించిన పాత్ర వల్లే దేశం ఈ స్థాయికి చేరిందని అభిప్రాయపడ్డారు. గుండు సూది తయారు చేయలేని స్థితి నుంచి రాకెట్ ప్రయోగాల వరకు ఎదిగింది అంటే దానికి నెహ్రూ వేసిన పునాదులే కారణమని వివరించారు.
నేడు మోడీ పాకిస్థాన్‌కు భయపడుతున్నాడు
పాకిస్థాన్ ఇందిరాగాంధీ అంటే గడగడలాడే పరిస్థితి ఉండేదని చెప్పారు. కానీ నేడు ప్రధాని మోడీ మాత్రం పాకిస్థాన్‌కు భయపడుతున్నాడని ఎద్దేవా చేశారు. సామాన్యులు సైతం ఎదగాలని ఆశించిన ఇందిర బ్యాంకుల జాతీయీకరణ చేసిందని, రాజీవ్ సాంకేతికతను దేశానికి పరిచయం చేశారని చెప్పారు. తన ఆర్థిక సంస్కరణలతో పీవీ నరసింహారావు దేశాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారని కొనియాడారు. ఈరోజు మోడీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగించి, పథకాన్ని నీరు గార్చే పని చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని నీరు గార్చి... ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి పని చేపట్టిందని మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్‌లకు మేలు చేసే విధానాలు తప్ప ప్రజల గురించి అస్సలు ఆలోచన చెయ్యడం లేదని విమర్శించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



