త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Encounter | ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మ‌రో భారీ ఎన్‌కౌంట‌ర్‌

Encounter | మావోయిస్టు పార్టీ (Maoist Party)కి మ‌రోసారి భారీ ఎదురుదెబ్బ త‌గిలింది. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ (Chattisgarh) లోని సుక్మా జిల్లా (Sukma District)లో జ‌రిగిన భారీ ఎన్‌కౌంట‌ర్‌ (Encounter)లో 14 మంది మావోయిస్టులు (Maoist) మృతి చెందారు.

A

National | Published On Jan 3, 2026, 12.11 pm IST

Encounter | ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మ‌రో భారీ ఎన్‌కౌంట‌ర్‌
Advertisement

Encounter | మావోయిస్టు పార్టీ (Maoist Party)కి మ‌రోసారి భారీ ఎదురుదెబ్బ త‌గిలింది. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ (Chattisgarh) లోని సుక్మా జిల్లా (Sukma District)లో జ‌రిగిన భారీ ఎన్‌కౌంట‌ర్‌ (Encounter)లో 14 మంది మావోయిస్టులు (Maoist) మృతి చెందారు. కొంటా డివిజ‌న్ కిస్తారామ్ అడువుల్లో మావోయిస్టులు సంచ‌రిస్తున్నార‌నే స‌మాచారంతో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు పెద్ద ఎత్తున కూంబింగ్ చేప‌ట్టాయి. ఈ క్ర‌మంలో మావోయిస్టులు పోలీసుల‌పై కాల్పులు జ‌ర‌ప‌గా, దీనికి ప్ర‌తిగా భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ఎదురుకాల్పులు జ‌రిపాయి. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో 14 మంది మావోయిస్టులు మృత్యువాత ప‌డ్డారు.

మృతుల్లో కొంటా ఏరియా క‌మిటీ స‌భ్యులు

ఎన్‌కౌంట‌ర్‌లో మృతిచెందిన వారిలో కొంటా ఏరియా క‌మిటీ కార్య‌ద‌ర్శి, ఇత‌ర స‌భ్యులు ఉన్న‌ట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఎన్‌కౌంట‌ర్‌తో కొంటా ఏరియా క‌మిటీ మొత్తం హ‌త‌మైంద‌ని తెలిపారు. ఘ‌ట‌నా స్థ‌లం నుంచి పోలీసులు మూడు ఏకే 47 తుపాకుల‌తో పాటు భారీగా పేలుడు ప‌దార్థాలు స్వాధీనం చేసుకున్నారు. గ‌త జూన్‌లో మందుపాత‌ర‌తో కొంటా ఏఎస్పీని హ‌త్య చేసిన క‌మిటీ మొత్తం ఈ ఎన్‌కౌంట‌ర్‌లో మృతి చెంద‌డం గ‌మ‌నార్హం.

మ‌రో ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మావోయిస్టులు హ‌తం

బీజాపూర్‌లో జ‌రిగిన మ‌రో ఎన్‌కౌంట‌ర్‌లో ఇద్ద‌రు మావోయిస్టులు మృతి చెందారు. అక్క‌డ నుంచి కూడా భ‌ద్ర‌తా బ‌ల‌గాలు భారీగా ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశాన్ని మావోయిస్టు ర‌హితంగా చేస్తామ‌నే కేంద్ర‌ప్ర‌భుత్వం డెడ్‌లైన్ విధించుకున్న నేప‌థ్యంలో కేంద్రం ఆప‌రేష‌న్ క‌గార్‌ను ఉధృతం చేసింది.

Advertisement

తాజావార్తలు

Advertisement