Kishan Reddy | బతుకమ్మ.. మహిళల చైతన్యానికి ప్రతీక
Kishan Reddy | తెలంగాణలో ఎంతో గొప్పగా జరుపుకునే బతుకమ్మ పండుగ మహిళల చైతన్యానికి ప్రతీక అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Kishan Reddy | త్రినేత్ర న్యూస్ : తెలంగాణలో ఎంతో గొప్పగా జరుపుకునే బతుకమ్మ పండుగ మహిళల చైతన్యానికి ప్రతీక అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ పురస్కరించుకుని మంగళవారం అంబర్‌పేట్‌లోని మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన 'మహిళా చైతన్య సదస్సుసలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ఈ నెల 17న సాయంత్రం 5 గంటలకు అంబర్‌పేట గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న బతుకమ్మ వేడుకల్లో మహిళా సోదరీమణులంతా పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. గతంలో నిజాంకు, రజాకార్లకు వ్యతిరేకంగా సాగిన స్వాతంత్య్ర పోరాటంలో బతుకమ్మ పండుగ ద్వారానే మహిళలు గ్రామీణ ప్రజల్లో చైతన్యం రగిలించిన విషయాన్ని ఈ సదస్సులో గుర్తుచేశారు. మహిళలను ఉద్యమానికి సన్నద్ధం చేసిన బతుకమ్మను నాడు నిజాం రజాకార్లు దుర్మార్గంగా అవమానించిన చరిత్ర మనందరికీ తెలిసిందే. అందుకే బతుకమ్మ కేవలం పండుగ మాత్రమే కాదు, మన ఆత్మగౌరవానికి, పౌరుషానికి ప్రతీక. కులమతాలకు, ధనిక-పేద తారతమ్యాలకు, వయోభేదాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా జరుపుకునే ఐకమత్య పండుగ ఇది అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

తాజావార్తలు
- ●Minister Tummala | రాష్ట్రంలో 2.33 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు : మంత్రి తుమ్మల
- ●CM Prajavani Telangana | సీఎం ప్రజావాణిలో ఉద్యోగాలు పోయిన ఆర్టీసీ వర్కర్లకు భరోసా.. ఇప్పటికే 317 మందికి లైన్ క్లియర్
- ●Bhatti Vikramarka | 27 లక్షల మంది విద్యార్థులకు వేడి వేడి అల్పాహారం
- ●ACB Raids | ఏసీబీకి చిక్కిన సీనియర్ అకౌంటెంట్
- ●Mumbai Ahmedabad Bullet Train | బుల్లెట్ రైలు ప్రాజెక్టులో బిగ్ ట్విస్ట్: జపాన్‌తో సిగ్నలింగ్ రగడ.. మేడ్ ఇన్ ఇండియా ట్రైన్‌తోనే తొలి జర్నీ!
- ●Indian Navy | సముద్రంలో నేవీ సింహగర్జన!

Minister Tummala | రాష్ట్రంలో 2.33 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు : మంత్రి తుమ్మల

CM Prajavani Telangana | సీఎం ప్రజావాణిలో ఉద్యోగాలు పోయిన ఆర్టీసీ వర్కర్లకు భరోసా.. ఇప్పటికే 317 మందికి లైన్ క్లియర్

Bhatti Vikramarka | 27 లక్షల మంది విద్యార్థులకు వేడి వేడి అల్పాహారం

ACB Raids | ఏసీబీకి చిక్కిన సీనియర్ అకౌంటెంట్




