Forensic lab | ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నికీలలు.. ఓటుకు నోటు కేసు సాక్ష్యాలు భద్రమేనా..?
Forensic lab | నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో శనివారం ఉదయం 10 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. భవనం మొదటి అంతస్తులోని కంప్యూటర్ ల్యాబ్‌లో తొలుత మంటలు చెలరేగి ఆ ఫ్లోర్ అంతట వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 40 కంప్యూటర్లతో పాటు కీలకమైన డాక్యుమెంట్స్, ఇతర వస్తువులు పూర్తిగా కాలిపోయాయి.
Forensic lab | త్రినేత్ర.న్యూస్ : నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో శనివారం ఉదయం 10 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. భవనం మొదటి అంతస్తులోని కంప్యూటర్ ల్యాబ్‌లో తొలుత మంటలు చెలరేగి ఆ ఫ్లోర్ అంతట వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 40 కంప్యూటర్లతో పాటు కీలకమైన డాక్యుమెంట్స్, ఇతర వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. అగ్నికీలలు ఎగిసిపడడంతో ఉద్యోగులు, ఇతర సిబ్బంది బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని, మంటలను అదుపు చేశారు. ఘటనాస్థలానికి నార్త్ జోన్ డీఐజీ శ్వేత, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
హార్డ్ డిస్క్‌లు అగ్నికి ఆహుతి..!
రాష్ట్రంలోని పలు కీలక కేసులకు సంబంధించిన పేపర్ ఫైల్స్, హార్డ్ డిస్క్‌లు అగ్నికి ఆహుతి అయ్యాయయని అధికారులు ధృవీకరించారు. పలు కేసులకు సంబంధించిన ఫిజికల్ ఎవిడెన్స్‌తో పాటు డీఎన్ఏ పరీక్షలు, ఫింగర్ ప్రింట్ విశ్లేషణకు సంబంధించిన వివరాలు కూడా మొదటి ఫ్లోర్‌లోనే భద్రపరిచారు. కీలక కేసులకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికలను కూడా ఇక్కడే భద్రపరిచారు. మొత్తంగా ఆయా కేసులకు సంబంధించిన పేపర్ వర్క్ పూర్తిగా దగ్ధమైనట్లు అధికారులు పేర్కొన్నారు.
ఓటుకు నోటు కేసు సాక్ష్యాలు భద్రమేనా..?
ఓటుకు నోటు కేసులో వీడియో, ఆడియో ఫైల్స్‌తో పాటు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, అలాగే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన డాటా, హార్డ్ డిస్కులు ఇక్కడే ఉన్నట్లు సమాచారం. అయితే అవి భద్రంగా ఉన్నాయా..? కాలి బూడిదయ్యాయా..? అనే దానిపై అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
డాక్యుమెంట్స్ కాలిపోయాయి : డీఎఫ్‌వో
డీఎఫ్‌వో శ్రీదాస్ ప్రమాదంపై మాట్లాడుతూ.. తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం జరిగినట్లు శనివారం ఉదయం 10.30 గంటలకు తమకు సమాచారం అందింది. దీంతో హుటాహుటిన తమ సిబ్బందితో పాటు ఫైరింజన్లతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఐదు గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశాం. మొదటి అంతస్తులో సెన్సిటివ్‌గా ఉన్న ప్లాస్టిక్ వస్తువులు కాలిపోయాయని వివరించారు. హార్డ్ డిస్కులు పూర్తిగా కాలిపోయాయా? పాక్షికంగా కాలాయా? అన్నది పరిశీలించాలని డీఎఫ్ఓ తెలిపారు. కెమికల్ ల్యాబ్ మెటీరియల్ ఉన్న రెండో అంతస్తుకు మంటలు వ్యాపించలేదు. అక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదని శ్రీదాస్ స్పష్టం చేశారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం : డీసీపీ శిల్పవల్లి
తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం సంభవించినట్లు డీసీపీ శిల్పవల్లి పేర్కొన్నారు. శనివారం ఉదయం 10 గంటలకు అగ్నిప్రమాదం జరిగినట్లు తమకు సమాచారం అందిందన్నారు. నేర పరిశోధనకు సంబంధించిన ఫైల్స్, ఎవిడెన్స్‌కు సంబంధించి ఈ ల్యాబ్ నుంచే ఆపరేషన్ జరుగుతుందని తెలిపారు. మంటల్లో కీలక ఫైల్స్ కాలిపోయిన విషయంపై ఇంకా స్పష్టత లేదన్నారు. మొదటి అంతస్తులో కంప్యూటర్స్ ఉంటాయని ఆమె వెల్లడించారు. ఐదు ఫైరింజన్ల సాయంతో మంటలను పూర్తిగా అదుపు చేశామన్నారు.
ఆఫీసు బాయ్‌కు అస్వస్థత..!
అగ్నిప్రమాదం జరిగిన వెంటనే దట్టమైన పొగలు కమ్ముకోవడంతో అక్కడే ఉన్న ఆఫీసు బాయ్ అస్వస్థతకు గురైనట్లు డీసీపీ శిల్పవల్లి పేర్కొన్నారు. ఇక అస్వస్థతకు గురైన బాధితుడిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించామన్నారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు నలుగురు ఉద్యోగులు లోపలే ఉన్నారన్నారు. మంటలు గమనించి వారు సురక్షితంగా బయటపడ్డారని ఆమె చెప్పారు. ఆఫీస్ బాయ్ అందించిన సమాచారంతోనే అధికారులందరూ అప్రమత్తమయ్యారని తెలిపారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
మే 21, 2026

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



