Minister Sitakka | మహిళల ఆర్థిక స్వావలంబనకు ‘స్త్రీనిధి’ కొండంత అండ : మంత్రి సీతక్క
Minister Sitakka | హైదరాబాద్: మహిళల ఆర్థిక స్వావలంబనకు ‘స్త్రీనిధి’ (Stree Nidhi) కొండంత అండ అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క (Minister Sitakka) తెలిపారు.
Minister Sitakka | హైదరాబాద్: మహిళల ఆర్థిక స్వావలంబనకు ‘స్త్రీనిధి’ (Stree Nidhi) కొండంత అండ అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క (Minister Sitakka) తెలిపారు. ప్రజాభవన్‌లో శనివారం జరిగిన ‘స్త్రీనిధి యాన్యువల్ యాక్షన్ ప్లాన్’ అమలు కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. తెలంగాణ మహిళలకు స్త్రీనిధి ఒక నమ్మకమైన బ్యాంక్‌గా ఎదగాలని ఆకాంక్షించారు. “రాజ్యాంగం హక్కులతో పాటూ బాధ్యతలను కూడా నిర్దేశించింది. స్త్రీనిధి సంస్థ మన ఇల్లు లాంటిది. సంస్థను కాపాడుకుంటేనే ఉద్యోగుల హక్కులు, భవిష్యత్తు సురక్షితంగా ఉంటాయి” అన్నారు. 2011లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన స్త్రీనిధి, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మరింత బలోపేతం అవుతోందన్నారు. మైక్రో ఫైనాన్స్ సంస్థలు, అధిక వడ్డీ వ్యాపారుల బారిన పడుతున్న మహిళలను ఆదుకోవడానికే స్త్రీనిధి ఏర్పాటైందని తెలిపారు.
స్త్రీనిధి.. మాహిళా బ్యాంక్
ఇప్పటివరకు స్త్రీనిధి ద్వారా 32 లక్షల మందికి పైగా మహిళలకు రూ.24 వేల కోట్ల రుణాలు అందించడం గొప్ప విజయమని మంత్రి పేర్కొన్నారు. స్త్రీనిధి అసలు సిసలు మాహిళా బ్యాంక్ అని కొనియాడారు. తెలంగాణ మహిళలకు స్త్రీనిధి ఒక నమ్మకమైన బ్యాంక్‌గా ఎదగాలని ఆకాంక్షించారు. తెలంగాణ స్త్రీనిధి మోడల్‌ను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయని చెప్పారు. “కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం. ఆ దిశగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. మహిళల అభివృద్ధే తెలంగాణ అభివృద్ధి అనే నమ్మకంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది” అని మంత్రి తెలిపారు.
దేశ జీడీపీలో మహిళల భాగస్వామ్యం ప్రస్తుతం 18 శాతానికే పరిమితమైందని, అభివృద్ధి చెందిన దేశాల్లో అది 40 శాతానికి చేరుకుందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ మహిళలు కూడా ఆ స్థాయికి ఎదగాలని, అందుకోసం ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోందన్నారు. చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధి అవకాశాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. ముఖ్యంగా గ్రామీణ మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తూ వారి జీవనోపాధిని మెరుగుపరుస్తున్నామని తెలిపారు.
అసత్యాలను తిప్పికొట్టాలి..
స్త్రీనిధి సంస్థపై కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం పనిచేస్తున్న సంస్థ ప్రతిష్టను దెబ్బతీయడానికి కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. అసత్య ప్రచారాలను ఉద్యోగులంతా కలిసి తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. “మాది ఉద్యోగ అనుకూల ప్రభుత్వం. స్త్రీనిధిలో ఒక్కరిని కూడా తొలగించలేదు. ఇప్పటికే పదోన్నతులు, బదిలీలు పూర్తి చేశాం. సెర్ప్‌లో వంద శాతం బదిలీలు నిర్వహించాం. స్త్రీనిధిని బలోపేతం చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం తప్ప, ఎవరి ఉద్యోగాలను తొలగించడం కాదు” అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. స్త్రీనిధి ఏర్పాటు, విజయవంతంలో కృషి చేసిన వారందరినీ మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ దాన కిషోర్, పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్, స్త్రీనిధి dmd శ్రీనాథ్, ఉద్యోగులు పాల్గొన్నారు.
Also Read..
బండి భగీరథ్పై లుకౌట్ నోటీసులు
ప్రపంచ పటంలో ఉండాలో లేదో వారే నిర్ణయించుకోవాలి.. పాక్‌కు ఆర్మీచీఫ్ వార్నింగ్
ఐసిస్‌కు బిగ్ షాక్.. టాప్ కమాండర్ అబు బిలాల్ మినూకీ హతం.. ప్రకటించిన ట్రంప్
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



