CP Sajjanar | సీపీ సజ్జనార్ న్యూ ఇయర్ రిజల్యూషన్స్.. ఏమని తీర్మానించుకున్నారంటే..?
CP Sajjanar | హైదరాబాద్: నూతన సంవత్సరం ప్రారంభం అయిన సందర్భంగా ప్రతి ఏడాది ఇదే సమయంలో పలు అంశాలపై చాలా మంది తీర్మానాలు చేసుకుంటారు. రోజూ వ్యాయామం చేయాలని, పొగ తాగడం లేదా మద్యం సేవించడం మానేయాలని, కొత్త ఉద్యోగం సాధించాలని, బిజినెస్ చేయాలని.. ఇలా రక రకాల రిజల్యూషన్స్‌ను తీసుకుంటారు.
CP Sajjanar | హైదరాబాద్: నూతన సంవత్సరం ప్రారంభం అయిన సందర్భంగా ప్రతి ఏడాది ఇదే సమయంలో పలు అంశాలపై చాలా మంది తీర్మానాలు చేసుకుంటారు. రోజూ వ్యాయామం చేయాలని, పొగ తాగడం లేదా మద్యం సేవించడం మానేయాలని, కొత్త ఉద్యోగం సాధించాలని, బిజినెస్ చేయాలని.. ఇలా రక రకాల రిజల్యూషన్స్‌ను తీసుకుంటారు. కానీ 90 శాతం మంది ఈ తీర్మానాలను పాటించడంలో లేదా అమలు చేయడంలో విఫలం అవుతారని సర్వేలు చెబుతున్నాయి. అయితే ఇతరుల విషయం ఏమోకానీ తాను మాత్రం ఇలా కొన్ని తీర్మానాలను చేసుకున్నానని, కచ్చితంగా వాటిని పాటించి తీరుతానని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో ఈ విషయాన్ని పోస్టు చేశారు. నూతన సంవత్సరంలో తాను అమలు చేయబోయే నిర్ణయాలను ఆయన ప్రకటించారు.
పోలీసులు ఉద్యోగ విధులను, ఆరోగ్యాన్ని సమన్వయం చేసుకోవాలి. ఫిట్ నెస్ విషయంలో రాజీ పడొద్దు. చాలాకాలంగా ఫిట్ నెస్ కోసం జిమ్‌కు వెళ్లాలని అనుకుంటున్నాను. కానీ పని ఒత్తిడి కారణంగా కుదరడం లేదు. ఇకపై ఆరోగ్యం విషయంలో రాజీ పడను. త్వరలోనే జిమ్‌లో చేరుతా.. అని సీపీ సజ్జనార్ వెల్లడించారు. అలాగే పుస్తక పఠనం చేసేందుకు, కొత్త విషయాలను నేర్చుకునేందుకు సమయం కేటాయించదలచుకున్నానని, అన్నింటికన్నా ముఖ్యంగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ ఏడాది సంతోషంగా గడిపేందుకు తీర్మానం చేసుకున్నానని వివరించారు.
పోలీసు సిబ్బంది ఆరోగ్యం, శ్రేయస్సు విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని సజ్జనార్ తెలిపారు. వారు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని, ఆ విధంగా వారు ఉండేలా చూడడం కూడా తమ ప్రాధాన్యతల్లో ఒకటని తెలిపారు. హైదరాబాద్ మహా నగరాన్ని గ్లోబల్ అవుట్ లుక్‌గా మారుస్తామని, అత్యంత సురక్షితమైన, భద్రత కలిగిన, అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఉండేలా నగరాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. నేరాల నియంత్రణకు మరిన్ని వినూత్నమైన విధానాలను అవలంబిస్తామని సజ్జనార్ పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





