Ananya Panday | బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే మూడేళ్ల గ్యాప్ తర్వాత మరో తెలుగు మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అనన్య పాండే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై రిలీజ్‌కు ముందు పాన్ ఇండియన్ లెవెల్‌లో భారీగా హైప్ ఏర్పడింది. బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్మాణంలో భాగ్యస్వామి కావడం, అమెరికన్ దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ అతిథిగా కనిపించడంతో లైగర్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. కానీ ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్ కారణంగా ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ రిజల్ట్‌తో అనన్య పాండేకు తెలుగులో మరో అవకాశం రాలేదు. స్పెషల్ సాంగ్... మూడేళ్ల తర్వాత మళ్లీ టాలీవుడ్‌లోకి అనన్య పాండే రీఎంట్రీ ఇవ్వబోతుంది. అయితే హీరోయిన్‌గా కాదు. ఓ స్పెషల్ సాంగ్‌లో లైగర్ బ్యూటీ కనిపించబోతున్నట్లు సమాచారం. అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతున్న లెనిన్‌లో అనన్య సాండే స్పెషల్ సాంగ్‌లో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సాంగ్ కోసం తొలుత దక్షిణాదితో పాటు బాలీవుడ్‌కు చెందిన కొందరు టాప్ హీరోయిన్ల పేర్లను పరిశీలించారట మేకర్స్. కానీ వారందరిని కాదని అనన్య పాండేను సెలెక్ట్ చేసినట్లు టాక్. ఈ పాట కోసం అనన్యకు భారీగానే రెమ్యూనరేషన్‌ను ఆఫర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జనవరి నెలాఖరునహైదరాబాద్‌లో ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ జరుగనుందట. శ్రీలీల స్థానంలో... లెనిన్ మూవీకి మురళీకృష్ణ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నాడు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో అఖిల్ అక్కినేనికి జోడీగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. శుక్రవారం భాగ్యశ్రీ బోర్సే ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. భారతి అనే పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రకటించారు. పల్లెటూరి అమ్మాయిగా కంప్లీట్ ట్రెడిషనల్ లుక్‌లో భాగ్యశ్రీ కనిపించింది. తొలుత ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీలను తీసుకున్నారు. కానీ డేట్స్ అడ్టెస్ట్ కాకపోవడంతో శ్రీలీల ఈ మూవీ నుంచి తప్పుకుంది. ఆమె స్థానంలో భాగ్యశ్రీని ఫైనల్ చేశారు. లెనిన్ మూవీ ఈ ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సూర్యదేవర నాగవంశీతో కలిసి నాగార్జున ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.