త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Malreddy Ranga Reddy | రంగారెడ్డి ప్ర‌జ‌లు మన‌ల్ని క్ష‌మించ‌రు.. శాస‌న‌స‌భ‌లో ఎమ్మెల్యే మ‌ల్‌రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు

MLA Malreddy Ranga Reddy | ఇప్ప‌టికే రంగారెడ్డి జిల్లా మూడు ముక్క‌లైంది.. మ‌ళ్లీ 27 మున్సిపాలిటీల‌ను 27 జాగాల్లో క‌లిపేసి.. రంగారెడ్డి జిల్లా అస్తిత్వాన్ని దెబ్బ‌తీశారు అని ఇబ్ర‌హీంప‌ట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మ‌ల్‌రెడ్డి రంగారెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ త‌ప్పుతో రంగారెడ్డి ప్ర‌జ‌లు మ‌న‌ల్ని క్ష‌మించ‌రు అని ఆయ‌న పేర్కొన్నారు.

S

Hyderabad | Published On Jan 2, 2026, 4.13 pm IST

MLA Malreddy Ranga Reddy | రంగారెడ్డి ప్ర‌జ‌లు మన‌ల్ని క్ష‌మించ‌రు.. శాస‌న‌స‌భ‌లో ఎమ్మెల్యే మ‌ల్‌రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు
Advertisement

MLA Malreddy Ranga Reddy | త్రినేత్ర‌.న్యూస్ : ఇప్ప‌టికే రంగారెడ్డి జిల్లా మూడు ముక్క‌లైంది.. మ‌ళ్లీ 27 మున్సిపాలిటీల‌ను 27 జాగాల్లో క‌లిపేసి.. రంగారెడ్డి జిల్లా అస్తిత్వాన్ని దెబ్బ‌తీశారు అని ఇబ్ర‌హీంప‌ట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మ‌ల్‌రెడ్డి రంగారెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ త‌ప్పుతో రంగారెడ్డి ప్ర‌జ‌లు మ‌న‌ల్ని క్ష‌మించ‌రు అని ఆయ‌న పేర్కొన్నారు. శాస‌న‌స‌భ‌లో అసెంబ్లీలో పుర‌పాల‌క‌, జీహెచ్ఎంసీ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లుపై చ‌ర్చ సంద‌ర్భంగా మ‌ల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడారు.

రంగారెడ్డి జిల్లాలో ఉన్న 27 మున్సిపాలిటీల‌ను గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో విలీనం చేశారు. భ‌విష్య‌త్‌లో మంచి జ‌రగాల‌ని కోరుకుంటున్నాం. కానీ రంగారెడ్డి జిల్లా స్వ‌భావ‌మంతా చెడ‌గొట్టి అస్త‌వ్య‌స్తంగా చేశారు. 27 మున్సిపాలిటీల‌ను 27 జాగాల్లో క‌లిపేశారు. అర్థం ప‌ర్థం లేకుండా, ప్ర‌జ‌లతో మాట్లాడ‌కుండా చేయ‌డం మంచిది కాదు. రంగారెడ్డి జిల్లా అస్తిత్వాన్నిదెబ్బ‌తీయ‌డంతో ఈ జిల్లా ప్ర‌జ‌లు మ‌న‌ల్ని క్ష‌మించ‌రు అని మ‌ల్‌రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు.

జిల్లాలోని 27 మున్సిపాలిటీల‌కు సంబంధించి ప‌రిపాల‌నా సౌల‌భ్యం ఉండాల‌ని అంద‌రం అనుకుంటాం. కానీ కొంత మంది అధికారులు ఎవ‌ర్నీ సంప్ర‌దించ‌లేదు. క‌నీసం ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను తెలుసుకోలేదు. ఎక్క‌డ వార్డు పెట్టాలి..? ఎక్క‌డ‌ స‌ర్కిల్ పెట్టాల‌నే విష‌యాన్ని ప్ర‌జ‌లతో సంప్ర‌దింపులు చేయాలి. ఇప్ప‌టికే రంగారెడ్డి జిల్లా మూడు ముక్క‌లైంది. రాష్ట్రానికి వ‌చ్చే ఆదాయ‌మంతా రంగారెడ్డి జిల్లా నుంచే. అన్ని జిల్లాల‌కు రంగారెడ్డి జిల్లా నుంచి డ‌బ్బులు వ‌స్తున్నాయి. కానీ రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జ‌రుగుతుంది.. ప్ర‌జ‌లు క్ష‌మించ‌రు. రంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీల‌ను విలీనం చేసిన‌ప్పుడు సీఎం నిర్ణ‌యం తీసుకుని మంచి చేయాల‌ని కోరుకున్న‌ప్పుడు.. అక్క‌డ ఉండే ప్ర‌జ‌ల అభిప్రాయాలు తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉండే అని ఎమ్మెల్యే మ‌ల్‌రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు.

