Public Smoking Jail Hyderabad | బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్లు కాలుస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే..!
హైదరాబాద్‌లో బహిరంగంగా సిగరెట్ తాగుతూ న్యూసెన్స్ చేసిన ఇద్దరు యువకులకు 4 రోజుల జైలు శిక్ష విధించిన కోర్టు.
సంక్షిప్త సారాంశం
హైదరాబాద్ కుల్సుంపురా పరిధిలో బహిరంగ ప్రదేశంలో సిగరెట్లు తాగుతూ న్యూసెన్స్ సృష్టించిన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లి కోర్టులోని IV స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నిందితులకు 4 రోజుల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. సీపీ యాక్ట్ (CP Act) సెక్షన్ 61(b) కింద నమోదైన ఈ-పెట్టీ కేసులో నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారైంది. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
Public Smoking Jail Hyderabad | త్రినేత్ర న్యూస్ : బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్లు తాగుతూ, రోడ్లపై తిరుగుతూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే ఇకపై జరిమానాలతో సరిపెట్టే పరిస్థితి లేదు. ఏకంగా కటకటాల వెనక్కి వెళ్లాల్సిందే. హైదరాబాద్ నగరంలో బహిరంగంగా పొగతాగుతూ స్థానికులను ఇబ్బంది పెట్టిన ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగులకు స్థానిక న్యాయస్థానం నాలుగు రోజుల సాధారణ జైలు శిక్ష విధిస్తూ మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది.
Also Read | బతుకమ్మ.. మహిళల చైతన్యానికి ప్రతీక
అసలేం జరిగింది?
కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా సంచరిస్తూ, పబ్లిక్ ప్లేసుల్లో సిగరెట్లు తాగుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నట్లు (పబ్లిక్ న్యూసెన్స్) పోలీసుల తనిఖీల్లో వెల్లడైంది. దీనిపై వెంటనే స్పందించిన కుల్సుంపురా ఎస్ఐ కే. శ్వేత నిందితులపై ఈ-పెట్టీ (E-Petty) కేసు నమోదు చేసి, నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.
ఇదీ చదవండి | సీఎం ప్రజావాణిలో ఉద్యోగాలు పోయిన ఆర్టీసీ వర్కర్లకు భరోసా.. ఇప్పటికే 317 మందికి లైన్ క్లియర్
శిక్ష పడిన యువకుల వివరాలు:
యు. సాయికిరణ్ (24): దుర్గానగర్ నివాసి, ప్రైవేట్ ఉద్యోగి
ఎన్. నవీన్ (26): వనస్థలిపురం నివాసి, ప్రైవేట్ ఉద్యోగి
కోర్టు సంచలన తీర్పు
నాంపల్లి గాంధీ భవన్ సమీపంలోని మనోరంజన్ కాంప్లెక్స్‌లో గల IV స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పి. సావిత్రి దేవి ఎదుట ఈ కేసు విచారణకు వచ్చింది. పోలీసులు సమర్పించిన ఆధారాలతో సిటీ పోలీస్ యాక్ట్ (CP Act) సెక్షన్ 61(b) కింద నిందితులు నేరానికి పాల్పడినట్లు రుజువైంది. దీంతో ఇద్దరు యువకులకు 4 రోజుల సాధారణ జైలు శిక్ష విధిస్తూ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఎస్ఐ కే. శ్వేత, కోర్టు లైజన్ అధికారిగా కానిస్టేబుల్ కే నరేష్ వ్యవహరించారు.
Also Read | మన్నె క్రిశాంక్‌కు షరతులు లేకుండా బెయిల్
పోలీసుల గట్టి హెచ్చరిక
బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్లు తాగడం చట్టరీత్యా నేరమని, రోడ్లపై గుంపులుగా చేరి కాలక్షేపం చేస్తూ ఇతరులను ఇబ్బందికి గురిచేస్తే ఉపేక్షించేది లేదని కుల్సుంపురా ఇన్‌స్పెక్టర్ ఎ. రాములు స్పష్టం చేశారు. పబ్లిక్ ప్లేసుల్లో శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Minister Tummala | రాష్ట్రంలో 2.33 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు : మంత్రి తుమ్మల
- ●CM Prajavani Telangana | సీఎం ప్రజావాణిలో ఉద్యోగాలు పోయిన ఆర్టీసీ వర్కర్లకు భరోసా.. ఇప్పటికే 317 మందికి లైన్ క్లియర్
- ●Bhatti Vikramarka | 27 లక్షల మంది విద్యార్థులకు వేడి వేడి అల్పాహారం
- ●ACB Raids | ఏసీబీకి చిక్కిన సీనియర్ అకౌంటెంట్
- ●Mumbai Ahmedabad Bullet Train | బుల్లెట్ రైలు ప్రాజెక్టులో బిగ్ ట్విస్ట్: జపాన్‌తో సిగ్నలింగ్ రగడ.. మేడ్ ఇన్ ఇండియా ట్రైన్‌తోనే తొలి జర్నీ!
- ●Indian Navy | సముద్రంలో నేవీ సింహగర్జన!

Minister Tummala | రాష్ట్రంలో 2.33 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు : మంత్రి తుమ్మల

CM Prajavani Telangana | సీఎం ప్రజావాణిలో ఉద్యోగాలు పోయిన ఆర్టీసీ వర్కర్లకు భరోసా.. ఇప్పటికే 317 మందికి లైన్ క్లియర్

Bhatti Vikramarka | 27 లక్షల మంది విద్యార్థులకు వేడి వేడి అల్పాహారం

ACB Raids | ఏసీబీకి చిక్కిన సీనియర్ అకౌంటెంట్






