త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

FSL Fire Accident | FSL అగ్నిప్రమాదం: కీలక కేసుల ఆధారాలన్నీ భద్రం.. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు

ఫోరెన్సిక్ ల్యాబ్ (FSL)లో జరిగిన అగ్నిప్రమాదంలో కీలక కేసుల ఆధారాలు కాలిపోయాయన్న వార్తలను దర్యాప్తు బృందం కొట్టిపారేసింది. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసులకు సంబంధించిన అన్ని ఆధారాలు భద్రంగా ఉన్నాయని, నిరాధారమైన వార్తలను నమ్మవద్దని FSL స్పష్టం చేసింది.

J

Hyderabad | Published On Feb 8, 2026, 3.32 pm IST

FSL Fire Accident | FSL అగ్నిప్రమాదం: కీలక కేసుల ఆధారాలన్నీ భద్రం.. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు
Advertisement

FSL Fire Accident | తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL)లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంపై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని దర్యాప్తు బృందం స్పష్టం చేసింది. ముఖ్యంగా సంచలనం సృష్టించిన 'ఓటుకు నోటు', 'ఫోన్ ట్యాపింగ్' కేసులకు సంబంధించిన కీలక ఆధారాలు కాలిపోయాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని పోలీసులు ఖండించారు.

ఓటుకు నోటు కేసు వివరాలు

2015లో నమోదైన 'ఓటుకు నోటు' కేసులో ACB సమర్పించిన 16 మెటీరియల్ ఆబ్జెక్టులపై FSL అప్పట్లోనే నివేదిక ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని మెటీరియల్స్, డాక్యుమెంట్లు 2021లోనే కోర్టుకు అందజేశామని దర్యాప్తు బృందం వెల్లడించింది. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఈ కేసుకు సంబంధించిన ఒక్క పత్రం కూడా FSL వద్ద లేదని వారు స్పష్టం చేశారు.

Also ReadForensic Lab | అనుమాన‌మే నిజ‌మైంది.. ఎఫ్ఎస్ఎల్ అగ్నిప్ర‌మాదంలో కాలిబూడిదైన కీలక ఫైళ్లు, ఆధారాలు!

ఫోన్ ట్యాపింగ్ కేసుపై స్పష్టత

ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ వద్దకు వచ్చిన మెటీరియల్స్ అన్నీ ఇప్పటికే పరిశీలన పూర్తి చేసుకున్నాయని అధికారులు తెలిపారు. మొత్తం 132 మెటీరియల్ ఆబ్జెక్టులలో కేవలం 7 మాత్రమే ఈ ఏడాది FSLకు వచ్చాయి. ఆ 7 మెటీరియల్స్‌పై కూడా పరిశీలన పూర్తయి, నివేదికలు సిద్ధంగా ఉన్నాయి. పరిశీలన అనంతరం చాలా వరకు మెటీరియల్స్‌ను పోలీసులకు తిరిగి అప్పగించడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసులకు సంబంధించిన అన్ని ఆధారాలు (Material Objects) సురక్షితంగా ఉన్నాయని, అగ్నిప్రమాదం వల్ల ఎటువంటి డేటా నష్టం జరగలేదని FSL టీమ్ భరోసా ఇచ్చింది.

వదంతులు నమ్మకండి

సాంకేతిక కారణాలతో జరిగిన ఈ అగ్నిప్రమాదాన్ని ఆసరాగా చేసుకుని, కొందరు పనిగట్టుకుని నిరాధారమైన వార్తలను ప్రచారం చేస్తున్నారని FSL విజ్ఞప్తి చేసింది. కేసుల విచారణకు సంబంధించి అన్ని ఆధారాలు భద్రంగా ఉన్నాయని, ప్రజలు ఇటువంటి పుకార్లను నమ్మవద్దని కోరింది.

Also Read: Forensic lab | ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నికీల‌లు.. ఓటుకు నోటు కేసు సాక్ష్యాలు భ‌ద్ర‌మేనా..?

Advertisement
Advertisement