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఉండే 300 వార్డుల‌ను 12 జోన్లు, 60 స‌ర్కిళ్లుగా చేశారు. ఏ వార్డులో ఎన్ని ఓట్లు ఉన్నాయో, జ‌నాభా ఎంత ఉందో తెలుసుకోలేదు. ఒక్కో వార్డులో 15 వేలు, ఇంకో వార్డులో 60 వేలు ఉన్నాయి. ఇది స‌క్ర‌మంగా జ‌ర‌గ‌లేదు. ప‌రిపాల‌న సౌల‌భ్యం కోసం విభ‌జ‌న చేస్తున్న‌ప్పుడు ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర సంప్ర‌దింపులు జ‌రిపి ఏ వార్డు ఎక్క‌డ ఉండాల‌నే నిర్ణ‌యించి ఉండాల్సింది. మేం ప్ర‌జ‌ల‌కు ఏం జ‌వాబు చెప్పాలి. రేపు మ‌మ్మ‌ల్ని తిర‌గ‌నివ్వ‌రు.. అధికారుల‌ను తిర‌గ‌నివ్వ‌రు. అలాంటి ప‌రిస్థితి తీసుకొచ్చారు కొన్ని వార్డుల్లో. ప్ర‌జ‌ల‌కు అవ‌స‌రం లేని విధంగా ఇష్ట‌మొచ్చిన‌ట్లు పేప‌ర్ మీద గీసి చేస్తామంటే ప్ర‌జ‌లు క్ష‌మించ‌రు అని ఎమ్మెల్యే ఘాటుగా మాట్లాడారు.

రంగారెడ్డి జిల్లాను ముక్క‌లు ముక్క‌లు చేసి, స్వ‌భావాన్ని చెడ‌గొట్టారు. ఆదాయ వ‌న‌రుల‌ను ముక్క‌లు చేసి ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన‌ట్టు అవుతుంది. మున్సిపాలిటీల విభ‌జ‌న త‌ప్పుల‌త‌డ‌క‌గా ఉంది. హైద‌రాబాద్ ఒక వైపు, రంగారెడ్డి జిల్లా ఒక వైపు ఉండేలా ఈ మున్సిపాలిటీల విభ‌జ‌న చేయాలి. 27 మున్సిపాలిటీల ప్ర‌జ‌లు మ‌మ్మ‌ల్ని ప్ర‌శ్నిస్తున్నారు. రేపు రంగారెడ్డి జిల్లా ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్ల‌లేని ప‌రిస్థితి తీసుకొచ్చారు. ప్ర‌జ‌ల‌కు ఉండే స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వానిదే. ఏ స‌ర్కిల్ ఎక్క‌డుందో కూడా తెలియ‌ని ప‌రిస్థితి. ఒక్క నియోజ‌క‌వ‌ర్గాన్ని మూడు ముక్క‌లు చేశారు. స‌ర్కిల్ ఆఫీసు ఒక చోట‌, జోన‌ల్ ఆఫీసు మ‌రో చోట ఏర్పాటు చేశారు. ఇప్ప‌టికైనా అధికారులు స‌రి చేసి త‌ప్పును స‌రిదిద్దుకోవాలి. ఈ వ్య‌వ‌హారంలో సీఎం, ఇంచార్జి మంత్రి జోక్యం చేసుకుని రంగారెడ్డి ప్ర‌జ‌ల‌కు న్యాయం చేయాల‌ని ఎమ్మెల్యే మ‌ల్‌రెడ్డి రంగారెడ్డి కోరారు.

Advertisement

తాజావార్తలు

Advertisement