త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Akbaruddin Owaisi | మురుగు నీటి ప్ర‌వాహ కేంద్రంగా మూసీ : ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీ

MLA Akbaruddin Owaisi | మురుగు నీటి ప్ర‌వాహ కేంద్రంగా మూసీ న‌ది మారింద‌ని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు.

S

Hyderabad | Published On Jan 2, 2026, 3.02 pm IST

MLA Akbaruddin Owaisi | మురుగు నీటి ప్ర‌వాహ కేంద్రంగా మూసీ : ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీ
Advertisement

MLA Akbaruddin Owaisi | త్రినేత్ర‌.న్యూస్ : మురుగు నీటి ప్ర‌వాహ కేంద్రంగా మూసీ న‌ది మారింద‌ని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా మూసీ న‌ది పున‌రుజ్జీవంపై ఎమ్మెల్యే ఓవైసీ మాట్లాడారు.

నగర పరిసరాల్లోని చెరువుల వరద నీళ్లు మూసీలో కలుస్తున్నాయి. గండిపేట జలాల్లో కూడా మురుగునీరు కలుస్తోంది. గండిపేట నీళ్లు కూడా కలుషితమయ్యాయని సర్వేలో తేలింది. వికారాబాద్‌ నుంచి హిమాయత్‌సాగర్‌ వరకు ఎన్నిచోట్ల మురుగు కలుస్తుందో అధ్యయనం చేయాలి. 2022లో ప్రపంచవ్యాప్తంగా చేపట్టిన సర్వేలో అత్యంత కలుషిత నదుల్లో మూసీ 22వ స్థానంలో ఉంది. మూసీ పరివాహక ప్రాంతంలో అరుదైన పక్షుల ఆవాసాలు ఉన్నాయి. అరుదైన పక్షుల ఆవాసాల దృష్ట్యా మూసీ పరివాహకాన్ని కాపాడాలి. మూసీ అభివృద్ధి ప్రాజెక్టు చేపడుతున్న సంస్థ దీనిపైనా అధ్యయం చేయాలి. దశాబ్దాల కింద నిర్మించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లో పూడిక తీసి, వాటి సామర్థ్యం పెంచాలని కోరారు.

అనంతగిరి నుంచి మూసీ నది ప్రవాహం మొదలవుతుంది. అనంతగిరి నుంచి మూసీ ప్రవహించే వరకు అధ్యయనం జరగాలి. మూసీ ప్రక్షాళన చేపడుతున్న వివిధ దశల్లో మొత్తం అధ్యయనం జరుగుతుందా? ఉస్మాన్‌సాగర్‌ నుంచి బాపూఘాట్‌ వరకు 55 కి.మీ ప్రక్షాళన అని చెబుతున్నారు. మూసీ ప్రక్షాళన చేపట్టే ప్రాంతంలో రక్షణ భూములు, ప్రైవేటు ఆస్తులు ఎన్ని ఉన్నాయి. ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌కు గోదావరి జలాలు ఎలా తెస్తారో చెప్పాలి. జలాశయాల పరివాహక ప్రాంతం, ఆక్రమణలు ఎన్ని ఉన్నాయని అక్బ‌రుద్దీన్ ప్ర‌శ్నించారు.

మూసీ ప్రాజెక్టుతో పాటు చారిత్రక కట్టడాలను పరిరక్షించేలా చూడాలి. చార్మినార్‌ ప్రాంతంలో మూడు పాదచారుల వంతెనలు చేపట్టాలి. ఉస్మానియా ఆస్పత్రి సహా చారిత్రక కట్టడాల పరిరక్షణ చేపట్టాలి అని ఓవైసీ డిమాండ్ చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement