త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | విషాదం.. స్కూటీ మీద వెళ్తూ ఆర్టీసీ బస్సు కింద పడి భార్యాభర్తలు స్పాట్ డెడ్

ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందడంతో తనను చూడటానికి వచ్చి తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడాన్ని జీర్ణించుకోలేక వారి కూతురు తట్టుకోలేకపోయింది. రోడ్డు మీద తల్లిదండ్రుల మృతదేహాలను చూసి గుండెలవిసేలా రోదించింది.

J

Hyderabad | Published On Jan 2, 2026, 2.19 pm IST

Hyderabad | విషాదం.. స్కూటీ మీద వెళ్తూ ఆర్టీసీ బస్సు కింద పడి భార్యాభర్తలు స్పాట్ డెడ్
Advertisement

Hyderabad | హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌లో విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ లోకల్ బస్సు ఢీకొని భార్యాభర్తలు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మలక్‌పేటలో ఉంటున్న తమ కూతురుని చూసేందుకు భార్యాభర్తలు ఇద్దరూ సూర్యాపేట నుంచి వచ్చారు. అనంతరం కొంచెం పని ఉందని చెప్పి ఇద్దరు స్కూటీ మీద వెళ్తున్నారు. మూసారాంబాగ్ హైటెక్ గార్డెన్ వైపు వెళ్తున్న వీళ్లు.. ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేసే ప్రయత్నం చేశారు.

ఈనేపథ్యంలో బస్సు.. వారి స్కూటీని ఢీకొట్టడంతో ఇద్దరు బస్సు వెనుక టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. అది దిల్‌సుఖ్‌నగర్ డిపోకి చెందిన బస్సు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందడంతో తనను చూడటానికి వచ్చి తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడాన్ని జీర్ణించుకోలేక వారి కూతురు తట్టుకోలేకపోయింది. రోడ్డు మీద తల్లిదండ్రుల మృతదేహాలను చూసి గుండెలవిసేలా రోదించింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement